Search
  • Follow NativePlanet
Share
» »శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

మహిషసంహారం కోసం అయ్యప్పగా వెలసిన హరిహరసుతుడు శబరిమలలో కొలువున్నాడు. ఏడాదిలో కొద్దిరోజులుమాత్రం తెరిచివుండే ఈ ఆలయదర్శనానికి వచ్చే భక్తులు 41రోజులపాటు దీక్ష చేస్తారు.

By Venkatakarunasri

మహిషసంహారం కోసం అయ్యప్పగా వెలసిన హరిహరసుతుడు శబరిమలలో కొలువున్నాడు. ఏడాదిలో కొద్దిరోజులుమాత్రం తెరిచివుండే ఈ ఆలయదర్శనానికి వచ్చే భక్తులు 41రోజులపాటు దీక్ష చేస్తారు.కఠిననియమాలతో దీక్ష చేసి ఇరుముడులతో వచ్చి స్వామిని దర్శించుకుంటారు. చుట్టూ దట్టమైన అడవులతో ఉన్న ప్రఖ్యాతి గడించిన పుణ్యక్షేత్రం శబరిమల. సహజసిద్దమైన ప్రకృతి ఒడిలో ,పంబా నది ఒడ్డున , పశ్చిమ కనుమల పర్వత శ్రేణులలో ఉన్నది ఈ పుణ్యక్షేత్రం.లక్షలాది భక్త జనం మలయాళ క్యాలెండర్ ప్రకారం మండలకల కాలం అయిన నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ క్షేత్రానికి తరలి రావటం జరుగుతుంది. భారతదేశ నలుమూలల నుండి భక్తులు తమ తమ మతాలకు అతీతంగా, మరియు ఆర్ధిక స్తితిగతులకు అతీతంగా ఈ క్షేత్రానికి ప్రతిసంవత్సరం వస్తారు. పురాణ విశేషం సబరిమల్ అంటే శబరి( రామాయణ గాథ లోని ఓక పుణ్య పాత్ర ) యొక్క పర్వత శ్రేణి అని అర్ధం.కేరళ లోని మానవీయ పెరియర్ టైగర్ హిల్ రిజర్వు లో ఉన్నటువంటి , పట్టనంతిట్ట జిల్లా కి తూర్పు ప్రాంతాన ఉన్నదీ గొప్ప క్షేత్రం.ఈ దేవాలయం లో కొలువున్న దేవుడు అయ్యప్ప లేదా స్వామీ అయ్యప్ప.

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

ఈ స్వామి దర్శనం కోసం ఇక్కడకి రావాలనుకొనే భక్తులు తప్పనిసరిగా 41 రోజులు శాఖాహారులై లౌకిక సుఖాలకు దూరం గా ఉండాలి. ఇక్కడి దేవాలయానికి ఉండే పచ్చని చెట్లు,ప్రవాహాలు మరియు పచ్చిక బయళ్ళ లో నుండి ఉండే కాలిబాట లో ప్రయాణం ప్రతిఒక్కరికి భగవత్ ప్రేరేపిత అనుభవం గా ప్రతి ఒక్కరు తమ జీవిత కాలం లో చవి చూడ వలసిన ఒక అద్భుతం. భగవంతుని చేరే మార్గం (తనను తానూ తెలుసుకోవటమే) కాలినడకన దేవాలయం చేరే భక్తులు ఈ పొడవైన, కఠినమైన మార్గం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

అయితే ఇక్కడ ఉండే చెట్ల నీడలో విశ్రమించి సేదతీరి ప్రయాణం కొనసాగించవచ్చు. ప్రపంచం లోనే అతి గొప్ప పుణ్యక్షేత్రం గా పేరు గడించిన ఈ శబరిమల కు ప్రతి సంవత్సరం సుమారు 45-50 మిలియన్ ల భక్తులు విచ్చేస్తారు.18 కొండల మధ్య ఉన్న ఈ అయ్యప్ప స్వామి కోవెల చూడటానికి ఏంతో కన్నుల పండుగగా ఉంటుంది.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

