Search
  • Follow NativePlanet
Share
» »ఓ ముస్లీం చేతుల మీదుగా ఆవిష్కృతమైన పరమాత్ముని శాశ్వత ని (ఆ) లయం, సందర్శనతో

ఓ ముస్లీం చేతుల మీదుగా ఆవిష్కృతమైన పరమాత్ముని శాశ్వత ని (ఆ) లయం, సందర్శనతో

ఢిల్లీలోని అక్షరధామం గురించి కథనం.

భారత దేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఈ విధానం నచ్చి ఎంతో మంతి విదేశీయులు కూడా తమ జీవిత చరమాంక దశలో మన దేశానికి వచ్చి ఆ ఆధ్యాత్మిక దారుల్లో నడుస్తున్నారు. ఇక ఈ ఆధ్యాత్మిక దారుల వైపు భారతీయులతో విదేశీయులను ఆకర్షింపజేయడంలో ఎంతో మంది కృషి ఉంది. అటువంటి ఓ ఆధ్యాత్మిక వేత్తకు భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కోట్ల మంది అనునాయులు ఉన్నారు.

వారంత కలిసి నిర్మించిన ఓ దేవాలయం ప్రస్తుతం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకొంది. ఈ ఆలయంలో ఉన్న శిల్పకళ భారతీయ సంప్రదాయాలకు అద్దం పడుతుంది. ఇక్కడ ఉన్న పుష్కరిణిలో భారత దేశంలోని 151 నదీ జలాలు ఉన్నాయి. ఆ ఆలయాన్ని ఓ ముస్లీం ఆవిష్కృతం చేశారు.

దీని బట్టి భారతీయుల్లో హిందూ, ముస్లీం భాయి...భాయి అన్న సంప్రదాయానికి ఎంత విలువ ఉందో అర్థమవుతుంది. అటువంటి ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

అయోధ్యకు సమీపంలో

అయోధ్యకు సమీపంలో

P.C: You Tube

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు సమీపంలో ఉన్న ఛాపయ్యా గ్రామంలో క్రీస్తుశకం 1781లో స్వామినారాయణ్ జన్మించాడు. ఏటవ ఏటనే పవిత్రగ్రంథాల పఠనం పూర్తి చేసి వాటిని అర్థం చేసుకోవడమే కాకుంటా వాటి గురిం వివరణలు కూడా ఇచ్చేవాడు.

గుజరాత్ లో స్థిరపడి

గుజరాత్ లో స్థిరపడి

P.C: You Tube

అటు పై ఏడేళ్లపాటు కాలినడకన భారతదేశమంతటా సంరించి భారతీయ సంస్క`తి సంప్రదాయాలను ఆకళింపు చేసుకున్నాడు. చివరికి గుజరాత్ లో స్థిరపడి స్వామినారాయణ్ సంప్రదాయమైన అక్షరధామ్ విధానానికి నాంది పలికాడు. తన 49వ ఏట పరమపదించాడు.

కోట్ల మంది అక్షరధామ్ విధానాన్ని పాటిస్తున్నారు

కోట్ల మంది అక్షరధామ్ విధానాన్ని పాటిస్తున్నారు

P.C: You Tube

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ స్వామినారయణ్ తో పాటు అక్షరదామ్ విధానినికి ప్రతిరూపమైన ఓ భవనం మొదట గుజరాత్ లో నిర్మించారు. రెండవ భవనాన్ని ఢిల్లో నిర్మించారు.

యమునా నది తీరంలో

యమునా నది తీరంలో

P.C: You Tube

భారత దేశ రాజధాని ఢిల్లో దాదాపు వంద ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ఆక్షరధామం దేవాలయాన్ని నిర్మించారు. నిజాముద్దీన్ వంతెనకు దగ్గరగా యమునానది తీరంలో నొయిడా క్రాసింగ్ వద్ద అక్షరధామం ఉంది.

శిల్పకళను ఇష్టపడే వారికి

శిల్పకళను ఇష్టపడే వారికి

P.C: You Tube

ఆధ్యాత్మిక వేత్తలనే కాకుండా శిల్పకళను ఇష్టపడే పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. భారత దేశంలో విదేశీయులు సందర్శించే పర్యాటక కేంద్రాల్లో అక్షరధామం మొదటి వరుసలో ఉంటుంది. భారతీయ నాగరికత, ప్రాచీన, ఆధునిక సాంకేతికకు ప్రతిరూపం ఈ అక్షరధామం.

 పరమాత్ముని శాశ్వత నిలయం

పరమాత్ముని శాశ్వత నిలయం

P.C: You Tube

అక్షరధామ్ అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయమని వేదాలు, ఉపనిషత్తుల్లో పలుచోట్ల ప్రస్తావించబడింది. ఈ దేవాలయం పూర్తి పేరు స్వామి నారాయణ్ అక్షరధామ్ అయినా కూడా ప్రపంచ వ్యప్తంగా అక్షరధామ్ అనే పేరుతోనే ప్రాచూర్యం పొందింది.

కెంపు వర్ణపు రంగు ఇసుక రాళ్లు

కెంపు వర్ణపు రంగు ఇసుక రాళ్లు

P.C: You Tube

రాజస్థాన్ లోని పిండ్వారా, సికంద్రా పట్టాణాల నుంచి సేకరించన వేలాది టన్నుల కెంపు రంగు ఇసుకరాళ్లు, పాలరాతితో ఆక్షరధామాన్ని నిర్మించారు. ఈ కట్టడంలో ఒక్క అంగుళమైన ఉక్కు వాడక పోవడం భారతీయ ఇంజనీరింగ్ ప్రతినిభకు నిదర్శనమని ప్రపంచ ఇంజనీరింగ్ నిపుణులు వాఖ్యానిస్తారు.

