Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు టు నృత్యగ్రామ్ వన్ డే ట్రిప్ అనుభూతులు !

బెంగళూరు టు నృత్యగ్రామ్ వన్ డే ట్రిప్ అనుభూతులు !

నృత్యగ్రామ్ పరిసరాలు ఎంతో కళాత్మకంగా, అద్భుతంగా, చూడముచ్చటగా ఉంటాయి. ఆల్రెడీ చూసేసిన వారికి కూడా ఇది ఒక కొత్త ప్రదేశంగానే కనిపిస్తుంది.

By Mohammad

ఉదయం నుండి సాయంత్రం వరకు తీరికలేకుండా శ్రమ పడుతున్నారా ? ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుంది ..! ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటున్నారా ? లేదా వారాంతంలో ఏదైనా సినిమాకో, షికారు కో వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా ? మీలాంటి వారికోసమే 'నృత్యగ్రామ్' ఉన్నది.

నృత్యగ్రామ్ పరిసరాలు ఎంతో కళాత్మకంగా, అద్భుతంగా, చూడముచ్చటగా ఉంటాయి. ఆల్రెడీ చూసేసిన వారికి కూడా ఇది ఒక కొత్త ప్రదేశంగానే కనిపిస్తుంది. ఏదేమైనా 'నృత్యగ్రామ్' గ్రామం తప్పక చూడవలసిన ప్రదేశం. బెంగళూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో, హీసర ఘట్ట గ్రామానికి చేరువలో ఈ గ్రామం ఉన్నది. బెంగళూరు నుండి ప్రతి ఒక్కరూ సులభంగా నృత్యగ్రామ్ చేరుకోవచ్చు. ఆవిధమైన రవాణా సౌకర్యాలు నగరం నుండి కల్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి అద్భుత రోడ్ ట్రిప్ ప్రయాణాలు !

బస్సుల్లో కాక సొంత వాహనాల్లో లేదా బైక్ ల మీద ఫ్రెండ్స్ తో లేదా ఉద్యోగ సహచరులతో నృత్యగ్రామ్ వెళితే ట్రిప్ ఎంతగానో ఎంజాయ్ చేయవచ్చు. మీరు బస్సులోనే వెళితే డైరెక్ట్ నృత్యగ్రామ్ వెళతారు అదే బైక్ ఉండే ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగి ఆకర్షణీయ ప్రదేశాలను తిలకించవచ్చు. బెంగళూరు నుండి నృత్య గ్రామ్ వెళ్ళే దారిలో కనిపించే ఆకర్షణీయ ప్రదేశాలను గమనిస్తే

నృత్యగ్రామ్ ఎలా చేరుకోవాలి ?

నృత్యగ్రామ్ ఎలా చేరుకోవాలి ?

నృత్యగ్రామ్ సమీపాన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (45 కి.మీ) కలదు. రైళ్ళలో వచ్చే వారు 30 కి.మీ ల దూరంలో ఉన్న బెంగళూరు రైల్వే స్టేషన్ లేదా యశ్వంతపూర్ రైల్వే జంక్షన్ లలో దిగి, మెజెస్టిక్ వచ్చి బస్సు ఎక్కవచ్చు. మెజెస్టిక్ నుండి నృత్యగ్రామ్ కు ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు(డీలక్ష్ మరియు లగ్జరీ బస్సులు) అందుబాటులో ఉంటాయి. గంట లేదా గంటన్నార ప్రయాణ సమయంగా ఉంటుంది.

చిత్ర కృప : Alagu

నృత్య గ్రామ్ ఎప్పుడు వెళ్ళాలి ?

నృత్య గ్రామ్ ఎప్పుడు వెళ్ళాలి ?

సోమవారం మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో నృత్యగ్రామ్ మూసేస్తారు. సోమవారం తప్పనిచ్చి మిగితా రోజుల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరుస్తారు.

చిత్ర కృప : Tim Schapker

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బెంగళూరు నగరంలో చూసిన ప్రదేశాలనే చూసి చూసి విసిగెత్తిపొయిన వారికి నృత్యగ్రామ్ టూర్ చక్కటి వినిదాన్ని పంచుతుంది. ఈ డ్రైవ్ లో మీరు నెమలి స్యాంక్చురీ, హీసరఘట్ట సరస్సు ను చూడవచ్చు.

చిత్ర కృప : Shalini Satish

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బెంగళూరు వాతావరణానికి అలవాటుపడ్డ వారికి ఈ టూర్ రిలాక్స్ ఇస్తుంది. దారి పొడవునా వైన్ యార్డ్ లు, పక్షులు, అడవులు , పచ్చని పంటపొలాలు, నార పట్టుకొని బయలు దేరే రైతులు, ఎద్దుల బండీ లు .. మొత్తంగా కోనసీమ వాతావరణం తలపిస్తుంది.

