Search
  • Follow NativePlanet
Share
» »త్రినేత్రుడు మూడో కన్ను తెలిచిన ప్రాంతం తెలుసా

త్రినేత్రుడు మూడో కన్ను తెలిచిన ప్రాంతం తెలుసా

శివుడు మూడో కన్ను తెరిచిన క్షేత్రం గురించిన కథనం

By Beldaru Sajjendrakihsore

మైలదుత్తురై తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టినం జిల్లాలో కలదు. మైలదుత్తురై అంటే తమిళ సాహిత్యం ప్రకారం "నెమలి పట్టణం' అని అర్థం. మెయిల్ అంటే నెమలి, ఆడుం అంటే నాట్యంచేయటం, త్తురై అంటే ప్రదేశం అనే మూడు పదాల కలయికే ఈ ప్రదేశం. కుంభకోణం, చిదంబరం పట్టణాలకు ఈ టౌన్ సమీపంలో కలదు. మైలదుత్తురై టౌన్ లో ఉన్న మయూరనాథ స్వామి ఆలయం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చినట్లు స్థానిక కధనం ద్వారా తెలుస్తోంది.

ఇక్కడి ప్రధాన దైవం శివుడు (మయూరనాథర్). పార్వతీదేవి 'మయూర' రూపంలో శివుడిని ఇక్కడ పూజించింది.కావేరి నది ఒడ్డున ఉన్న ఈ పట్టణంలో, ఈ ప్రదేశాన్ని ఒక తీర్థయాత్ర స్థలంగా మార్చిన అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో మయూరనాథర్ దేవాలయం ప్రధానమైనది. ఇక్కడి మరిన్ని దేవాలయాలు, యాత్రా స్థలాలు ఒకసారి గమనిస్తే ... !

1. సూర్యనాయర్ కోయిల్

1. సూర్యనాయర్ కోయిల్

Image source:


సూర్యనార్ కోయిల్, మైలదుత్తురై కు పశ్చిమాన 20 కి. మీ ల దూరంలో ఉన్నది. ఇక్కడ సూర్యభగవానుడు ప్రధాన దైవం. ఇందులో ఆయన భార్యలు ఛాయ, సువర్చల ప్రతిమలను చూడవచ్చు. దీని చుట్టూ మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనలను మంత్రముగ్థులను చేస్తుంది. మరికొంతసేపు ఇదే దేవాలయంలో సేదదీరాలని అనిపించక మానదు. అందుకే ఇక్కడకు వచ్చిన వారు ఎక్కువ సమయం గడుపుతుంటారు.

 2. తింగలూర్

2. తింగలూర్

Image source:


తింగలూర్, మైలదుత్తురై కి 40 కి.మీ ల దూరంలో కలదు. ఇక్కడి ప్రధాన దైవం చంద్రుడు. ఆయన ఇక్కడి వచ్చే భక్తులకు మానసిక వ్యాధులు, బాధలు మరియు ఒత్తిడులను నయం చేస్తాడని చెబుతారు. అందువల్లే దీర్ఘ వ్యాధులతో బాధపడే వారు ఇక్కడకు వచ్చిసాంత్వన పొందుతుంటారు. ఇందుకు గల కారణాలను శాస్త్రీయంగా నిరూపించలేకపోయినా కూడా భక్తులు రావడం తగ్గడం లేదని ఇక్కడి పూజారులు చెబుతున్నారు.

3. వైదీశ్వరన్ కోయిల్

3. వైదీశ్వరన్ కోయిల్

Image source:


మైలదుత్తురై కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, రావణుడు చేతిలో హతుడైన జటాయువు మోక్షం పొందిన పవిత్ర స్ధలం. అయన దహనసంస్కరం చేసిన ప్రదేశాన్ని ప్రస్తుతం 'జటాయుకుండం' అని పిలుస్తారు. ఈ ఆలయంలో నాడి పట్టుకొని జ్యోతిష్యం చెబుతారు. ఈ నాడీ జోతిష్యం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అందువల్ల ప్రంపంచంలో నలుమూలల నుంచి ఇక్కడకు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

4. తిరువెంకాడు

4. తిరువెంకాడు

Image source:


తిరువెంకాడు, మైలదుత్తురై టౌన్ కు 24 కి. మీ ల దూరంలో కలదు. ఇక్కడ శివభగవానుడి మందిరం కలదు. కాశి వలే ఇక్కడ కూడా అనేక ఘాట్లు ఉన్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు రావాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ ఆలయానికి వస్తుంటారు.అలంగుడి మైలదుత్తురై కు 40 కిలోమీటర్ల దూరంలో గురుగ్రహానికి అంకితం చేయబడిన 'అలంగుడి' క్షేత్రం ఉన్నది. ఇక్కడ అన్ని గుళ్ళలో మాదిరి విగ్రహం లేకుండా, దేవుని బొమ్మను గోడపై చెక్కారు.

