Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు !

ఇండియాలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు !

సహజ అందాలు, సాంస్కృతిక వైభవ ప్రదేశాలలో ఇండియా అద్వితీయం. ఇండియా లో విదేశీ పర్యటన నానాటికి దిన దినాభివృద్ధి చెందుతోంది. ఇందుకు కారణం ఇండియా లో అనేక గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉండటమే. ఈ ప్రదేశాలను ఐక్యరాజ్య సమితి లోని ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ సంస్థ (యునెస్కో) గుర్తింపు నిచ్చింది.

ఇది కూడా చదవండి : ఇండియా లోని మరిన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు !

 ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలు

మత పర గుహలైన ఎల్లోరా గుహలు మొత్తంగా ఇక్కడ 34 గుహలు కలవు. రాతిలో మలచబడిన ఈ గుహలు ప్రపంచ ప్రసిధి గాంచినవి. ఈ గుహలు సుమారుగా క్రీ. శ. 600 నుండి క్రీ. శ.1000 సంవత్సరాల నాటివిగా చెపుతారు.

ఎలిఫెంటా గుహలు

ఎలిఫెంటా గుహలు

ఎలిఫెంటా గుహలు హిందూ మరియు బౌద్ధ మతస్తుల గుహలు. ఇవి ముంబై కి సమీపంలో అరేబియా సముద్రంలో కల ఎలిఫెంటా అనే దీవిలో కలవు. ఈ గుహలు సుమారుగా 5 నుండి 8 శాతాబ్దాలనాటివి. ఈ గుహలకు యునెస్కో సంస్థ వారసత్వ ప్రదేశ గుర్తింపు 1987 సంవత్సరంలో వచ్చింది.
Pic credit: Wiki Commons

ఛత్రపతి శివాజీ టెర్మినస్

ఛత్రపతి శివాజీ టెర్మినస్

గతంలో 'విక్టోరియా టెర్మినస్ ' గా పిలువబడిన ఈ రైల్వే స్టేషన్ ఇండియా లోని అన్ని రైలు స్టేషన్ ల కంటే బిజి గా వుంటుంది. దీని రూప కల్పన 1887 - 88 లలో బ్రిటిష్ ఇంజనీర్ ఫ్రెడరిక్ విల్లియం స్టేవెన్స్ చేసారు. నిర్మాణం పూర్తి చేసుందుకు సుమారు పది సంవత్సరాల కాలం పట్టింది. గోతిక్ శిల్ప తీరులో నిర్మించబడిన ఈ రైలు స్టేషన్ కు 17 వ శతాబ్దపు మరాఠా రాజు అయిన ఛత్రపతి శివాజీ పేరు పెట్టారు. ఈ రైలు స్టేషన్ కు 2004 సంవత్సరంలో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది.
Pic credit: Arian Zwegers

 సన్ టెంపుల్, కోణార్క్

సన్ టెంపుల్, కోణార్క్

ఒరిస్సా రాష్ట్రంలోని కోణార్క్ లో కల ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం 13 వ శతాబ్దానికి చెందినది. ఈ దేవాలయం సూర్య భగవానుడి కొరకు ఒక రధం ఆకారంలో 24 రధ చక్రాలతో, ఆరు అందమైన గుర్రాలతో నిర్మించారు.

కయోలదో నేషనల్ పార్క్

కయోలదో నేషనల్ పార్క్

కయలోదో నేషనల్ పార్క్ భరత్ పూర్ లో కలదు. ఈ ప్రదేశానికి ప్రతి సంవత్సరం వింటర్ సీజన్లో అనేక సుదూర ప్రాంతాలైన ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, చైనా, సైబీరియా దేశాలనుండి సుమారు 364 రకాల పక్షులు వలస గా వస్తాయి.
Pic credit: Wiki Commons

జంతర్ మంతర్

జంతర్ మంతర్

జంతర్ మంతర్ ను యునెస్కో సంస్థ ఒక ఖగోళ నైపుణ్యాల గుట్టగా, ' మొగల్ పాలనా కాల చివరి శకంలోని ఒక పండిత యువ రాజు యొక్క రూప కల్పన ' గా అభివర్ణించింది. జైపూర్ లోని జంతర్ మంతర్ రెండవ మహారాజ జై సింగ్ నిర్మించిన అయిదు ఖగోళ నిర్మాణాలలోఒకటి కాగా దీనిని ఢిల్లీ లోని జంతర్ మంతర్ నమూనా లో నిర్మించారు. .

Pic credit: Wiki Commons

చోళ రాజుల దేవాలయాలు

చోళ రాజుల దేవాలయాలు

తంజావూర్ లోని చోళ వంశ రాజులు నిర్మించిన గొప్పవైన బృహదీశ్వర టెంపుల్, గంగై కొండ చోలీస్వరం టెంపుల్ మరియు దరాసురం లోని ఐరావతేస్వర టెంపుల్ లు 11 మరియు 12 శతాబ్దాల నాటివి. ఈ దేవాలయాల శిల్ప శైలి కి గాను యునెస్కో సంస్థ వాటికి ప్రపంచ వారసత్వ ప్రదేశాల గుర్తింపు ఇచింది.
Pic credit: Wiki Commons

ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ, ' విజయాల నగరం ' ను మొగల్ చక్రవర్తి అక్బర్ 16 వ శతాబ్దంలో నిర్మించాడు. అయితే ఈ ప్రదేశాన్ని14 సంవత్సరాల తర్వాత అక్కడ నీరు లభ్యత లేకపోవటం వలన, మరియు వాయువ్య ప్రాంతంలోని అల్లర్ల కారణంగా , పాడు బెట్టారు.
Pic credit: rohanbabu