కోణార్క్ నిర్మాణ శైలి

కోణార్క్ నిర్మాణ శైలి

P.C: You Tube

బదరీనాథ్, కేదర్నాథ్, సోమనాథ్, కోణార్క్ ఆలయ భవన నిర్మాణ శైలిని ఈ కట్టడం పోలి ఉంటుంది. అక్షరధామ్ లోని ప్రధాన భవనం. 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పుతో 370 అడుగుల పొడవుతో ఉంటుంది.

పెద్ద ద్వారాలు

పెద్ద ద్వారాలు

P.C: You Tube

ఈ అక్షరధామ్ భక్తిద్వార్, మమూర్ ద్వార్ అనే రెండు పెద్ద ద్వారాలు పర్యాటకులు విశేషంకగా ఆకర్షిస్తున్నాయి. ఇ దేవాలయంలో పరిక్రమ స్మారక భవనం చూడదగింది. 1660 స్తంభాలతో రెండస్తులతో కూడాన ఈ భవనంలో 145 కిటికీలు 154 శిఖరాలు ఉంటాయి.

 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

P.C: You Tube

ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకొంది. ఆలయం గర్భగుడిలో ఉన్న 11 అడుగుల స్వామి నారాయణ్ విగ్రహం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది.

స్మారక భవనం

స్మారక భవనం

P.C: You Tube

ఈ ఆలయంలోని గజారూఢ అనే స్వారక భవనం భారతీయ శిల్పకళకు అద్దం పడుతుంది. ఈ స్వారకభవనాన్ని 148 ఏగులు తమ పై మోస్తుంన్నట్లు నిర్మించారు. 148 అనే సంఖ్య భారత పురాణాలు పంచత్ర కథలకు ప్రతిరూపాలని పిలుస్తారు.

20 వేల దేవతా విగ్రహాలు

20 వేల దేవతా విగ్రహాలు

P.C: You Tube

ఇక్కడ కాంగ్రా చిత్తరువులు, 20వేల దేవతా విగ్ఱహాలు, పురాణ, ఇతిహాసాల కథలు, గాథలతో ఈ భవనంలోని ప్తరి చదరపు అంగుళం, కళాత్మకంగా కనువిందు చేస్తుంది. అదేవిధంగా అక్షరధామ్ ప్రధాన ఆలయం పక్కనే యాజ్జపురుష్ కుండ్ అనే జలాశయం కనపడుతుంది.

151 నదీ జలాలు

151 నదీ జలాలు

P.C: You Tube

ఇందులో భారత దేశంలోని 151 నదీజలాలు ఉన్నాయి. మతాచార కర్మకాండల నిమిత్తం ఈ జలాశయం నిర్మించారు. 300 x 300 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు ప్రపంచంలోనే అతి విశాలమైన యజ్జకుండం. రాత్రి సమయంలో మ్యూజికల్ ఫౌంటైన్ ప్రధాన ఆకర్షణ.

 18వ శతాబ్దం

18వ శతాబ్దం

P.C: You Tube

అదే విధంగా సహజానంద దర్శన్ కూడా చూడదగిన ప్రాంతం. ఇక్కడ స్వామినారయణ్ జీవిత విశేషాలతో కూడిన మట్టి ప్రతిమలు ఉంటాయి. ముఖ్యంగా 18 వ శతాబ్దంలో భారతీయ ఆధ్యాత్మిక భారతానికి ఈ ప్రాంతం ప్రతిరూపం

భారత్ ఉద్యానవన్

భారత్ ఉద్యానవన్

P.C: You Tube

ఇక్కడ ఉన్న మరో ఆకర్షణీయ స్థలం భారత్ ఉద్యానవన్. ఇందులో వివిధ రకాల చెట్లు, పొదలతో పాటు బోలెడన్ని కంచు విగ్రహాలు కూడా ఉన్నాయి. పురాణ పురుఫషులు, స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారితో పాటు తీవ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

షార్ట్ సినిమా కూడా

షార్ట్ సినిమా కూడా

P.C: You Tube

ఇక ఇక్కడ స్వామి నారయణ్ జీవిత చరిత్రను 45 నిమిషాల షార్ట్ సినిమాగా చూపించే అత్యాధునిక సినిమా థియేటర్ కూడా ఉంది. ‘మిస్టిక్ ఇండియా- ఎన్ ఇన్ క్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఇన్ స్పిరేషన్' అనే పేరుతో నిర్మించిన ఈ చిత్రానికి ప్రఖ్యాత హాలివుడ్ దర్శకుడు కెయిత్ మెల్ టన్ దర్శకత్వం వహించారు.

45 వేల మంది కళాకారులు

45 వేల మంది కళాకారులు

P.C: You Tube

మొత్తం 45 వేల మంది కళాకారులు ఇందులో నటించడం విశేషం. భారత దేశంలో 108 పుణ్యక్షేత్రాల్లో ఈ సినిమాను షూటింగ్ చేశారు. స్వామినారాయణ్ జీవితంతో టు భారతీయ పురాణ, ఆధ్యాత్మిక జీవన విధానం కూడా ఈ షార్ట్ ఫిల్మ్ లో చూడవచ్చు.

 రూ.200 కోట్ల రుపాయలు

రూ.200 కోట్ల రుపాయలు

P.C: You Tube

మొత్తం నిర్మాణ వ్యయం రెండువదంల కోట్లు రూపాయలు. ప్రపంచంతటా విస్తరించి ఉన్న స్వామి నారాయణ్ అనుయాయుల నుంచి లభించిన విరాళాల నుంచి ఈ మొత్తాన్ని సేకరించారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నవంబర్ 7, 2005లో ఈ దేవాలయాన్ని ఆవిష్కరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X