5. సురియనార్ కోయిల్

5. సురియనార్ కోయిల్

Image source:


మైలదుత్తురై కు 20 కి.మీ ల దూరంలో కుంజనూర్ వద్ద సురియనార్ కోయిల్ ఉన్నది. ఇది శుక్రగ్రహానికి అంకితం చేయబడినది. ఈయనను పూజిస్తే ... సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.తిరునల్లార్
మైలదుత్తురై కు 40 కి.మీ ల దూరంలో తిరునల్లార్ కలదు. ఇది శనిగ్రహానికి అంకితం చేయబడిన ఊరు. ఇక్కడి పవిత్ర నలతీర్థం లో మునక వేస్తే పాపాల నుండి విముక్తి లేదా శని ప్రభావం వెలన పడే ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

6. తిరునగేశ్వరం

6. తిరునగేశ్వరం

Image source:


మైలదుత్తురై కు 30 కి.మీ ల దూరంలో తిరునగేశ్వరం (కుంభకోణం దగ్గరంలో) కలదు. ఇక్కడ శివుడు కు చెందిన ఒక ఆలయం ఉన్నది. ప్రతిరోజు రాహుకాలంలో రాహుదేవునికి జరిగే క్షీరాభిషేకం తప్పక చూడాలి. రాహువు భార్యలతో కనబడే కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి. ఇక్కడ కాళసర్పదోశ పూజలు, రాహుకేత పూజలు కూడా జరుగుతుంటాయి. అందువల్ల చాలా మంది భక్తులు తమ దోషాలను పోగొట్టు కోవడానికి ఇక్కడికి వస్తుంటారు.

7. కీళ్ పెరుమ్పళ్ళం

7. కీళ్ పెరుమ్పళ్ళం

Image source:


కీళ్ పెరుమ్పళ్ళం, తిరువెంకాడు కు సమీపాన ఉన్నది. ఇక్కడ కేతుదేవుని ఆలయం ఉన్నది. వనగిరి గా కూడా పిలువబడే ఈ ఆలయంలో కేతువు తన పాపాలకు ప్రాయశ్చిత్తంగా శివుడిని పూజించాడని విశ్వశిస్తారు. ఇక్కడ కూడా కాళసర్పదోశ పూజలు, రాహుకేత పూజలు కూడా జరుగుతుంటాయి. అందువల్ల చాలా మంది భక్తులు తమ దోషాలను పోగొట్టు కోవడానికి ఇక్కడికి వస్తుంటారు.

8. గంగైకొండ చోళపురం

8. గంగైకొండ చోళపురం

Image source:


మైలదుత్తురై లో ఇవే కాక మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగ్గది గైంగైకొండ చోళపురం. ఇది మైలదుత్తురై టౌన్ కు 40 కి. మీ ల దూరంలో కలదు. 250 ఏళ్ళ పాటు చోళుల రాజధానిగా సేవలందించింది. రాజేంద్రచోళుడు నిర్మించిన శివాలయం అత్యద్భుతం ... అజరామరం. ఇక్కడి శిల్ప సంపద ఎంతగానో అకట్టుకుంటుంది. అందువల్ల శిల్ప శాస్త్రం పై పరిశోధనలు చేసేవారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.

9. మయూరనాథర్ స్వామి దేవాలయం

9. మయూరనాథర్ స్వామి దేవాలయం

Image source:

ఈ దేవాలయం మైలదుత్తురై లో ప్రధానమైనది. శాపం కారణంగా ఆడ నెమలి అవతారమెత్తిన పార్వతీదేవి, నిత్యం ఈ ప్రాంగణంలోనే శివుడిని పూజించేదని పురాణ గాథ. చోళులు కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో ప్రతిఏటా మయూర నృత్యం నిర్వహిస్తారు. ఇది చూడముచ్చటగా ఉంటుంది. దీనిని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకి వస్తుంటారు. వీరిలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కూడా ఉంటారు.

10. దక్షిణామూర్తి గుడి

10. దక్షిణామూర్తి గుడి

Image source:


ఈ గుడి లో ప్రధాన దైవం శివుడు. ప్రతి దక్షిణామూర్తి దేవాలయంలో సాధారణంగా శివుని విగ్రహం తూర్పు వైపు తిరిగి ఉంటుంది. కానీ, ఇక్కడ శివుని విగ్రహం దక్షిణం వైపు ముఖం చేసి ఉంటుంది. ఈ గుడి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినది. ఇటువంటి దక్షిణ మూర్తి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందువల్ల ఇక్కడకు భక్తులు ఎక్కువ మంది వచ్చి తమ కోరికలను తీర్చాల్సిందిగా భగవంతుడిని వేడుకుంటారు.

