Search
  • Follow NativePlanet
Share
» »మెరీనా బీచ్ ఎంతో మంది గొప్ప వ్యక్తుల స్మారకాలు, విగ్రహాలకు నిలయం

మెరీనా బీచ్ ఎంతో మంది గొప్ప వ్యక్తుల స్మారకాలు, విగ్రహాలకు నిలయం

మెరీనా బీచ్ కు సంబంధించిన కథనం.

మెరినా బీచ్ భారతదేశ మంతటా దృష్టి సారించిన ప్రదేశం. ఇక్కడే సుప్రసిద్ధ రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. అంతే కాకుండా ఆయన స్మారకాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక ఈ మెరినా బీచ్ ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. ఈ మెరీనా బీచ్ లో అనేక ఆకర్షణీయ స్మారకాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెరీనా బీచ్ కు సంబంధించిన వివరాలు మీ కోసం. అదే విధంగా చెన్నై లోని పలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి మెరినా బీచ్ చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉంటాయి.

మెరినా బీచ్

మెరినా బీచ్

P.C: You Tube

భారత దేశంలో అత్యంత పొడవైన నగర బీచ్ లలో మెరీనా బీచ్ దే అగ్రస్థానం. దీని పొడవు దాదాపు 6 కిలోమీర్లు. ఈ బీచ్ ప్రధానంగా ఇసుకతో నిండి ఉంటుంది. క్రీస్తు శకం 1881 నుంచి 1886 వరకూ మద్రాస్ గవర్నర్ గా వ్యవహరించిన మౌంట్ స్టార్ట్ ఈ బీచ్ ప్రాచూర్యం పొందడంలో విశేషంగా క`షి చేసాడు.

మెరినా బీచ్

మెరినా బీచ్

P.C: You Tube

మెరీనా బీచ్ దాని ప్రాచీన సౌదర్యానికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు. అయితే ఇటీవల ఈ మెరీనా బీచ్ కూడా కలుషితమై పోతోందన్న వాదన వినిపిస్తోంది. ఇక ఈ బీచ్ లో అంతరించే స్థితికి చేరుకున్న రిడ్లే తాబేళ్లను రక్షించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక పర్యాటక పరంగా కూడా మెరీనా బీచ్ అత్యంత ఆకర్షణీయమైనది.

మెరినా బీచ్

మెరినా బీచ్

P.C: You Tube

చెన్నై ను సందర్శించిన వారు తప్పకుండా మెరీనా బీచ్ ను సందర్శిస్తూ ఉంటారు. మెరీనా బీచ్ స్ట్రీట్ ఫుడ్ కు కూడా చాలా ఫేమస్. ఇక ఇక్కడ అనేక స్మారకాలు, గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. దీంతో అన్ని వయస్సుల వారికీ నచ్చే పర్యాటక ప్రాంతంగా దీనికి పేరు వచ్చింది.

మెరినా బీచ్

మెరినా బీచ్

P.C: You Tube

మెరినా బీచ్ లో కార్మిక విజయోస్తవానికి గుర్తుగా నిర్మించిన శిల్పం చాలా ప్రాచూర్యం చెందినది. అనేక సినిమాల్లో కూడా ఈ విగ్రహాన్ని చూడవచ్చు. ఇక మెరినా బీచ్ కు ఎదురుగా వివేకానంద హౌస్ ఉంటుంది. దీనిలో ప్రముఖ ధార్మిక, ఆధ్యాత్మిక వేత్త స్వామి వివేకానంద సుమారు తొమ్మిది సంవత్సరాలు నివశించినట్లు చెబుతారు.

మెరినా బీచ్

మెరినా బీచ్

P.C: You Tube

ఇక్కడ స్వామి వివేకానంద పుస్తకాలు, పెయింటింగ్ ప్రదర్శనకు ఉంచుతారు. ఈ మెరీనా బీచ్ కు ఇరువైపులా ఎంతోమంది గొప్ప వ్యక్తుల రాతి విగ్రహాలు ఉన్నాయి. వారిలో మహాత్మగాంధీ, సుభాష్ చంద్రబోస్, సుబ్రహ్మణ్య భారతీయార్, భారతీదాస్, కామరాజర్, అవ్వైయార్, తందై పెరియార్ తదితర విగ్రహాలు ముఖ్యమైనవి.

మెరినా బీచ్

మెరినా బీచ్

P.C: You Tube

అంతేకాకుండా ప్రముఖ సినీనటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దీనిని స్మారకంగా కూడా అభివ`ద్ధి చేశారు. ఇక ఇక్కడ విక్టోరియా వార్ మెమోరియల్, అన్నా మెమోరియల్, లైట్ హౌస్, చిదంబరం క్రికెట్ స్టేడియం తదితరాలు ఇక్కడ చూడదగినవి. అంతేకాకుండా పిల్లలు ఎంతగానో ఇష్టపడే అక్వేరియాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X