Search
  • Follow NativePlanet
Share
» »యమునానగర్ - అందమైన నేచర్ పార్కులు !!

యమునానగర్ - అందమైన నేచర్ పార్కులు !!

By Mohammad

యమునా నగర్ ప్రధానంగా ప్లై వుడ్ యూనిట్లకు ప్రసిద్ది చెందిన ఒక శుభ్రమైన, సుసంపన్నమైన పారిశ్రామిక నగరం. హర్యానా నగరాలలో ఒకటైన ఈ నగరం, యమునా నది వద్ద దీవించబడింది. అడవులు, ప్రవాహాలు కూడా విస్తారంగా ఉన్న ఉత్తర సరిహద్దు చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ యమునా నది కొండల నుండి మైదానాలలో ప్రవహిస్తుంది.

హిసార్ పర్యాటకులను ఆకర్షించే అయస్కాంత నగరం !

చరిత్ర

యమునా నగర్ చరిత్ర అందమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది I947 లో విభజన తర్వాత భారతదేశం వలస వచ్చిన శరణార్థులకు నివాసంగా ఉండేది. ఇంతకుముందు 'అబ్డుల్లహ్పూర్' అని పిలిచేవారు. హర్యానాలోని ఈ ప్రాంతంలో పురావస్తు సర్వే ద్వారా హరప్పా రాళ్ళు, ఇటుకలు కనుగొనబడ్డాయి.

కాలేసర్ వన్యప్రాణుల అభయారణ్యం

కాలేసర్ వన్యప్రాణుల అభయారణ్యం

తూర్పు హర్యానాలో ఉన్న కాలేసర్ వన్యప్రాణుల అభయారణ్యం చండీగర్ నుండి షుమారు 126 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కాలేసర్ నేషనల్ పార్క్ గా ప్రసిద్ది చెందింది.

చిత్రకృప : elly

నేషనల్ పార్కు

నేషనల్ పార్కు

అభయారణ్యం 2003 డిసెంబర్ లో ప్రభుత్వం వారిచే జాతీయ పార్కుగా పేర్కొనబడింది, ఈ నేషనల్ పార్కు ప్రధానంగా హిమాలయాల దిగువ భాగాన ఉన్న శివాలిక్ కొండలతో పాటు ఒక సాల్ అడవి.

చిత్రకృప : Kukoo007

11,000 ఎకరాలలో

11,000 ఎకరాలలో

కాలేసర్ నేషనల్ పార్కు ప్రాంతం 2000 అడుగుల నుండి 3500 అడుగుల ఎత్తుతో షుమారు 11,000 ఎకరాలలో ఉంది.

చిత్రకృప : Firefly can fly

జంతు సంపద

జంతు సంపద

ఈ కాలేసర్ నేషనల్ పార్క్ అనేక రకాల పక్షులు, జంతువులతో వన్యప్రాణుల ఆశక్తి గల వారికి ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుందని నిరూపించింది. అడవి బోర్లు, సంబర్లు, హేర్లు, రెడ్ జంగిల్ ఫౌల్, పోర్క్యుపైన్ వంటి కొన్ని ఆశక్తికర జ౦తుజాతులు ఇక్కడ కనిపిస్తాయి.

చిత్రకృప : Yathin S Krishnappa

వృక్ష సంపద

వృక్ష సంపద

ఖైర్, సాల్ శిషం, సైన్, ఝింగాన్, చాల్ వంటి చెట్లు, మొక్కలు కూడా ఉంటాయి. సిందూర చెట్లకి కూడా ఈ నేషనల్ పార్కు ప్రసిద్ది చెందింది.ఇక్కడ వృక్ష, జంతుజాతులే కాకుండా, అద్భుతమైన దృశ్యాలను కూడా అందించే ఈ నేషనల్ పార్కు సందర్శకులను ఆనందపరుస్తుంది.

చిత్రకృప : Firefly can fly

అటవీ వసతి గృహం

అటవీ వసతి గృహం

సందర్శకులు ఈ నేషనల్ పార్కు లోని అటవీ వసతి గృహం నుండి యమునా నది అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. ఈ భవనం అందమైన తోటల మధ్య ఉంది, ఇది ఎక్కువ-పైకప్పు గదులతో, టేకు ఫలకాలు, ప్రదర్సనశాలకు గచ్చులతో గొప్పగా అమర్చబడి ఉంది.

