Search
  • Follow NativePlanet
Share
» »పర్యావరణ పరిరక్షణలో లడఖ్ !

పర్యావరణ పరిరక్షణలో లడఖ్ !

పర్యావరణ పరిరక్షణ మానవుడి ప్రధమ కర్తవ్యం. అది లేని నాడు నేడు మనం చూస్తున్న ఈ సహజ ప్రదేశాలు కాల క్రమేణా అంతరించి పోతాయి. పర్యావరణ సంరక్షణలో భాగంగా మానవుడు అడవులను కాపాడాలి.

దట్టమైన అడవులు నదుల నుండి ఏర్పడే వరదలను అరికట్టి గ్రామాల ముంపులు లేకుండా చేస్తాయి. అడవులు దట్టంగా వుంటే, ఆ ప్రదేశాలలో వన్య జీవులు తగిన ఆహారం అక్కడే పొంది గ్రామీణులకు, లేదా అడవులలో నివసించే వారికి అడ్డు లేకుండా వుంటాయి. ఒక పర్యావరణ పరి రక్షకుడిగా మానవుడు అనేక రకాల చర్యలు చేపట్టాలి.

అపుడే వివిధ జంతు జాలాలతో పాటు మానవుడి జీవనం కూడా ఎట్టి ఇబ్బందులూ లేకుండా కొనసాగుతుంది. నాగరికత అధికకాలం విలసిల్లుతుంది. ఈ భూమి మీద కల అందమైన ప్రాంతాలలో లడఖ్ ఒకటి. ఈ ప్రదేశం ఇప్పటికి తన ఉనికిని కాపాడుకుంటూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది.

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

లడక్ ఎయిర్ పోర్ట్ రాష్ట్రం లోని ప్రముఖ ప్రాంతాలకు కలుపబడి వుంది.జమ్మూ ఎయిర్ పోర్ట్ దీనికి ప్రధాన విమానాశ్రయం. ఇక్కడి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సేవలు కలవు. లడఖ్ కు 712 కి. మీ. ల దూరంలో జమ్మూ తావి రైలు స్టేషన్ కలదు. జమ్మూ మరియు శ్రీనగర్ ల నుండి బస్సు ప్రయాణంలో లడఖ్ చేరవచ్చు.

జనరల్ జోర్వార్స్ ఫోర్ట్

జనరల్ జోర్వార్స్ ఫోర్ట్

జనరల్ జోర్వార్స్ కోటను రియాసి కోట అని కూడా అంటారు. ఇది లెహ్ పాలసు కు దూరంగా కలదు. ప్రస్తుతం శిధిలావస్థలో వుంది. ఈ కోటలో అప్పటి పాలకుల నాణెములు, ఇతర వస్తువులు సేకరించి ఉంచారు. చేనాబ్ నదికి సమీపంలో కల కోట పురా తత్వ శాస్త్రవేత్తలకు, చరిత్ర ప్రియులకు ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. కోట లోపల ఒక మసీదు, ఒక సహజ నీటి బుగ్గ, కాళికా దేవాలయం కలవు.
Photo Courtesy: Deeptrivia

మాతో మొనాస్టరీ

మాతో మొనాస్టరీ

మాతో మొనాస్టరీ ఇండస్ నది లోయలో నగరానికి 16 కి. మీ. ల దూరంలో కలదు. దీనిలో అనేక పురాతన వస్తువులు కల ఒక మ్యూజియం కలదు. సుమారు నాలుగు వందల సంవత్సరాల నాటి బౌద్ధ మత టిబెట్ సిల్క్ పెయింటింగ్ లు కలవు.
Photo Courtesy: VagabondTravels

నుబ్రా వాలీ

నుబ్రా వాలీ

నుబ్రా వాలీ లడఖ్ లోయ కు ఈశాన్యం దిశలో కలదు. శియోక్ నది , నుబ్ర లేదా సియాచన్ నదిని కలసి అతి పెద్ద లోయలోకి ప్రవహిస్తుంది. ఈ లోయ లడఖ్ మరియు కారకోరం లను వేరు పరుస్తుంది. ఈ ప్రదేశాలు ట్రెక్కింగ్ కు అనుకూలం. ఫోటోగ్రఫీ ప్రియులు ఇక్కడి ప్రాంతాలను అధికంగా ఇష్టపడ౩ తారు.

Photo Courtesy: shankii

శంకర్ గొంప

శంకర్ గొంప

దీనినే శంకర్ మొనాస్టరీ అని కూడా అంటారు. ఇది లెహ్ కు 3 కి. మీ. ల దూరంలో కలదు. ఈ గోమ్పాలో బోధి సత్త్వ అనబడే బుద్ధుడి విగ్రహం కలదు. దీని ప్రత్యేకత అంటే, దీనికి పదకొండు తలలు కలవు. ప్రతి అరచేతిలోను ఒక వేయి చేతులు, కళ్ళు చెక్కబడ్డాయి. వచ్చిన పర్యాటకులు ఈ విగ్రహాన్ని అమితంగా ఇష్టపడతారు.