11. పునుగీశ్వరార్ టెంపుల్

11. పునుగీశ్వరార్ టెంపుల్

Image source:


మైలదుత్తురై కు అతి సమీపంలో ఉన్న కూరైనాడు లో పునుగీశ్వరార్ టెంపుల్ ఉన్నది. ఇందులో శివుడు, ఆయన భార్య శాంత నాయకి ఉన్నారు. ఇక్కడ మోక్షం పొందిన పూనుకు సిద్ధార్ పేరిట ఈ దేవాలయానికి ఆ పేరొచ్చింది. కాంచీపురానికి, కూరైనాడు కి దగ్గరిపోలికలు ఉన్నాయి. శిల్ప సంపద కూడా అదే విధంగా కనిపిస్తుంటుంది. అందువల్ల శిల్ప శాస్త్రం పై పరిశోధనలు చేసేవారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.

12. ఇక్కడే మూడో కన్ను తెరిచాడు.

12. ఇక్కడే మూడో కన్ను తెరిచాడు.

Image source:


గంగైకొండ మాదిరే ఇది కూడా పురావస్తు ప్రాధాన్యం కలది. గుడిలో ప్రధాన దైవం ధర్మసంవర్ధిని, అనగా ధర్మాన్ని రక్షించేది అని అర్థం. ఈ దేవాలయంలో కులోత్తుంగ చోళ రాజుల శిలాశాశనాలు, చిత్రాలు కనపడతాయి.మైలదుత్తురై లో మరో దేవాలయం కురుకై శివన్. ఇక్కడ శివుడు మూడో కన్ను తెరిచి కనిపిస్తాడు. మన్మధున్ని శివుడు మూడో కన్ను తెరిచి భస్మం చేసే సన్నివేశం ఇక్కడే జరిగిందని భక్తులు విశ్వశిస్తారు

13. శ్రీ పరిమళ రంగనాథస్వామి దేవాలయం

13. శ్రీ పరిమళ రంగనాథస్వామి దేవాలయం

Image source:


ఈ దేవాలయం కావేరి నది ఒడ్డున కలదు. ఈ క్షేత్రాన్ని అల్వార్లు లేదా విష్ణు భక్తులు తరచూ దర్శిస్తుంటారు. దేవాలయంలో 12 అడుగుల విష్ణు విగ్రహం మరియు అమ్మవారి విగ్రహం (పరిమళ రంగనాయకి) ప్రతిష్టించారు. అమ్మవారు చంద్రుడు కి శాపవిముక్తి ఇక్కడే గావించిందని, అందుకే చంద్ర శాప విమోచనవల్లి అన్ని అని పిలుస్తారని పురాణగాధ.ఈ దేవాలయం కూడా కావేరి నది ఒడ్డున కలదు. ఇక్కడి శివాలయానికి ఒక కథ ఉంది. అదేమిటంటే, శివుడిని మోస్తున్నది తనేననే అహంకారం నందికి వస్తుంది. ఈ విషయాన్నీ గ్రహించిన శివుడు తన జటాజుటాల్లో ఒకదానిని బరువెక్కించి నంది మోయలేకుండా చేయాలని తద్వారా అతనికి సౌశీల్యం నేర్పాలని శివుడు భావిస్తాడు. ఇక్కడి విగ్రహం నంది మీద యోగ ముద్రలో ఎక్కి కూర్చున్న శ్రీమేధా దక్షిణామూర్తి గా దర్శనం ఇస్తుంది.

14. ఇలా చేరుకోవచ్చు

14. ఇలా చేరుకోవచ్చు

Image source:


మైలదుత్తురై విమాన మార్గం : 271 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నై సమీప విమానాశ్రయం. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి మైలదుత్తురై చేరుకోవచ్చు. రైలు మార్గం : మైలదుత్తురై లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి భువనేశ్వర్, మైసూర్, తిరుపతి, చెన్నై, తిరువనంతపురం తదితర ప్రాంతాల నుండి తరచూ రైళ్లు వస్తుంటాయి. బస్సు మార్గం : చెన్నై, చిదంబరం, తంజావూరు, కుంభకోణం, తిరుచిరాపల్లి నుండి ప్రతిరోజూ మరియు బెంగళూరు, త్రివేండ్రం, మైసూర్ నుండి కూడా ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు తిరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X