Search
  • Follow NativePlanet
Share
» »ఏలగిరి హిల్స్ ఏడాదంతా కూల్ ..కూల్...గా ఉంటుంది! సమ్మర్ లో ఆహ్లాదకరం

ఏలగిరి హిల్స్ ఏడాదంతా కూల్ ..కూల్...గా ఉంటుంది! సమ్మర్ లో ఆహ్లాదకరం

ఎలగిరి తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న హిల్ స్టేషన్, పర్యాటకులకు స్వర్గధామం. రెండు ఎత్తైన కొండల మధ్య 14 చిన్న గ్రామాలతో కలిసి ఉన్న అందమైన ప్రాంతం ఎలగిరి. చెన్నై నుంచి 227 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగిరి పర్యాటక కేంద్రంలో చూడదగిని ప్రాంతాలు కోకొల్లలు. సమయం ఉండాలేకాని రెండురోజుల వీకెండ్ మొత్తం సరిపోతుంది. తమిళనాడులో ఊటి, కొడైకెనాల్ తరువాత మళ్లీ అంత ప్రశాంతతను చేకూర్చే పర్యాటక కేంద్రం ఏదైనా ఉందంటే అది ఎలగిరి మాత్రమే.

ఎలగిరి రాగానే ఎవరికైనా కనిపించేది ఇక్కడి నిశ్శబ్ద, ప్రశాంత పరిసరాలు, ఈ ప్రాంతంలో ఉండే అందం. ఎలగిరి కొండల్లో విహారం జీవితంలో మరిచిపోలేని అనుభూతినిస్తుంది. తమిళనాడులోని మిగిలిన హిల్ స్టేషలన్నీ రద్దీగా ఉంటే, ఏలగిరి మాత్రం పర్యాటకులకు ఏకాంత వాతావరణాన్ని అందిస్తుంది. 3500 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశమంతా తాజా పళ్ళ ఘుమఘుమలు, రాలిన ఆకులతో ఈ ప్రాంతం నిండిపోతుంది, ఎందుకంటే ఇక్కడ పళ్ళతోటలు, గులాబి తోటలు, పచ్చటి లోయలు వాటి అందాలతో అలరారుతున్నది.

ఇక్కడ పచ్చని లోయలు, మైదానాల గుండా ప్రయాణించడం చాలా

ఇక్కడ పచ్చని లోయలు, మైదానాల గుండా ప్రయాణించడం చాలా

ఇక్కడ పచ్చని లోయలు, మైదానాల గుండా ప్రయాణించడం చాలా బాగుంటుంది. ఎలగిరిలోని వేలవన్ దేవాలయం, స్వామిమలై కొండ, జవడి హిల్స్ , పలమతి హిల్స్ లాంటి పర్వత ప్రాంతాలు పర్వతారోహణ లాంటి ఇతర దర్శనీయ ప్రదేశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుండి పచ్చటి లోయలను చూస్తే... కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేనిది. ట్రెక్కింగ్ చేసే వారికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ సహజమైన పార్కులు ప్రభుత్వ హెర్బల్, ఫ్రూట్స్ గార్డెన్స్ ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి

PC: solarisgirl

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పారాగ్లైడింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌ వంటి సాహస క్రీడలకు కూడా అనుమతినిచ్చారు. సహజంగా చెప్పాలంటే ఎలగిరి వీకెండ్ ట్రిప్ కు బాగుంటుంది. అయితే ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేయాలనుకునే వారు కూడా ఎలగిరిని సందర్శించవచ్చు.

Photo Courtesy: Coolsangamithiran

ఎలగిరిలో చూడటానికి మరెన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలున్నాయి

ఎలగిరిలో చూడటానికి మరెన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలున్నాయి

ఎలగిరిలో చూడటానికి మరెన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలున్నాయి. వాటిలో ముఖ్యంగా పుంగనూర్ లేక్ అండ్ పార్క్, న్యేచర్ పార్క్, మురుగన్ టెంపుల్, శివ టెంపుల్, స్వామిమలైన హిల్స్ , మరియు అడ్వెంచర్ క్యాంప్.

Photo Courtesy: Akshatha Vinayak

స్వామిమలైన :

స్వామిమలైన :

చిన్న చిన్న కొండల్లా పరచుకున్న ఇక్కడి పర్వతశ్రేణిలో ఎత్తైనది స్వామిమలై. ఇది 4,338 అడుగుల ఎత్తులో ఉంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ కొండ ఎక్కాలని ట్రెక్కర్లు కలలు కంటుంటారు. ఈ కొండ పాదంలో ఉన్న గ్రామమే మంగళం. ఇక్కడి నుంచే అందరూ స్వామిమలైని అధిరోహిస్తుంటారు. ఎలగిరిలోని పాలమర్తి, జావడి కొండల్లో కూడా కొందరు ట్రెక్కింగ్‌ చేస్తుంటారు. ట్రంపోలిన్‌, ఆర్చరీ, షూటింగ్‌... వంటి క్రీడల్నీ ఏర్పాటుచేశారిక్కడ. అయితే ఎలగిరి కొండలు పాములకు ఆవాసాలు. ట్రెక్కింగ్‌ చేసేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగులేయాలి.