ఈ దేవాలయం పర్వత శ్రేణుల మధ్య, దట్టమైన అడవుల మధ్య శిఖరం పైన సముద్ర మట్టానికి 1535 అడుగుల ఎత్తున ఉన్నది. శబరిమల యొక్క ఔన్నత్త్యం భయంకరమైన రాక్షసి మహిషిని అంతమొందించి అయ్యప్పస్వామి ఇక్కడ తపస్సు చేసారని పురాణాలు చెపుతాయి. శబరిమల దేవాలయం చాలామంది భక్తులకు సమానతకు ,సమైక్యతకు,మంచికి చిహ్నం గా గోచరిస్తుంది.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

ఇది భక్త జనానికి మరొకసారి మంచి ఎప్పుడు చెడుని జయిస్తుంది అని , ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే సత్యాన్ని గుర్తుచేస్తుంది.మతాతీతంగా, కులాతీతంగా, వర్ణాతీతం గా భక్తులకు అందుబాటు లో ఉన్న అతి కొద్ది దేవాలయాలలో శబరిమల పుణ్య క్షేత్రం ఒకటి.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

మహావిష్ణువు యొక్క ఒకానొక అవతారమైన పరశురామ మహర్షి తన గొడ్డలిని పారవేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శబరిమల లో ప్రతిష్టించారని చెప్పబడుతుంది. ఈ శబరిమల ప్రభుత్వ ఆధ్వర్యం లోని ద త్రావెంకరే దేవస్వోం బోర్డు (TDB) యొక్క నిర్వహణలో ఉన్నది.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

అయితే దాదాపు200ఏళ్లక్రిందటే శబరిమల యాత్ర ప్రారంభమైనట్లు పందళం రాజవంశీయులు రికార్డులలో వుంది.సుమారు 4800నుంచి 5000చరిత్రకలిగిన పరశురామ అయ్యప్పఆలయం 1907మరియు 1909మధ్య ప్రాంతంలో అగ్నికి ఆహుతికావటంతో దేవాలయాన్ని రెండోసారి పునర్నిర్మించారు.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శిలా విగ్రహానికి బదులు పంచలోహాలతో చేసిన స్వామివిగ్రహంను ప్రతిష్టించారు.ఈ విగ్రహం ప్రతిష్టించినతర్వాతే శబరిమలవైభవం పెరిగింది.అయ్యప్పఆలయం 1930వరకూ ట్రావెన్కో సంస్థానీదీశుల ఆధీనంలోనే వుండేది.అయితే 1935తర్వాత దీనిని ట్రావెన్కోదేవస్థానం బోర్డుకు అప్పగించారు.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

నాటినుంచి భక్తులసంఖ్యగణనీయంగా పెరిగింది. దీంతో అప్పటివరకూ కేవలం మకరజ్యోతికి మాత్రమే తెరిచే ఆలయాన్ని మండలపూజకు తెరవడం ప్రారంభించారు.పంబాప్రాజెక్టు నిర్మాణంతో భక్తులరద్దీకూడా పెరిగింది.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

భక్తులసంఖ్య పెరగటంతో 1945నుంచి విషుం,ఓనంలాంటి మళయాళ సం లలోనూ ఆలయంతెరవటం ప్రారంభమైంది.అంతాఅటవీప్రాంతం కావటంతో భక్తులు బృందాలుగా వెళ్లి దర్శనం చేసుకునేవారు. అయితే మళ్ళీ 1950లో బందిపోట్లు స్వామివారి ఆలయాన్ని విగ్రహాన్ని ధ్వంసంచేసారు.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

దేవస్థానంబోర్డు భక్తులవిరాళాలతో ప్రస్తుతంవున్న ఆలయాన్ని పునరుద్దరించారు.చెంగునూరుకు చెందిన శ్రీఅయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే ఇద్దరు శిల్పులు విగ్రహాన్ని రూపొందించారు.1951జూన్ లో స్వామివారి ఆలయం 3సారి పునరుద్దరణతర్వాత అప్పటివరకూ కేరళకేళి విగ్రహంగా వున్న అయ్యప్ప భారతకేళిగా అనంతరం భూతకేళిగా ప్రపంచమంతా కీర్తించబడ్డారు.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

పరశురాముడ్ని మించిన ఆలయం ధ్వంసమైనా పదునెట్టుంబడిమాత్రం ఆయన నిర్మించిందే. ఈ విధంగా అయ్యప్పస్వామి దేవాలయం పలు మార్లు ధ్వంసంఅయినప్పటికీ తన ప్రాబల్యాన్ని కోల్పోకుండా ఇప్పటికీ భక్తులపూజలను అందుకుంటుంది.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