చిత్రకృప : Koshy Koshy

చౌదరి దేవి లాల్ హెర్బల్ నేచర్ పార్కు

చౌదరి దేవి లాల్ హెర్బల్ నేచర్ పార్కు

యమునా నగర్ వద్ద, చుహర్పూర్ గ్రామ సమీపంలో ఉన్న చౌదరి దేవి లాల్ హెర్బల్ నేచర్ పార్కు పరిశోధన కేంద్రంగా పేరుగాంచింది, ఇక్కడ అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.

చిత్రకృప : Cliff

శివాలిక్

శివాలిక్

2001 నవంబర్ 6 న ఏర్పాటుచేయబడిన ఈ పార్కు ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఔషధ మొక్కలని, మూలికాలని అందిస్తుంది. ఈ నేచర్ పార్కు హర్యానా లోని హిమాలయాల లోని శివాలిక్ శ్రేణుల సమీపంలో కనిపిస్తాయి.

చిత్రకృప : FlickreviewR

నీటి మొక్కలు

నీటి మొక్కలు

షుమారు 184 ఎకరాలలో ఉన్న ఈ చౌదరి దేవి లాల్ హెర్బల్ నేచర్ పార్కులో పెరిగే ఔషధ మొక్కలు, మూలికలు, పొదలు, తీగలు, నీటి మొక్కలు 300 రకాలకు పైగా ఉన్నాయి. ఈ పార్కుని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం స్థానిక ఔషధ, సుగంధ మొక్కలను పునరుద్ధరించడం.

చిత్రకృప : Pieria

వనమూలికలు

వనమూలికలు

అశ్వగంధ, సఫేద్ ముసలి, సర్పగంద, వాచ్, బ్రాహ్మి, చిత్రాక్, ఇసాబ్గోల్ వంటి ఆయుర్వేద మొక్కలతోపాటు ఖైర్, టేకు, శిషం, సింబల్ వంటి మొక్కలు, చెట్లు ఉన్నాయి.

చిత్రకృప : Jeansef

పిప్పలి

పిప్పలి

ఈ హెర్బల్ నేచర్ పార్క్ వద్ద తులసి, పిప్పలి, మకోయ్, భూమి అమలకి, బహేరా, గ్వర్పత, హర్డ్, ఆమ్ల, బేల్, కలిహరి, హల్ది, నిమ్మగడ్డి, అతిమధురం, జట్రోఫ, పల్మరోస వంటివి కూడా చూడవచ్చు.

చిత్రకృప : Silk666

హెర్బల్ ప్రకృతి పార్క్

హెర్బల్ ప్రకృతి పార్క్

చౌదరి దేవి లాల్ హెర్బల్ ప్రకృతి పార్క్ సందర్శకులు ఔషధ మూలికల వివరణలు బోర్డుల ఉంచడం వల్ల వాటిని గురించి మరింత సులభంగా తెలుసుకోవచ్చు. అదనంగా ఈ నేచర్ పార్క్ లో పిల్లల పార్కు, వెదురు కాటేజ్ లు ఉన్నాయి.

చిత్రకృప : Yathin sk

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

యమునానగర్ లో చూడవలసిన ఇతర ఆకర్షణలు : కాలేసర్ జాతీయ పార్కు, బిలాస్పూర్ మరియు కపాల్ మోచన్ మొదలుగునవి.

చిత్రకృప : Gagandeep2065

యమునా నగర్ చేరుకోవడం ఎలా

యమునా నగర్ చేరుకోవడం ఎలా

రోడ్డు మార్గం : యమునా నగర్ నుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతం నుండి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు నడుస్తాయి.

రైల్వే స్టేషన్ : యమునా నగర్ స్వంత స్టేషన్ ఉంది, ఇది ఇతర సమీప రాష్ట్రాలు, హర్యానా లోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.

వాయు మార్గం : చండీగర్ లోని షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం యమునా నగర్ కి సమీప విమానాశ్రయం, విమానాశ్రయం నుండి రెండు గంటల ప్రయాణం ఉంటుంది.

చిత్రకృప : Anil Kumar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more