Search
  • Follow NativePlanet
Share
» »రూ.5.5 కోట్లు ఖర్చుచేస్తేనే ఇక్కడ పెళ్లికి అనుమతి

రూ.5.5 కోట్లు ఖర్చుచేస్తేనే ఇక్కడ పెళ్లికి అనుమతి

మహారాజ ఎక్స్ ప్రెస్ లో జరిగే వివాహం గురించి.

By Kishore

సాధారణంగా వివాహం పెళ్లిమంటపాలు లేదా రిసార్టుల్లో జరుగుతాయి. అయితే ఇలా నలుగురు నడిచిన దారిలో నడవడం ఇష్టం లేదనుకొనేవారి కోసం భారతీయ రైల్వే శాఖ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అదే వెడ్డింగ్ ఆన్ వీల్స్. అంటే చలించే రైలులో వివాహం అన్నమాట. మొత్తం 8 రోజుల పాటు జరిగే ఈ పెళ్లి వేడుక మొత్తం రైలులోనే ఉంటుంది. అంతేకాకుండా ఆ ఎనిమిది రోజులూ రైలు వెళ్లే ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను కూడా చూడవచ్చు. ఇందుకు అయ్యే ఖర్చుమాత్రం కాస్త ఎక్కువే. అయినా ముందే చెప్పినట్లు విభిన్నంగా ఆలోచించేవారు మాత్రం ఇటువంటి వివాహాలను చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారిని ఎలా తిడుతారో తెలుసాఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారిని ఎలా తిడుతారో తెలుసా

1. నలుగురిలో ఒక్కడిగా

1. నలుగురిలో ఒక్కడిగా

P.C: YouTube

నలుగురితో పాటు కాకుండా నలుగురులో ఒక్కడిగా ఉన్నలనుకొన్నవారికి మాత్రమే ఈ విధానంలో పెళ్లి చేసుకోవడం నచ్చుతుంది. ఇందు కోసం ఎనిమిది రోజుల పాటు చలిస్తున్న రైలులోనే గడపాల్సి ఉంటుంది.

2. ఐఆర్సీటీసీ

2. ఐఆర్సీటీసీ

P.C: YouTube

భారతీయ రైల్వే విభాగమైన ఐఆర్సీటీసీ రూపొందించిన వెడ్డింగ్ ఆన్ వీల్స్ ప్యారేజీ ద్వారా మీరు చలిస్తున్న రైలులో వివాహం చేసుకోవచ్చు. అంతే కాకుండా వివాహం సమయంలోనే ఎంపిక చేసిన కొన్ని పర్యాటక ప్రాంతాలను కూడా చూడవచ్చు.

3. మహారాజ ఎక్స్ ప్రెస్

3. మహారాజ ఎక్స్ ప్రెస్

P.C: YouTube

ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మహారాజ ఎక్స్ ప్రెస్ ను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక ప్యాకేజీని అనుసరించి ఈ రైలు ద్వారా మనం ముంబై, ఢిల్లీ, అజంతా, ఉదయ్ పూర్, జోధ్ పూర్, బికనీర్, జయ్ పూర్, ఆగ్రా పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. మరో ప్యాకేజీలో వారణాసితో సహా మరికొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. కేవలం పెళ్లి చేసుకొనేవారే కాకుండా ఇలా రైలులో జరిగే రాయల్ వెడ్డింగ్ ను ప్రత్యక్షంగా చూసే ఏర్పాటును కూడా రైల్వే శాఖ కల్పిస్తోంది. ఇందు కోసం కొంత రుసుమును చెల్లించాల్సిందే.

4. రూ.5.5 కోట్లు చెల్లించాలి

4. రూ.5.5 కోట్లు చెల్లించాలి

P.C: YouTube

ఇందు కోసం దాదాపు రూ.5.5 కోట్లు చెల్లించాలి. ఈ వివాహ సమయంలో వధూవరులతో సహా మొత్తం 88 మందికి మాత్రమే ఈ రైలులో ప్రవేశం కల్పిస్తారు. ఆ ఎనిమిది రోజుల పాటు అతిథులు కోరుకొన్న వివిధ రకాల ఆహార పదార్థాలను రైల్వే శాఖ సమకూరుస్తుంది.మనం కోరుకొన్న సంప్రదాయంలో వధూవరులకు వివాహాన్ని చేస్తారు. అందుకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను రైల్వే శాఖ సమకూరుస్తుంది. కేవలం మనం డబ్బులు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది.

5. 20 డీలక్స్ క్యాబిన్స్

5. 20 డీలక్స్ క్యాబిన్స్

P.C: YouTube

అత్యంత ఖరీదైన ఈ మహారాజ ఎక్స్ ప్రెస్ రైలులో 20 డీలక్స్ క్యాబిన్, 18 జ్యూనియర్ సూట్స్, 4 సాధారణ సూట్స్, ఒక ప్రెసిడెన్సియల్ సూట్స్ ఉంటాయి. ప్రెసిడెన్సియల్ సూట్ చూడటానికి అత:పురంలా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X