Search
  • Follow NativePlanet
Share
» »ఈ ప్రదేశాలు సందర్శించే ధైర్యం ఉందా?

ఈ ప్రదేశాలు సందర్శించే ధైర్యం ఉందా?

మీరు కనుక నేను ఏ ప్రదేశానికైనా సరే వెళ్లి రాగలను అనుకుంటే, అది కొంతమంది విషయంలో తప్పు కాగలదు. ఇండియా లో కొన్ని వింత ప్రదేశాలు కలవు. అవి మీకు ఆసక్తి కలిగించటమే కాక, భయం పుట్టిస్తాయి. ఈ ప్రదేశాలు పర్యాటకులలో ఎందుకు అంత భయోత్పాదనలు కలిగిస్తాయి ? వీటిలో కొన్ని ప్రదేశాలు అందిస్తున్నాం. పరిశీలించండి. అడుగు పెట్టె ముందు మరొక్కమారు ఆలోచించండి.

కుల ధారా !

కుల ధారా !

కుల ధారా గ్రామం ఒక నిర్మానుష్య గ్రామం. ఈ గ్రామం రాజస్తాన్ లోని జైసల్మేర్ జిల్లా లో కలదు. ఒకప్పుడు కుల్దారా గ్రామం ఎంతో కళ కళ లాడుతూ ప్రజలతో నిండి వుండేది.

Photo Courtesy: Archan dave

కుల ధారా విలేజ్

కుల ధారా విలేజ్

అయితే, ఎంతో ఆశ్చర్య కరంగా గ్రామస్తులు రాత్రికి రాత్రే ఈ గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ రాత్రి నుండి అక్కడ ఎవరూ నివసించ లేదు. గ్రామం అంతా పాడు బడింది. ఎక్కడ చూసినా కూలిన ఇండ్లు. భరించలేని నిశ్శబ్దం.

Photo Courtesy: Archan dave

మేఘాలయ లోని కొన్ని గుహలు

మేఘాలయ లోని కొన్ని గుహలు

ఇక్కడ దయ్యాలు లేవు. అయినా భయమే. చిమ్మ చీకటి. భరించలేని నిశ్శబ్దం. ఇది మేఘాలయ లోని కొన్ని గుహల పరిస్థితి. వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఒక్క క్షణం కూడా నిలువ లేని స్థితి.

గుహలు

గుహలు

ఈ గుహలు. మీరు నిజంగా భయ పడాలంటే, ఖాసి హిల్స్ పై కల ఈ కొండలు దర్శించండి. భయం పుట్టి అరుపులు పెట్టాల్సిందే. ఫోటో క్రెడిట్ : Biospeleologist

జన్స్కార్ సరస్సు

జన్స్కార్ సరస్సు

ఈ ప్రదేశం లోకి వెళితే, మీ రక్తం గడ్డ కట్టాల్సిందే. అదే లడఖ్ లోని జన్స్కార్ సరస్సు. భయంతో ఒక విగ్రహం అవ్వాల్సిందే. అయినప్పటికీ కొంతమంది ధైర్యం కల పర్యాటకులు ఇక్కడకు ట్రెక్కింగ్ లో వస్తారు.

ఫోటో క్రెడిట్ : Abdulsayed

అస్థిపంజరాలు

అస్థిపంజరాలు

అస్థిపంజరాలు మీకు భయమా ? మన సమీపంలో అస్థిపంజరం వుందంటే, భయమే మరి. ఇక ఒక సరస్సు నిండా అస్థిపంజరాలు ఉన్నాయంటే, ఆ సరస్సులో మీరు వున్నారంటే, ఊహించటం కూడా భయానకమే. అవును, ఈ రకమైన సరస్సు కలదు. అదే ఉత్తరాఖండ్ లోని రూప కుండ్ సరస్సు. ఎంతో మిస్టరీ కల ఈ సరస్సు పై అనేక గాధలు కలవు. మరి వెళ్లేందుకు ధైర్యం చేస్తారా ?

ఫోటో క్రెడిట్ : FxJ

మణికర్ణిక ఘాట్

మణికర్ణిక ఘాట్

శవాల కంపు ! ఒక్క క్షణం కూడా నిలువ లేని పరిస్థితి. అదే వారణాసి లోని ప్రసిద్ధ మణికర్ణిక ఘాట్ ప్రదేశం. ఇక్కడ హిందూ మతస్తుల మరణించిన తమ బంధువుల శరీరాలు తగుల బేడతారు. ప్రతి రోజూ వందలాది శవాలు ఇక్కడ దగ్ధం చేయబడతాయి.మరి ఈ ప్రదేశం సందర్శనకు మీరు ధైర్యం చేస్తారా ?

ఫోటో క్రెడిట్ : Arian Zwegers

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X