Search
  • Follow NativePlanet
Share
» »జగాద్రి - దేవాలయాల నగరం !

జగాద్రి - దేవాలయాల నగరం !

By Mohammad

పర్యాటకులకు జగాద్రి ధార్మిక అనుభవాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. హర్యానా రాష్ట్రంలోని జగాద్రి పట్టణం ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన హరిద్వార్ కు 100 కి. మీ ల దూరంలో, రిషికేశ్ కు 121 కి మీ ల దూరంలో మరియు దేశ రాజధానైన న్యూ ఢిల్లీ నుండి 200 కి. మీ ల దూరంలో ఉన్నది.

జగాద్రి చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

జగాద్రి చుట్టుపక్కల గల పర్యాటక ప్రదేశాలు ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి. కాళేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం, చచ్రౌలీ, తేజావాలా, పచముఖీ హనుమాన్ మందిర్, మార్ మందిర్, ఖేరా మందిర్, గౌరీ శంకర్ మందిర్, మానసా దేవి మందిర్, గుగా మడి మందిర్ వాటిలో కొన్ని. అత్యుత్తమ నాణ్యత కలిగిన లోహాలకు (అల్యూమినియం, స్టెయిన్ లెస్ స్టీల్) జాగాద్రి ప్రసిద్ధి చెందినది. కలప వ్యాపారం, ఇంకా వివిధ రకాల వ్యాపారాలు నిత్యం జరుగుతుంటాయి.

ఇది కూడా చదవండి : హరిద్వార్ - దేవుల్ నివసించే నగరం !

జగాద్రి వాతావరణాన్ని మూడు ఋతువులు విభజించవచ్చు. అవి వరుసగా వర్షాకాలం, వేసవి కాలం మరియు శీతాకాలం. ఈ ప్రదేశం ఉష్ణ మండల ప్రాంతంలో ఉన్నది కనుక వేసవి కాలం వేసవిగా, శీతాకాలం చల్లగా ఉంటుంది.

బిలాస్ పూర్

బిలాస్ పూర్ లో వెళ్ళగానే మీకు కనిపించేవి పవిత్ర సరస్సులు. మహాభారత కావ్యం రాసిన వేద వ్యాస మహర్షి యొక్క ఆశ్రమం ఇక్కడే ఉండేది. రుణ మోచన్, కపాల్ మోచన్, సూర్య కుండ్ అనే పవిత్ర సరస్సుల్లో భక్తులు మునక వేస్తారు.

బిలాస్ పూర్ సరస్సు, జగాద్రి

బిలాస్ పూర్ సరస్సు, జగాద్రి

చిత్ర కృప : Sharad Mehta

కేవలం పైన పేర్కొన్న సరస్సులు కాదు క్రీ.శ. 9 - 10 వ శతాబ్దానికి చెందిన ఉమమహాదేవ విగ్రహం, క్రీ.శ. 11 -12 వ శతాబ్దానికి చెందినదిగా చెప్పబడుతున్న వినాయకుని విగ్రహం ఇక్కడ ఉన్నాయి.

ఆది బద్రి

శివాలిక్ పర్వత పాదాల చెంత ఉండే ఆది బద్రి ప్రశాంతత కోరుకొనేవారికి చకక్టి ప్రదేశం గా చెప్పవచ్చు. ఆది బద్రి లో ప్రసిద్ధి చెందిన శ్రీ కేదర్నాథ్ ఆలయం, మంత్రాదేవి, ఆది బద్రి నారాయణ ఆలయం లు ఉన్నాయి. పురావస్తు అధికారులు పురాతనమైన మూడు దిబ్బలను ఇక్కడ కనుగొన్నారు.

ఆది బద్రి, జగాద్రి

ఆది బద్రి, జగాద్రి

చిత్ర కృప : Kartazon Dream

బూరియా

బూరియా అనే చిన్న గ్రామ పంచాయితి జగాద్రి పట్టణానికి 7 కి. మీ ల దూరలో కలదు. ఈ ప్రదేశాన్ని అక్బర్ చక్రవర్తి హయాంలో తెలివైన వాడుగా గుర్తించబడ్డ బీర్బల్ పరిపాలించాడని చెప్తారు స్థానికులు.

బూరియా లో సందర్శించటానికి పాతాలేశ్వర మహాదేవ్ ఆలయం , సనాతన ధర్మ హనుమాన్ మందిర్ మరియు గురుద్వారా వంటి ధార్మిక ఆకర్షణలు ఉన్నాయి.

బూరియా సాహెబ్, జగాద్రి

బూరియా సాహెబ్, జగాద్రి

చిత్ర కృప : Harpreet Singh

జగాద్రి ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం

జగాద్రి కి సమీపాన అమృత్సర్ విమానాశ్రయం (305 కి. మీ దూరంలో), ఢిల్లీ విమానాశ్రయం (200 కి. మీ ల దూరంలో) లు కలవు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి జగాద్రి కి సులభంగా చేరుకోవచ్చు.

రైల్వే స్టేషన్

జగాద్రి లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఢిల్లీ, రిషికేశ్, హరిద్వార్ ల నుండి మరియు అమృత్సర్ నుండి ఈ రైల్వే స్టేషన్ మీదుగా రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం

జగాద్రి కి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ముఖ్యంగా ఢిల్లీ, హరిద్వార్, రిషికేశ్ ల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

 రైల్వే స్టేషన్, జగాద్రి

రైల్వే స్టేషన్, జగాద్రి

చిత్ర కృప : MaNav Maini

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X