» »శ్రీరంగపట్నంలోని నిమిషాంబ ప్రసిద్ధ ఆలయంను సందర్శించండి

శ్రీరంగపట్నంలోని నిమిషాంబ ప్రసిద్ధ ఆలయంను సందర్శించండి

By: Venkata Karunasri Nalluru

"నిమిష" అనగా ఒక మినిట్, ఎవరైతే ఈ ఆలయమునకు వచ్చి భక్తితో నమ్మి తమ కోరికలు నెరవేరాలని ఆ తల్లికి విన్నవించుకుంటారో వారి యొక్క కోరికలను ఒక్క నిమిషంలో ఆ తల్లి తీరుస్తుంది. "నిమిషాంబదేవి" పార్వతీ దేవి యొక్క మరొక రూపం. ఈ ఆలయం కావేరీనది ఒడ్డున ఉన్నది.

Visit the Nimishamba Temple in Srirangapatna

PC: nimishambhatemple.kar.nic.in

నిమిషాంబ ఆలయ చరిత్ర:
ముమ్మడి కృష్ణరాజ వడయార్ పాలనలో 400 సంవత్సరాల క్రితం ఈ దేవాలయంను నిర్మించారు. రాతిలో ఒక శ్రీ చక్రం బలంగా నాటి దేవత ముందు ఉంచుతారు. ఈ ఆలయంలో ఏడు అంతస్తుల గ్రాండ్ ద్వారపు స్థూపం సాపేక్షంగా గల చిన్న గర్భగుడి ఉంది.

Visit the Nimishamba Temple in Srirangapatna

PC: nimishambhatemple.kar.nic.in

సాధారణమైన నమ్మకాలు:
భక్తులు, దేవతకు నిమ్మకాయలు మరియు నిమ్మ దండలు సమర్పిస్తారు. పూజారులు నిమ్మకాయలు తీసుకొని శ్రీ చక్రం వద్ద మరియు దేవత యొక్క పాదాల వద్ద ఉంచి పూజ చేసి భక్తులను ఆశీర్వదిస్తూ తిరిగి వాటిని ప్రసాదంగా ఇస్తారు.

ఈ ఆలయంలో నిమిషాంబతో పాటు, ముక్తీశ్వర (శివ), గణేశ, లక్ష్మి నారాయణ, హనుమాన్ వంటి ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి.

పెద్ద పండుగల సమయంలో:
దసరా సమయంలో, వరమహాలక్ష్మి మరియు దుర్గాష్టమి పండుగ సమయాలలో శుక్రవారాలే కాకుండా మామూలు రోజులలో కూడా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివస్తారు. మామూలుగా ఇక్కడ అంతగా రద్దీగా వుండదు. పర్యాటకుల సంఖ్య ఆకస్మికంగా పెరుగటంతో ఆలయంలో చాలా ఎక్కువగా రద్దీ వుంటుంది.

Visit the Nimishamba Temple in Srirangapatna

PC: nimishambhatemple.kar.nic.in

ఆలయ సమయాలు:
మామూలు రోజులలో ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 వరకు. ప్రత్యేక సందర్భాలలో ఉదయం 4:30 కు ఆలయం తెరుస్తారు.

నిమిషాంబ ఆలయమునకు వెళ్ళు దారి:
ఆలయం శ్రీరంగపట్నం నుండి 2 కి.మీ, మైసూరు నుండి 17కి.మీ, బెంగుళూరు నుండి 125 కి.మీ.ల దూరంలో ఉంది. మైసూరు నుండి అదేవిధంగా బెంగుళూరు నుండి క్రమం తప్పకుండా కెఎస్ఆర్ టిసి బస్సులు నడపబడుతున్నాయి. వీటి ద్వారా మీరు చేరుకోవచ్చు. లేదా మీ స్వంత వాహనాల ద్వారా నైనా చేరుకోవచ్చు.

మీరు రాత్రిపూట ఉండడానికి ఒక స్థలము కోసం ఎదురుచూస్తూ ఉంటే మీరు "మయూర రివర్ వ్యూ" తనిఖీ చేయవచ్చు లేదా శ్రీరంగపట్నంలో గల అంబెలీ హోటల్ రిసార్ట్ లో వుండవచ్చును.

Please Wait while comments are loading...