Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడు అందాలు కేరళ నుండి చూస్తె ?

తమిళనాడు అందాలు కేరళ నుండి చూస్తె ?

తమిళ్ నాడు సుందర దృశ్యాలు చూడాలనుకుంటే ఒక్కసారి గ్రామీణ వాతావరణం కల కేరళలోని ఇడుక్కి జిల్లా లో కల రామక్కలమేడు సందర్సించాలి. రామక్కలమేడు ఒక హిల్ స్టేషన్. ఇది పడమటి కనుమలలో సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తున కలదు. రామక్కల మేదు అంటే ఒక కొండ ప్రాంతం. దీనిపై శ్రీరాముడు కాలు మోపాడని చెపుతారు. రావణుడు ఎత్తుపోయిన సీతా దేవి కొరకు అన్వేషిస్తూ శ్రీ రాముడు ఈ కొండను కూడా ఎక్కాడు. మరికొంత మంది ఈ కొండను తమిల్ నాడు లో నుండి చూస్తె, శ్రీరాముడి ముఖం వాలే వుంటుంది అని కూడా అంటారు. ఇక్కడ కల అతి విండ్ మిల్స్ లేదా గాలి మరలు టూరిస్ట్ లకు ఒక పెద్ద ఆకర్షణ. ఒక్కసారి తాజా గాలి అనుభూతులను పొందవచ్చు. కొండ కింది దిగువ భాగంలో రిసార్ట్ లు, హోటళ్ళు అతి త్వరలోనే ఏర్పరచానున్నారు. రామక్కలమేడు అందాలు కొండ కింది భాగం నుండి చూదాలు. ఇంతవరకూ ఎవరూ అన్వేషించని ఈ రామక్కలమేడు హిల్ స్టేషన్ తప్పక చూసి ఆనందించండి. ఇక్కడి నుండి తమిళ్ నాడు అందాలు తనివి తీరా చూసి ఆనందించండి.

ఉల్లాసమూ, ఉత్తేజమూ కలిగించే ట్రావెల్ ఆర్టికల్స్ అందిస్తున్న నేటివ్ ప్లానెట్ ... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని కధనాలు అందిస్తోంది. మీ పర్యటనా అనుభవాలు (500 మాటలకు తగ్గకుండా), సంబంధిత ఫోటోలు e-mail [email protected] లేదా [email protected] లకు పంపండి.

రామక్కలమేడు అందాలు

రామక్కలమేడు అందాలు

ఇడుక్కి ప్రదేశం, తమిళ్ నాడు సరిహద్దుగా, కేరళ రాష్ట్రంలో కలదు. కనుక కొండ పైకి ఎక్కి చూస్తె, తమిళ్ నాడు లోని బోడి మరియు కంబం గ్రామాలు కనపడతాయి. దృశ్యం దూరం అయినప్పటికీ ఎంతో బాగుంటుంది.

రామక్కలమేడు అందాలు

రామక్కలమేడు అందాలు

రామక్కలమేడు లోని కొండ అతి సుందరంగా వుంటుంది. మనం ఊహించిన దాని కంటే కూడా ఆనందాన్ని ఇస్తుంది. కొండపైకి ఎక్కితే, కొండ గాలి ఈలలు వేస్తూ మీ దుస్తులతో, హెయిర్ తో ఆటలాడుకుంటుంది.

రామక్కలమేడు అందాలు

రామక్కలమేడు అందాలు

రామక్కలమేడు ను గాలి ఊయల అంటారు. ఎందుకంటే అక్కడి గాలులు సుమారు గంటకు 35 కి. మీ. ల వేగంతో వీస్తాయి. ఇక్కడ కల అతి పెద్ద విండ్ మిల్స్ కేరళ రాష్ట్ర ఎనర్జీ ప్రాజెక్ట్ లలో ప్రధాన పాత్ర వహిస్తాయి.
4

రామక్కలమేడు అందాలు

రామక్కలమేడు అందాలు

ఈ కొండ పైకి ఎక్కేతపుడు మా రీడర్ లు కు చిన్న హెచ్చరిక. కారణం వర్షాకాలం. ఇక్కడ వర్షాలు, గాలి కలసి వాతావరణం కొద్దిపాటి అసౌకర్యం అని కూడా అనిపిస్తుంది. కనుక ఈ కొండలపైకి ట్రిప్ ప్లాన్ చేసే ముందు, వాతావరణ హెచ్చరికలు గమనించండి.

రామక్కలమేడు అందాలు

రామక్కలమేడు అందాలు

ఇక్కడ కల విగ్రహాలు, కొంతమంది ఆదివాసులవి. ఈ ప్రముఖులు, ఇడుక్కి డాం కొరకు కృషి చేశారు. వారి పేర్లు, కురువాన్ మరియు కురువట్టి. వీరిని ఒక మేక శపించినదని, ఆ కారణంగా వీరు ఇక్కడ కొండ రాళ్ళుగా మారారని చెపుతారు. డాం నిర్మాణం తర్వాత, వారి కొండ రాతి విగ్రహాలు ఇక్కడ పెట్టారు.

రామక్కలమేడు అందాలు

రామక్కలమేడు అందాలు

రామక్కలమేడు లో ఏ రకమైన వాణిజ్యం లేదు. కొండపై అసలు ఒక హోటల్ కూడా లేదు. ఆహారం దొరకదు. కొండ దిగువ భాగంలో కొన్ని హోటల్స్ ఉన్నప్పటికీ, అవి పెద్ద హోటళ్ళు కావు. రిసార్ట్ ల వంటివి అసలే లేవు. సమీప హోటళ్ళు ఇడుక్కి పట్టణంలో కలవు. వీటిని మీరు ముందస్తుగా బుక్ చేసికొనవచ్చు.

రామక్కలమేడు అందాలు

రామక్కలమేడు అందాలు

రామక్కలమేదుకు సమీప తెలిసిన ప్రదేశం కాత్తపాన్. ఇది 20 కి. మీ. ల దూరం. మున్నార్ ఇక్కడికి 70 కి. మీ.లు, తేక్కడి 43 కి. మీ. ల దూరంలో వుంటాయి. వేల్లతంలో కొద్దిపాటి శ్రమ అనిపించినప్పటికీ, ఈ ప్రదేశం చూస్తె చాలు శ్రమ మటుమాయం అవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X