చిత్ర కృప : Art of Bicycle Trips

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బయల్ కెరె మరియు హీసరఘట్ట, బెంగళూరు నగరానికి వాయువ్య భాగంలో ఉంటాయి. బయల్ కెరె యశ్వంతాపూర్ కు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యశ్వంతపూర్ సర్కిల్ కు వెళ్లి అక్కడి నుంచి మతికెరె వైపు ప్రయానించండి.

చిత్ర కృప : Tejas Pande

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

పాత BEL ఫ్లై ఓవర్ మీదుగా ప్రయాణిస్తూ ముందుకు వెళితే జలహ్హలి (తూర్పు), వినాయక్ నగర్, దొడ్డ బయల్ కెరె వస్తుంది. బయల్ కెరె కు హీసరఘట్ట కు మధ్య దూరం 15 కిలోమీటర్లు.

చిత్ర కృప : Kiran Reddy

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బయల్ కెరె నుండి హీసరఘట్ట కు వెళుతున్న మార్గంలో తమ్మరాసనహళ్లి, సిల్వెపుర అనే మరో రెండు గ్రామాలు కనపడతాయి. హీసరఘట్ట సరస్సు నుండి నృత్య గ్రామ్ వెళ్ళే అన్ని మార్గాలలో డైరెక్షన్స్ ఉంటాయి. అవి అనుసరిస్తూ సులభంగా చేరుకోవచ్చు .

చిత్ర కృప : Wendy North

ట్రావెల్ టిప్స్

ట్రావెల్ టిప్స్

ఉదయం 5 : 30 గంటల సమయంలో ప్రయాణం మొదలు పెడితే, 6:30 కల్లా బయల్ కెరె లోని బర్డ్ స్యాంక్చురీ చేరుకోవచ్చు. అటవీ అధికారుల అనుమతి తీసుకొని స్యాంక్చురీ లోని అనేక పక్షులను చూడవచ్చు. మీకు సమయం లేకపోతే బయటి వైపు నుండి కూడా ఒక లుక్ వేయవవచ్చు. అంతేకాదు ఇక్కడ నెమలి అరుపులను, పురివిప్పి నాట్యం చేసే దృశ్యాలను తిలకించవచ్చు.

చిత్ర కృప : Paul Williams

ఉదయం అల్పాహారం

ఉదయం అల్పాహారం

అల్పాహారం వెంట తీసుకొని వెళ్తే ఏదైనా దారిలో చెట్టు నీడలో లేదా అరుగు మీద కూర్చొని తినవచ్చు. రోడ్ బాగానే ఉంటుంది కానీ సింగల్ రోడ్. ఎదురుగా వాహనాలు వస్తుంటాయి జాగ్రతా ..! తాజ్ కుటీర్ అనే హోటల్ ఈ మార్గంలో ఉన్న డీసెంట్ హోటల్.

చిత్ర కృప : Abhijith Rao

హెచ్ ఎం టి ఫ్యాక్టరీ

హెచ్ ఎం టి ఫ్యాక్టరీ

జలహళ్లి వద్ద హెచ్ ఎం టి ఫ్యాక్టరీ ఉన్నది. ఇక్కడ చేతి గడియారాలను తయారుచేస్తారు. బస్ స్టాప్ దగ్గర ఉన్న హెచ్ ఎం టి షో రూం లో క్లాసిక్ వాచ్ లను కొనుగోలు చేసుకోవచ్చు. వాచ్ చూసినప్పుడల్లా మీకు టూర్ సన్నివేశాలు కళ్ళముందర గుర్తుకువస్తాయి. పాత వాచ్ ల మీద 40 % డిస్కౌంట్ కూడా ఇస్తారు.

చిత్ర కృప : Matthew Wild

హీసరఘట్ట సరస్సు

హీసరఘట్ట సరస్సు

హీసరఘట్ట సరస్సు ను తాగునీటి అవసరాల కోసం నిర్మించారు. ఈ ప్రదేశంలో వివిధ జాతులకు చెందిన పక్షులు కింగ్ ఫిషన్, మైనా, పుర్పుల్ సన్ బర్డ్స్ మొదలైనవి విహరిస్తుంటాయి. ఎండా కాలంలో సరస్సు లో నీళ్ళు అంతగా కనిపించవు కానీ మాన్సూన్/ వర్షాకాలంలో నిండుగా కనిపిస్తాయి.

చిత్ర కృప : balakrishna menon

పంట పొలాలు

పంట పొలాలు

ఉదయాన్నే ఇంటిముందు కలాపిలు చల్లింటారు. ముగ్గులు వేసింటారు. గడ్డపార, నాగలి పట్టుకొని రైతులు పొలాలకు వెళుతుంటారు. ఎద్దులు, ఆవులు, పక్షులు ... మొత్తంగా అచ్చమైన పల్లెటూరు ను గుర్తుకుతెస్తాయి అక్కడి ప్రకృతి అందాలు.

