Search
  • Follow NativePlanet
Share
» »గోవా సముద్ర తీరంలో ఉండే ఈ అద్భుతమైన అగుడా ఫోర్ట్ వెళ్ళి చూడండి

గోవా సముద్ర తీరంలో ఉండే ఈ అద్భుతమైన అగుడా ఫోర్ట్ వెళ్ళి చూడండి

గోవా అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకొచ్చేవి సాగర తీరాలు. ఇక్కడ చిన్నా...పెద్దా తేడా లేకుండా అందరూ బీచ్ లలో ఆనంద విహారం చేస్తారు. జలక్రీడలలో పాల్గొంటారు. స్విమ్మింగ్, స్కూబాడైవింగ్ వంటి జలక్రీడలె

గోవా అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకొచ్చేవి సాగర తీరాలు. ఇక్కడ చిన్నా...పెద్దా తేడా లేకుండా అందరూ బీచ్ లలో ఆనంద విహారం చేస్తారు. జలక్రీడలలో పాల్గొంటారు. స్విమ్మింగ్, స్కూబాడైవింగ్ వంటి జలక్రీడలెన్నో ఇక్కడ ప్రసిద్ది. ఒక రకంగా చెప్పాలంటే గోవాకు ప్రధాన ఆదాయ వనరు ఈ బీచులే ! ఇవి గోవాలో పర్యాటక రంగానికి ఒక ఎత్తు. మరి గోవాలో బీచ్ లు కాకుండా ఇతర ఆకర్షణలు ఏవైనా ఉన్నాయా అంటే? ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. అవేవో కాదు హెరిటేజ్ ప్రదేశఆలు. వారసత్వ ప్రదేశాలైన అగుడా, ఛోపడం, సియోలిం గోవాలో తప్ప సందర్శించాలి. ఈవాల మనం అగుడా ఫోర్ట్ గురించి తెలుసుకుందాం..

అగుడా ఫోర్ట్

అగుడా ఫోర్ట్

అగుడా ఫోర్ట్ నిస్సందేహంగా భారతదేశంలో చక్కగా నిర్వహిస్తున్న వారసత్వ కట్టడాలలో ఒకటి.

PC: Nakul Dubey

ఇది 17వ శతాబద్దకాలం నాటి కోట

ఇది 17వ శతాబద్దకాలం నాటి కోట

ఇది 17వ శతాబద్దకాలం నాటి కోటను పోర్చుగీసు పాలకులు డచ్ మరియు మరాఠా పాలకుల దాడుల నుండి తమను సంరక్షించుకోవడానికిగాను నిర్మించారు. వేలాది పర్యాటకులు ఈ కోట సందర్శనకు వస్తారు.

PC: Nakul Dubey

పోర్చుగీసు పాలకులు మనకు ఇచ్చిన బహుమతి

పోర్చుగీసు పాలకులు మనకు ఇచ్చిన బహుమతి

పోర్చుగీసు పాలకులు మనకు ఇచ్చిన బహుమతిగా కనిపిస్తుంది అగువాడ కోట. అరేబియా అలల తాకిడిని తట్టుకునేలా, 79 ఫిరంగులతో శత్రుదుర్భేద్యంగా నిర్మించారు.'

PC: Manasa90304

సిన్క్వురియం, కండోలిం బీచ్‌లను

సిన్క్వురియం, కండోలిం బీచ్‌లను

సిన్క్వురియం, కండోలిం బీచ్‌లను విభజించే కోట లోపల 1864లో నిర్మించిన లైట్‌హౌస్‌ ఆకట్టుకుంటుంది.

PC:Mnvikas

సూర్యాస్తమయాన ఎర్రటి కోట అందం రెట్టింపవుతుంది.

సూర్యాస్తమయాన ఎర్రటి కోట అందం రెట్టింపవుతుంది.

సూర్యాస్తమయాన ఎర్రటి కోట అందం రెట్టింపవుతుంది. ఉదయాన్నే బీచ్‌లను సందర్శించే యాత్రికులు మధ్యాహ్నమయ్యేటప్పటికి కోటలో పాగా వేస్తారు.

PC: Nakul Dubey

అరేబియా సముద్రపు అందాలను

అరేబియా సముద్రపు అందాలను

అగుడా కోట మరియు అక్కడి లైట్ హౌస్ మీకు చూపు తిప్పుకోనివ్వని అరేబియా సముద్రపు అందాలను ఈ బీచ్ ఒడ్డు నుండి చూపుతాయి.

PC:Nikhilb239

ఇక్కడే ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్ తాజ్ వివంటాగా

ఇక్కడే ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్ తాజ్ వివంటాగా

ఇక్కడే ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్ తాజ్ వివంటాగా పిలువబడుతుంది. ఖర్చుకు వెనుకాడేవారు కాకుంటే ఈ రిసార్ట్ అద్భుత సౌకర్యాలను, ఆనందాలను కలిగిస్తుంది. సెలవుల కొరకు మీరు వెళ్లే ఫైవ్ స్టార్ హోటళ్ళను సైతం ఆహారం, అన్నింటికి అందుబాటుగా ఉండటంలో మరిపింపచేస్తుంది.

PC: Nikhilb239

అగుడా కోట సమీపంలో గోవా మరియు పోర్చుగీస్ నిర్మాణ శైలిని

అగుడా కోట సమీపంలో గోవా మరియు పోర్చుగీస్ నిర్మాణ శైలిని

అగుడా కోట సమీపంలో గోవా మరియు పోర్చుగీస్ నిర్మాణ శైలిని పేర్కొనడంతో, ఈ వసతి యూనిట్లు అన్ని విలాసవంతమైన సౌకర్యాలతోనూ బహిరంగంగా ఉంటాయి. అద్భుతమైన బాలినీస్ ప్రకృతి దృశ్యం, అరచేతులు చెట్లు మరియు అరేబియా సముద్రం మరియు గోవా యొక్క నమ్మశక్యంకాని దృశ్యాలు నిస్సందేహంగా గోవాను ముఖ్యంగా విహారయాత్రకు మరియు హనీమూనర్స్ కోసం ఖచ్చితమైన గమ్యంగా చేస్తాయి.

PC:Aviatorjk

పేరొందిన కండోలిం బీచ్

పేరొందిన కండోలిం బీచ్

అగుడా మరియు అగుడా బీచ్ లు పేరొందిన కండోలిం బీచ్ నుండి కొద్ది దూరంలోనే ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం అయిందంటే చాలు అగుడా కోట చుట్టు ప్రక్కల ప్రదేశం మొత్తం అనేక సెకండ్ హ్యాండ్ వస్తువుల మార్కెట్ తో నిండిపోతుంది. ఎన్నో పరికరాలు, దుస్తులు, చేతి కళల వస్తువుల వంటివి అతి చౌకగా అందుబాటులో ఉంటాయి.

PC: Nanasur

అగుడా కోట చేరాలంటే

అగుడా కోట చేరాలంటే

అగుడా కోట చేరాలంటే గోవాలోని అన్ని ప్రదేశాల నుండి తేలికగా చేరవచ్చు. కనుక ఈ ప్రాంతంలో మీరు బస చేయటం ఎంతో ఉపయోగకరం. అగుడా సందర్శించాలంటే అద్దె కారు లేదా టాక్సీలు విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ నుండి లభిస్తాయి. అదే స్వంత వాహనంలో వెళ్ళాలనుకునే వారికి మార్గాన్ని సూచించే బోర్డులు ప్రతి చోటా కనబడుతూనే ఉంటాయి.

PC:Aviatorjk

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X