Search
  • Follow NativePlanet
Share
» »లోనార్ గొయ్యి - ఒక శాస్త్రీయ అద్భుతం !

లోనార్ గొయ్యి - ఒక శాస్త్రీయ అద్భుతం !

By Mohammad

లోనార్ ... మహారాష్ట్రలోని ఒక అద్భుత సైట్ సీఇంగ్ ప్రదేశం. విదర్భ ప్రాంతంలోని బుల్దానా జిల్లాలో ముంబై నగరం నుండి 450 కిలోమీటర్ల దూరంలో, ఔరంగాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో లోనార్ కలదు. మంచు యుగంలో భూమి ఉపరితలాన్ని తాకిన ఉల్కాపాతం వల్ల ఏర్పడ్డ గొయ్యి కి ఇది ప్రసిద్ధి చెందినది. ఈ ఉల్క 52, 000 ఏళ్ల కిందట భూమిని ఢీ కొట్టిందని ఖగోళ శాస్త్రవేత్తల అంచనా.

ఇది కూడా చదవండి : చిఖల్ ధార లో సందర్శనీయ స్ధలాలు !

లోనార్ ఎందుకు చూడాలి ?

లోనార్ ఏర్పడ్డ గొయ్యి శాస్త్రీయ అద్భుతానికి తక్కువేమి కాదు. విశ్వ రహస్యాల గురించి ఆసక్తి గల యాత్రికులు, భూగర్భ శాస్త్రం లేదా సామాన్య శాస్త్రం ఇష్టమైన వాళ్ళు తప్పని సరిగా జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని సందర్శించాలి.

దైత్యసుదన్ ఆలయం

దైత్యసుదన్ ఆలయం

దైత్య సుదన్ ఆలయాన్ని దర్శించిన వారికి 'ఖజురహో' ఆలయం తప్పక గుర్తుకు వస్తుంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 6 -12 వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినట్లు చెబుతారు. ఇది విష్ణువుకు అంకితం చేయబబడింది. దేవాలయ గోడలపై అందమైన శిల్పకళా సంపద ఆకట్టుకుంటుంది.

చిత్రకృప : Smundra

లోనార్ ధార్ ఆలయం

లోనార్ ధార్ ఆలయం

లోనార్ ధార్ ఆలయం కూడా విష్ణుమూర్తికి చెందినది. ఆలయానికి పక్కనే నీటి సెలయేరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీరు ఎప్పటికీ ఇంకిపోదు. ఈ ప్రవాహం ఎక్కడ మొదలవుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు.

చిత్రకృప : Satish-ansingkar

కమలాజ ఆలయం

కమలాజ ఆలయం

ఇది లోనార్ సరస్సుకు దక్షిణ దిక్కున కలదు. దీనిని మాత కమలాజ దేవికి అంకితం ఇచ్చారు. ఏటా దేవాలయం వద్ద నిర్వహించే ఉత్సవాలలో పాల్గొనటానికి భక్తులు వస్తుంటారు.

చిత్రకృప : Satish-ansingkar

మోత మారుతి ఆలయం

మోత మారుతి ఆలయం

సమయం ఉంటె లోనార్ లో చూడవలసిన మరో దేవాలయం మోత మారుతి ఆలయం. ఇందులో 9 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం కలదు.

చిత్ర కృప : Satish-ansingkar

లోనార్ గొయ్యి

లోనార్ గొయ్యి

శిలా ప్రాంతంలో ఏర్పడ్డ ఏకైక ఉప్పునీటి సరస్సుగా లోనార్ ప్రసిద్ది చెందింది. లోనార్ గ్రామంలో వున్న ఈ గొయ్యి దిగ్భ్రాంతి పరిచేలా 52000 ఏళ్ల క్రితం భూమిని తాకిన ఉల్కాపాతం వల్ల ఏర్పడిందని చెప్తారు.

చిత్ర కృప : Akshay Charegaonkar

ఆకర్షణ

ఆకర్షణ

ప్రస్తుతం ఈ గొయ్యి చుట్టూ వివిధ జాతుల పక్షులతో కూడిన దట్టమైన అడవులు ఏర్పడ్డాయి. బాతులు, గుడ్లగూబలు, నెమళ్ళు లాంటి పక్షులను ఇక్కడ చూడవచ్చు. అయితే, ఈ సరస్సు ఎలాంటి వృక్ష, జలచరాల మనుగడకు అనువైనది కాదు. ఈ సరస్సు స్వతహాగా చూడాల్సిన ఆకర్షణ. అంబర్ సరస్సు సమీపంలో చూడవలసిన మరొక సరస్సు.

చిత్రకృప : Satish-ansingkar

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

విమానమార్గం : ఔరంగాబాద్ సమీప విమానాశ్రయం. ఇది లోనార్ కు 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి చేరుకోవచ్చు.

రైలు మార్గం : జాల్నా సమీప రైల్వే స్టేషన్. ఇది లోనార్ కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఔరంగాబాద్ ఇక్కడున్న మరొక ప్రధాన రైల్వే స్టేషన్. ఇది పర్యాటకులకు అన్ని విధాలా అనుకూలమైనది.

రోడ్డు/ బస్సు మార్గం : ఔరంగాబాద్ కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి కనుక ఔరంగాబాద్ చేరుకొని అక్కడి నుండి లోనార్ కు చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X