చిత్ర కృప : frozen stills

ఆదర్శ్ టివి మరియు ఫిలిం ఇన్స్టిట్యూట్

ఆదర్శ్ టివి మరియు ఫిలిం ఇన్స్టిట్యూట్

హీసరఘట్ట నుండి నృత్యగ్రామ్ వెళ్ళే దారిలో ఆదర్శ్ టివి మరియు ఫిలిం ఇన్స్టిట్యూట్ కనిపిస్తుంది. దీనిని 1973 వ సంవత్సరంలో బి ఆర్ పి స్వామి నాగేంద్ర రావు సహకారంతో కట్టించారు. అది నటీనటులను తయారు చేసే ఒక వేదిక. యాక్టింగ్, ప్లే బ్యాక్ సింగింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ లు ఇక్కడ నేర్పిస్తారు.

చిత్ర కృప : adarshafilminstitute.com

నృత్యగ్రామ్

నృత్యగ్రామ్

నృత్యగ్రామ్ గ్రామం ప్రసిద్ధ ఒడిస్సి నృత్యకారిణి ప్రతిమా బేడి చే స్ధాపించబడింది. ప్రాచీన గురుకుల సంప్రదాయ రీతిలో నృత్యాన్ని బోధించాలనే మంచి ఆలోచనతో ఆమె ఈ గ్రామాన్ని స్ధాపించింది.

చిత్ర కృప : Amit1691

నృత్య గ్రామ్ డాన్స్ స్కూల్

నృత్య గ్రామ్ డాన్స్ స్కూల్

నృత్యగ్రామ్ లో బోధించే నాట్యాలు భరత నాట్యం, కూచిపూడి, మణిపురి, కథాకళి వంటి భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. నాట్య తరగతులను వారానికి 6 రోజులపాటు ప్రతి రోజూ 8 గంటలు నేర్పిస్తారు. ఆదివారం పూట లోకల్ విలేజ్ పిల్లలకు స్పెషల్ తరగతులు నిర్వహిస్తారు.

చిత్ర కృప : Yogesh Balasubramanian

వివిధ గురుకులాలు

వివిధ గురుకులాలు

ఒడిస్సీ గురుకులం, మొహని అట్టం గురుకులం, కథక్ గురుకులం వంటి వాటిని సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఇక్కడ అందమైన ఒక దేవాలయం కూడా కలదు.

చిత్ర కృప : S Jagadish

గ్రామ వాతావరణం

గ్రామ వాతావరణం

గ్రామ సహజ అంద చందాలు ప్రత్యేకించి గ్రామ నిర్మాణంలో వాడిన నిర్మాణ వస్తువుల తయారీ వంటివి సందర్శకులు ప్రతి ఒక్కరికి మరచిపోలేని అనుభవాలుగా ఉంటాయి. ఈ గ్రామాన్ని ప్రఖ్యాత శిల్పి గెరార్డ్ డా కున్హా రూపొందించారు. బయలు ప్రదేశాలు, అక్కడి పచ్చదనాలు, మట్టి నిర్మిత భవనాలు ఈ నృత్యగ్రామ్ కు గ్రామీణ శోభను కల్పిస్తాయి.

చిత్ర కృప : Tim Schapker

వసంత హబ్బ

వసంత హబ్బ

నృత్యగ్రామ్ సందర్శించాలంటే, వసంత హబ్బ పండుగ సమయంలో దర్శించాలి. ఈ పండుగ వసంతరుతువులో ఇక్కడ జరుపుతారు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్త కళాకారులు ఇక్కడకు వచ్చి పాల్గొని తమ తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించుకుంటారు.

చిత్ర కృప : Kailasher

లంచ్

లంచ్

ఇంత జర్నీ చేస్తున్నారు ... తిరుగుతున్నారు ... ఆకలి కావటం లేదా ఉదయం తినింది ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది. మరి లంచ్ ఎక్కడి చెయ్యాలి? నృత్యగ్రామ్ కు ఎదురూగా తాజ్ కుటీల్ ఉంటుంది. అక్కడ లంచ్ బాగుంటుంది. అచ్చం పల్లెటూరు వాతావరణం మధ్యలో తింటున్నట్లు ఉంటుంది.

చిత్ర కృప : Niranjan Jahagirdar

అంకిత ఆలయం

అంకిత ఆలయం

దీనిని దేవాలయం అనడం కంటే సంప్రదాయ నృత్య పాఠశాల అనటం బెటర్. దీనిని 1998 వ సంవత్సరం లో హీసర ఘట్టు సమీపంలో గురు కేళు చరణ్ మహాపాత్ర అభినయ భంగిమలతోను, అందమైన నృత్య శిల్పాలతో ఎంతో అందంగా నిర్మించాడు. నృత్య గ్రామ్ ను సందర్శించేవారు ఈ అంకిత ఆలయాన్ని తప్పక చూడాలి.

చిత్ర కృప : Abhilash Ramachandran

తిరుగు ప్రయాణం లో ... !

తిరుగు ప్రయాణం లో ... !

టూర్ చివరి అంకానికి వచ్చేశాం. తిరుగు ప్రయాణంలో చిక్కబనవర సరస్సు, లింగనహళ్లి, మంజునాథ ఆలయాన్ని చూస్తూ బెంగళూరులో వాలిపొండి ...!

చిత్ర కృప : ☆Mi☺Λmor☆

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X