నందా దేవి మరియు వాలీ అఫ్ ఫ్లవర్స్

నందా దేవి మరియు వాలీ అఫ్ ఫ్లవర్స్

విభిన్న జీవ వైవిధ్యం కల ఈ ప్రాంతం హిమాలయాల పడమటి భాగంలో కలదు. ఈ ప్రాంతం అద్భుత సహజ అందాలకు, ఆల్పైన్ పూవులకు ప్రసిద్ధి. నందా దేవి కొండలు మరియు పూవుల లోయ రెండూ కలిసి నందా దేవి బయో స్ఫియర్ రిజర్వు గా ప్రకటించారు. 2004 సంవత్సరం నుండి ఈ ప్రాంతం యునెస్కో వరల్డ్ నెట్ వర్క్ అఫ్ బయో స్ఫియర్ రిజర్వు లలో చేర్చ బడింది.
Pic credit: Wiki Commons

ఇండియా లోని మౌంటేన్ రైల్వేస్

ఇండియా లోని మౌంటేన్ రైల్వేస్

ఇండియా లోని మౌంటెన్ రైల్వేస్ అంటే అవి డార్జీలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటెన్ రైల్వే మరియు కలకా - షిమ్లా రైల్వే లైన్ లు. కాంగ్రా వాలీ రైల్వే మరియు మాతేరాన్ హిల్ రైల్వే లు కూడా మౌంటెన్ రైల్వే ల కిందకు వస్తాయి. క్లిష్టమైన కొండ ప్రాంతాలలో వేసిన ఈ రైల్వే లైన్ లకు ప్రపంచ వారసత్వ గుర్తింపు కలదు.
Pic credit: Wiki Commons

సుందర్ బన్స్

సుందర్ బన్స్

సుందర్ బన్స్ లోని నేషనల్ పార్క్ చాలా అందమైనది ప్రపంచంలోనే అతి పెద్ద వన్య సంపద. ఈ ప్రదేశాన్ని యునెస్కో బయో స్ఫియర్ రిజర్వు ల జాబితాలో 1987 లో చేర్చారు. ఈ ప్రదేశం అతి పెద్ద బెంగాల్ టైగర్ రిజర్వు గాను మరియు వివిధ జాతుల పాములకు, పక్షులకు నిలయంగాను ప్రకటించబడింది. అందమైన ఈ ప్రదేశాన్ని యునెస్కో సంస్థ ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
Pic credit: www.beontheroad.com

పడమటి కనుమలు

పడమటి కనుమలు

పడమటి కనుమలు పడమటి కనుమల కొండలను సహ్యాద్రి పర్వత శ్రేణులు అని కూడా అంటారు. ఈ పర్వత శ్రేణి ఇండియా పశ్చిమ భాగంలో విస్తృతమైన భూమి లో కలదు. ఈప్రాంతంలోని 39 ప్రదేశాలను వరల్డ్ హెరిటేజ్ ప్రదేశాలుగా గుర్తించారు. వీటిలో కేరళలో 20 ప్రదేశాలు, కర్నాటక లో 10 ప్రదేశాలు, తమిళనాడు లో 5 ప్రదేశాలు, మహారాష్ట్ర లో 4 ప్రదేశాలు కలవు. ఈ ప్రదేశాలను వరల్డ్ హెరిటేజ్ ప్రదేశాలుగా ప్రకటించారు.

రాజస్థాన్ లోని హిల్ ఫోర్ట్స్

రాజస్థాన్ లోని హిల్ ఫోర్ట్స్

రాజస్థాన్ లోని ఆరావళి పర్వత శ్రేణులలో కల కొన్ని హిల్ ఫోర్ట్స్ కు కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు లభించింది. ఈ కోటలు లో చిత్తోర్ ఘర్ కోట, కుమ్భాల్ ఘర్ ఫోర్ట్, అంబర్ ఫోర్ట్, జైసల్మేర్ ఫోర్ట్, గాగ్రోన్ ఫోర్ట్ మరియు రణథంబోర్ కోటలు ప్రధానమైనవి. ప్రతి కోట యొక్క విశేష అంశం యునెస్కో జాబితా కు చేర్చబడింది.

మహాబలిపురం స్మారక చిహ్నాల సముదాయం

మహాబలిపురం స్మారక చిహ్నాల సముదాయం

క్రీ శ. 7 మరియు 8 శతాబ్దాలలో పల్లవ రాజులచే మహాబలిపురంలో నిర్మించబడిన 40 రాతి చెక్కడ నిర్మాణాలకు యునెస్కో సంస్థ గుర్తింపు నిచ్చింది. వీటిలోని ఓపెన్ ఎయిర్ బాస్ రిలీఫ్ ప్రపంచంలోనే అతి పెద్దది.
Pic credit: Wiki Commons

ఆగ్రా ఫోర్ట్

ఆగ్రా ఫోర్ట్

సాధారణంగా అందరూ, ఆగ్రా వెళితే, తాజ్ మహల్ వరకు చూసి ఆనందిస్తారు. కాని దీని సమీపంలో కల ఆగ్రా కోట కూడా ఆకర్షనీయమే. ఈ ఫోర్ట్ ను రెడ్ ఇసుక రాతి తో నిర్మించటం చే దీనిని రెడ్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ కోట నిర్మాణ శైలి పర్షియా మరియు ఇండియా శిల్ప కళా శైలి కలిగి వుంది. ఈ కోటలో అనేక పాలస్ లు, టవర్లు, మసీదులు కలవు. ఈ నిర్మాణం క్రీ. శ. 16 మరియు 18 శతాబ్దాల నాటిది.
Pic credit:Matthias Rosenkranz

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X