Search
  • Follow NativePlanet
Share
» »గోవా చుట్టు పక్కల ఉన్న ఈ జలపాతాల వైపు అడుగులు వేశారా?

గోవా చుట్టు పక్కల ఉన్న ఈ జలపాతాల వైపు అడుగులు వేశారా?

గోవా చుట్టు పక్కల ఉన్న జలపాతాల్లో ట్రెక్కింగ్ కు అనుకూలమైన జలపాతాల గురించి కథనం.

గోవా అన్న తక్షణమే ప్రతి ఒక్కరికి అక్కడి బీచ్ లే గుర్తుకు వస్తాయి. చిన్న, పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ సముద్ర తీర ప్రాంతాల్లో అలలతో పోటీపడి కేరింతలు కొట్టాలనే గోవాకు వెలుతుంటారు. అయితే గోవా అంటే బీచ్ లే కాకుండా జలపాతాలు కూాడా ఉన్నాయి. అంతేనా అక్కడకు ట్రెక్కింగ్ ద్వారా వెళ్లే సదుపాయం కూడా ఉంది. సాహస క్రీడలంటే ఇష్టపడే వారికి గోవా చుట్టు పక్కల ఉన్న వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ సదుపాయం రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం సమయంలో అక్కడి జలపాతాలన్నీ కొత్త అందాలను సంతరించుకొని ఉంటాయి. గోవా చుట్టు అనేక జలపాతాలు ఉన్నా టోడో వాటర్ ఫాల్ట్రె, టాబ్డి సుర్లా వాటర్ ఫాల్, సవరీ వాటర్ ఫాల్ , సదా వాటర్ ఫాల్ , పాలీ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ ఐదు జలపాతాల గురించిన క్లుప్త వివరణ మీ కోసం...

టోడో వాటర్ ఫాల్ ట్రెక్

టోడో వాటర్ ఫాల్ ట్రెక్

P.C: You Tube

ప్రక`తి ప్రేమికులకు, సాహస యాత్రలంటే ఇష్టపడే వారికి టోడో వాటర్ ఫాల్ ట్రెక్ బాగా నచ్చుతుంది. పచ్చటి అడవులను దాటుకొంటూ ముందుకు సాగి పోయి జలజలా రాలే జలపాతాన్ని చూడటం ఎవరికి ఇష్టముండదు చెప్పండి? నేత్రవాళి అభయారణ్యం గుండా సాగిపోయే ఈ ట్రెక్కింగ్ లో మీకు అంతరించే స్థితికి చేరిన హార్నిబిల్, బ్లాక్ పాంథర్, కింగ్ కోబ్రా, స్లెండర్ లోరిస్ వంటి వంటి ఎంతో అరుదైన జంతువులు మీకు కనువిందు చేస్తాయి.

టాబ్డి సుర్లా వాటర్ ఫాల్ ట్రెక్

టాబ్డి సుర్లా వాటర్ ఫాల్ ట్రెక్

P.C: You Tube

గోవా చుట్టు పక్కల బాగా ప్రాచూర్యంలో ఉన్న ట్రెక్కింగ్ మార్గాల్లో టాబ్డి సుర్లా వాటర్ ఫాల్ ట్రెక్ ఒకటి. చిక్కటి అడవుల మధ్య దాదాపు ఒకటిన్నర గంట నడక తర్వాత అందవమైన వాటర్ ఫాల్ ను చూడవచ్చు. అంతే కాకుండా ఆ వాటర్ ఫాల్ లో తడుస్తూ జలకాలు కూడా ఆడవచ్చు. ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఉండి ఇప్పుడిప్పుడే ట్రెక్కింగ్ వెలుతున్న వారికి ఈ మార్గం ఎంతో అనుకూలం.

సవరీ వాటర్ ఫాల్ ట్రెక్

సవరీ వాటర్ ఫాల్ ట్రెక్

P.C: You Tube

నేత్రావళి అభయారణ్యంలో ఉన్న మరో అద్భుతమైన జలపాతం సవరీ జలపాతం. కాళీ నది పై ఏర్పడిన ఈ జలపాతం చేరుకోవడానికి అటవీ మార్గంలో దాదాపు 5 కిలోమీటర్ల దూరం ప్రయానం చేయాలి. ఈ మార్గంలో మీకు చిన్నచిన్న గ్రామాలు కూడా ఎదురవుతాయి. అంతేకాకుండా వరి పైర్లు, పిల్ల కాలువలు కూడా మీకు సవారీ జలపాతానికి దారి చెబుతాయి. ఐదు కిలోమీర్ల దూరం అయినా కూడా ఈ ట్రెక్ మార్గం అంత కఠింనంగా ఉండదు.

సదా వాటర్ ఫాల్ ట్రెక్

సదా వాటర్ ఫాల్ ట్రెక్

P.C: You Tube

గోవా-కర్నాటక సరిహద్దులో ఉన్న చోర్లా ఘాట్ వద్ద ఈ అందమైన సదా జలపాతం ఉంటుంది. దాదాపు గంటన్నర సాగే ఈ ట్రెక్ మార్గం జలపాతానికి దగ్గరగా ఉన్న సత్తారి వద్ద ప్రారంభవుతుంది. రెండు కొండల నడుమ సాగే ఈ ట్రెక్ మార్గం కొంత కఠినత్వంతో కూడుకొని ఉంటుంది. దాదాపు ఎనిమిది కిలోమీర్లు పచ్చటి అడవుల మధ్య అక్కడి ప్రక`తి అందాలను చూస్తూ ముందుకు సాగి పోతూ ఉంటే సమయం ఇట్టే గడిచిపోతుంది.

పాలీ వాటర్ ఫాల్ ట్రెక్

పాలీ వాటర్ ఫాల్ ట్రెక్

P.C: You Tube

పాలీ వాటర్ ఫాల్ కు శివలింగ జలపాతం అని కూడా పేరు. గోవా చుట్టు పక్కల ఉన్న జలపాతాల్లో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే జలపాతాల్లో పాలీ వాటర్ ఫాల్ కూడా ఒకటి. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి హోరు శబ్దంతో కిందికి దుముకే ఈ జలపాతం హోయలు చూడాల్సిందేకాని వర్ణించడానికి అక్షరాలు చాలవు. చిన్న బురద కయ్యలు, కఠినమైన శిలలు, దాటు కొంటూ దాదాపు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకు ఈ జలపాతం కనిపిస్తుంది. వాల్పోయి అనే గ్రామం నుంచి ఇక్కడ ట్రెక్ ప్రారంభమవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X