సేర్జాంగ్

సేర్జాంగ్

సేర్జాంగ్ టెంపుల్ లెహ్ కు 40 కి. మీ. ల దూరంలో కలదు. ఈ దేవాలయ నిర్మాణంలో రాగి, బంగారు లోహాలు అధికంగా వాడారు. ఈ టెంపుల్ లో 30 అడుగుల ఎత్తుకల లాఫింగ్ బుద్ధ విగ్రహం ఒక ప్రత్యేక ఆకర్షణ.

శేయా గొంప

శేయా గొంప

శేయా గొంప లెహ్ ప్రదేశానికి దక్షిణ భాగంలో 15 కి. మీ. ల దూరంలో కలదు. లడఖ్ ప్రాంతంలోనే అతి పెద్దదైన ఒక బుద్ధుడి రాగి విగ్రహం ఇక్కడ కలదు. ప్రస్తుతం శిధిలావస్థ దశ లో ఉన్నప్పటికీ, శేయా ఒకప్పుడు లడఖ్ కు వేసవి రాజధానిగా వుండేది. పర్యాటకులు, భక్తులు ఇక్కడకు వచ్చు బుద్ధుడి విగ్రహానికి ప్రార్ధనలు చేస్తారు.

Photo Courtesy: Karunakar Rayker

స్పాంగ్ నిక్

స్పాంగ్ నిక్

స్పాంగ్ నిక్ ప్రదేశం పాన్గోంగ్ సరస్సు కు సుమారు 7 కి. మీ. ల దూరంలో కలదు. ఒక మారు మూల ఆకర్షణీయ ప్రాంతం. ఇక్కడ మంచుతో కప్పబడిన అనేక పర్వత శిఖరాలు చూడవచ్చు.

Photo Courtesy: _paVan_

స్తోక్ పాలస్ మ్యూజియం

స్తోక్ పాలస్ మ్యూజియం

స్తోక్ పాలస్ మ్యూజియం స్తోక్ పాలస్ లో కలదు. ఈ మ్యూజియం లో రాజ కుటుంబాల కిరీటాలు, ఇతర వస్తువులు, విలువైన రత్నాలు, కాపర్ నాణెములు, ఆభరణాలు, టిబెట్ సిల్క్ పెయింటింగ్ లు మొదలైనవి ప్రదర్శిస్తారు. మ్యూజియం ప్రధానంగా ఆ ప్రాంత సంస్కృతి చూపే వస్తువులు చూపుతుంది. ఈ మ్యూజియం చూస్తె చాలు ఆ ప్రాంత చరిత్ర తెలిసిపోతుంది.

Photo Courtesy: Baldiri

సురు వాలీ

సురు వాలీ

సురు వాలీ సురు నది కారణంగా ఏర్పడింది. దీని అందాలకు పర్యాటకులు ముగ్దులవుతారు. ఇక్కడ నుండి కుం మరియు నుం అనే పర్వత శిఖరాలు చూడవచ్చు. సురు వాలీ చుట్టూ ఇతర టూరిస్ట్ ప్రదేశాలు జన్స్కార్, పాడుం వంటివి కలవు. ప్రకృతి అందాలను ఆరాధించేందుకు ఇది ఒక అద్భుత ప్రదేశం.

Photo Courtesy: Motohiro Sunouchi

వన్య జీవులు

వన్య జీవులు

లడఖ్ లోని పర్వత ప్రదేశాలు వివిధ రకాల జంతువులకు నిలయం. వీటిలో స్నో లియోపార్డ్ లేదా మంచు పులి ప్రసిద్ధి. అరుదుగా ఇది కనపడుతుంది. అధికంగా చలికాలంలో కనపడుతుంది. ఇక్కడ కనపడే మరొక జంతువు టిబెట్ తోడేలు. ఇది గ్రామీణుల పశు సంపదలపై దాడి చేస్తూ వుంటుంది. ఈ ప్రాంతంలో బ్రౌన్ బేర్ లు కూడా కలవు. ట్రెక్కింగ్ చేసే వారు వీటిని తమ మార్గంలో చూడవచ్చు.

Photo Courtesy: Tambako The Jaguar

ఆహారాలు

ఆహారాలు

లెహ్ ప్రాంతంలో వివిధ రకాల వంటకాలు కనపడతాయి. టిబెట్ దేశపు వంటకాలు అధికం. ఆహారాలలో దుంపలు, కూరలు అధికంగా వాడతారు. Photo Courtesy: neosprassus

లడఖ్ అధిక ఆకర్షణలకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X