Search
  • Follow NativePlanet
Share
» »మహాబలిపురంలో గల కృష్ణుడి గుహ దేవాలయం సందర్శించండి

మహాబలిపురంలో గల కృష్ణుడి గుహ దేవాలయం సందర్శించండి

ఇందులో మహాబలిపురం కృష్ణుడి గుహ దేవాలయం గురించిన పూర్తి ట్రావెల్ గైడ్ సమాచారం ఇవ్వబడినది.

By Venkata Karunasri Nalluru

మహాబలిపురాన్ని అధికారికంగా మామల్లాపురం అని అంటారు. ఇక్కడ గల గుహాలయాలు మరియు ఇతర చారిత్రాత్మక స్మారకాలు గత వైభవాన్ని గుర్తుకు చేస్తుంది. పల్లవుల పాలనలో ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందింది.

ఇక్కడ గల అనేక దేవాలయాలు ఈ రోజున ఈ స్థలం చరిత్రకారుల మరియు కళా ప్రేమికుల యొక్క దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇది ఏడవ మరియు తొమ్మిదవ శతాబ్దముల మధ్య ఇక్కడ నిర్మించబడ్డాయి. కృష్ణ గుహ దేవాలయం ఇక్కడ చూపరులకు మరింత ఆశ్చర్యం కలగచేస్తుంది.

ఇది కూడా చదవండి: భారతదేశం యొక్క అమేజింగ్ గుహ దేవాలయాలు

మహాబలిపురంలో గల కృష్ణుడి గుహ దేవాలయం

PC: Thamizhpparithi Maari

కృష్ణ గుహ దేవాలయం లేదా కృష్ణుడి మండపం మహాబలిపురంలోని రాక్ కట్ కేవ్ ఆలయాల్లో అతిపెద్దది. ఈ ఆలయం ఏడవ శతాబ్దం మధ్య కాలం నాటిది. శ్రీకృష్ణుడు ఇక్కడ పూజలందుకుంటాడు.

ఆలయం కూడా యునెస్కో ద్వారా డిక్లేర్డ్ చేయబడ్డ ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిర్మించబడినది. ఈ ఆలయం మహాబలిపురం వద్ద గల నిర్మించబడిన మాన్యుమెంట్స్ గ్రూప్ లలో ఇది ఒకటి.

మహాబలిపురంలోని కృష్ణుడు గుహ ఆలయానికి ఆర్కిటెక్చర్

శిలలతో కూడిన ​​పది గుహ ఆలయనిర్మాణాలలో మహాబలిపురం ఒకటి. ఈ ఆలయ ప్రాంతం పురాతన గుహ దేవాలయం. ఈ గుహ నిర్మాణంలో భారత పౌరాణిక సంఘటనలు వర్ణించబడ్డాయి.

మహాబలిపురంలో గల కృష్ణుడి గుహ దేవాలయం

PC: Ilya Mauter

ఇక్కడ శ్రీకృష్ణుడు తన చిటికెన వ్రేలుతి గోవర్ధన కొండను ఎత్తడాన్ని చూడవచ్చును. హిందూ మతం పురాణాలననుసరించి 'గోపికలు', వారి తలలపై మోసుకెళ్ళే నీటి కుండలు, మరియు అనేక రకాల దృశ్యాలు ఒక ఉల్లాసభరితమైన శ్రీకృష్ణుని యొక్క ఇతర చిత్రాలు ఈ గుహలో ఉన్నాయి.

కృష్ణుని గుహ దేవాలయం ఎలా చేరుకోవాలి

మహాబలిపురం పట్టణం నుండి 1 కి.మీ. దూరంలో కృష్ణ గుహ దేవాలయం వున్నది. ఆలయ సమీపంలోని రైల్వే స్టేషన్ పట్టణానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగల్పట్టు రైల్వేస్టేషన్.

మహాబలిపురం ఎలా చేరుకోవాలి

మహాబలిపురంలో గల కృష్ణుడి గుహ దేవాలయం

PC: mckaysavage

మహాబలిపురంలో చూడగల ఇతర పర్యాటక స్థలాలు

మహాబలిపురంలో అనేక ఇతర పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. అవి పంచ రథాలు, షోర్ టెంపుల్, వరాహ కేవ్ టెంపుల్, కృష్ణ వెన్న బాల్, భారత సీషెల్ మ్యూజియం మరియు మామల్లాపురం లైట్హౌస్ గా ఉన్నాయి.

మహాబలిపురంలో గల హోటల్స్

మహాబలిపురంలో అనేక హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్స్ మరియు హోటల్స్ బే ట్రెజర్ హైలాండ్ సముద్రతీరం మరియు రాడిసన్ బ్లూ రిసార్ట్ ఆలయం బే ఉన్నాయి.

మహాబలిపురంలో గల మరిన్నిహోటల్స్ కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X