పుణ్యక్షేత్రం శబరిమల

దీక్షా కాలం నవంబర్ మధ్యలో ప్రారంభమై జనవరి నాలుగవ వారంలో ముగుస్తుంది. జనావాసాలు లేకపోయినా శబరిమల పట్టణ సముదాయం నిరంతరం యాత్రికులు, దుకాణాలు మరియు హోటల్స్ తో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. శబరిమల లో ప్రధానంగా జరుపుకునే పండుగలు మండల పూజ మరియు మకరవిలక్కు. వవారు స్వామి అనబడే ముస్లిం పకిరుకి ఇక్కడ మందిరం ఉంది.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

అందువల్ల, ఈ ప్రాంతం మతాలకు అతీతంగా ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం కలగలిపిన ఈ శబరిమల సందర్శన అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.వేల మంది పర్యాటకులు భక్తితో ఈ శబరిమలను సందర్శించేందుకు సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఇక్కడికి తరలి వస్తారు.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

పచ్చని చెట్లు, అందమైన ప్రవాహాలని దాటుకుంటూ చక్కటి నడక ద్వారా ఈ అయ్యప్పస్వామి గుడికి చేరుకోవడం వర్ణనాతీతమైన అనుభూతి. ఈ కొండ పైకి ఎక్కడానికి సుమారు మూడు కిలో మీటర్లు కాలి నడకన వెళ్ళాల్సి వస్తుంది. వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలం, అద్భుతమైన పర్వత సౌందర్యం దారి పొడవునా కనువిందు చేస్తాయి.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

ప్రకృతిని ఆరాధించేవారికి ఈ శబరిమల సందర్శనం మధురానుభూతిని కలిగిస్తుంది. ప్రధాన నగరాలకు రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా అనుసందానమైన పంబా పట్టణం నుండి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. శబరిమల ను సందర్శించదలచిన పర్యాటకులకు అన్ని సిజన్లలో టూరిస్ట్ ప్యాకేజులు మరియు హోటల్ వసతులు అందుబాటు ధరలోనే ఉంటాయి.

PC:youtube

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం

కేరళ లో ఉన్న అన్ని ప్రధాన నగరాల నుండి పంబ పట్టణానికి తరచూ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) ద్వారా కేరళ ప్రభుత్వ రవాణా శాఖ కొట్టాయం, చెంగన్నూర్ మరియు తిరువల్ల రైల్వే స్టేషన్ ల కి బస్సు సర్వీసులు నడుపుతుంది. ప్రైవేటు టాక్సీలు మరియు టూరిస్ట్ ప్యాకేజీ లు కూడా శబరిమల కి అందుబాటులో ఉన్నాయి.

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

రైలు మార్గం

పంబా పట్టణానికి 90 కి మీ ల దూరం లో ఉన్న చెంగన్నూర్ రైల్వే స్టేషన్, శబరిమల కి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. తిరువనంతపురానికి మరియు కొట్టాయం కి మార్గమధ్యంలో ఈ చెంగన్నూర్ ప్రాంతం ఉండడం వల్ల భారత దేశంలో ప్రముఖమైన రైల్వే స్టేషన్స్ అన్నిటికి అనుసంధానించబడి ఉన్నది. చెంగన్నూర్ నుండి పంబా పట్టణానికి టాక్సీ సేవలు అందుబాటులోఉన్నాయి.

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

శబరిమల టెంపుల్..ఇప్పటికీ ఎన్నిసార్లు నిర్మించారో తెలుసా...?

వాయు మార్గం

కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం శబరిమలకి సమీపంలో ఉన్నాయి. శబరిమల నుండి తిరువనంతపురం 130 కి మీ ల దూరంలో, కొచ్చి నేడంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం 190 కి మీ ల దూరంలో ఉన్నాయి. ఈ రెండు విమానాశ్రయాల నుండి పంబా పట్టణానికి టాక్సీ సేవలు లభ్యమవుతాయి. పంబా పట్టణం నుండి సులభంగా శబరిమలకు చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X