Photo Courtesy: Ashwin Kumar

పుంగనూర్ సర్సుస్సు:

పుంగనూర్ సర్సుస్సు:

ఎలగిరిలో పుంగనూర్ లేక్ అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం. ఎలగిరి హిల్ స్టేషన్ కే సెంటర్ఆఫ్ ఎట్రాక్షన్ ఇది. ఈ పార్క్ లో ఎంటర్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగో బోటింగ్ కూడా సపరేట్ గా చెల్లించాలి.

Photo Courtesy: Akshatha Vinayak

పుంగనూర్ సర్సుస్సులో బోటింగ్ చేయడం

పుంగనూర్ సర్సుస్సులో బోటింగ్ చేయడం

ముఖ్యంగా ఇక్కడ పుంగనూర్ సర్సుస్సులో బోటింగ్ చేయడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనండంలో సందేహం లేదు. కృత్రిమంగా ఏర్పాటుచేసిన ఆ సరస్సులోని పడవల్లో కాసేపు షికార్లు కొట్టవచ్చు. అక్కడ మోటార్‌బోట్లూ పెడల్‌ బోట్లూ తెడ్డు వేసేవి కూడా ఉన్నాయి. ఇక ఇక్కడికి దగ్గరగా ఎలగిరి అడ్వెంచర్ స్పోర్ట్స్ అసోషియేషన్ నిర్వహించే క్రీడల్లో పాల్గొనడం మరిచిపోకండి.

Photo Courtesy: Akshatha Vinayak

జలగంవరై జలపాతం

జలగంవరై జలపాతం

ఎలగిరికి 5 కి.మీ. దూరంలోని అత్తారు నదినీ, 14 కి.మీ. దూరంలో తిరుపత్తూరు దారిలోని జలగంవరై జలపాతం ఉంది. ఇక్కడికి సమీపంలోనే వైనబప్పు అబ్జర్వేటరీ ఉంది. దీన్ని కవలూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ నిర్వహిస్తోంది. అందులో ఆసియాలోనే అతి పెద్ద టెలీస్కోప్‌ ఉంది. ఇక్కడి నుంచి సమీపంలోనే నిలవూర్‌ వెళ్ళే దారిలో సత్యాశ్రమం ఉంది. కానీ అక్కడికి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే అనుమతిస్తారు.

Photo Courtesy: cprogrammer

మురగన్ టెంపుల్ :

మురగన్ టెంపుల్ :

ఎలగిరిలో మురగన్ (సుబ్రమణ్య) దేవాలయం కూడా మరో ప్రధాన ఆకర్షణ.ఇక్కడ మురుగన్‌ని కువన్‌గానూ వల్లీదేవిని కురతిగానూ కొలుస్తారు. జూలై-ఆగస్టుల్లో ఈ గుడిలో జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు వస్తారు.ఈ ఆలయం ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకూ తెరిచే ఉంటుంది.

Photo Courtesy: Ashwin Kumar

నేచర్ పార్క్ :

నేచర్ పార్క్ :

పుంగనూర్ లేక్ కు సమీపంలో నేచర్ పార్క్ ఉంది. ఈ పార్క్ లో మ్యూజికల్ పౌంటైన్ సాయంత్రం 7 నుండి ప్రారంభం అవుతుంది. ఈ పార్క్ లో వివహరించాలంటే దీనికి కూడా సపరేట్ గా ప్రవేశ రుసుము చెల్లించాలి.

Photo Courtesy: Akshatha Vinayak

ప్యారాగ్లైడింగ్

ప్యారాగ్లైడింగ్

అడ్వెంచర్ యాక్టివిటీస్ కు పెట్టింది పేరు ఎలగిరి, ఇక్కడి రాక్ క్లైంబింగ్, పారాగ్లైడింగ్ మరియు ట్రెక్కింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది.PC:texaus

అడ్వెంచర్ క్యాంప్ :

అడ్వెంచర్ క్యాంప్ :

ఎలగిరి అడ్వెంచర్ క్యాంప్ లో రోప్ యాక్టివిటీస్, క్లైంబింగ్, డార్ట్ గేమ్ మొదలగునవి అనేక క్రీడలు ఆడవచ్చు.

శివ టెంపుల్ :

శివ టెంపుల్ :

పుంగనూర్ లేక్ కు సుమారు 5కిలోమీటర్ల దూరంలో శివుని దేవాలయం ఉంది. ఈ ఆలయం కేవలం శుక్రవారాల్లో మాత్రమే తెరవబడుతుంది.Photo Courtesy: Akshatha Vinayak

శ్రీ లక్ష్మీ గోల్డెన్ టెంపుల్ :

శ్రీ లక్ష్మీ గోల్డెన్ టెంపుల్ :

ఎలగిరి నుండి సుమారు 90కిలోమీటర్ల దూరంలో ఉండే వెల్లూరు లో శ్రీమహాలక్ష్మీ గోల్డెన్ టెంపుల్, వెల్లూర్ ఫోర్ట్ ,జలగంధీశ్వర టెంపుల్, గోల్డెన్ టెంపుల్, రత్నగిరి మురగన్ టెంపుల్ మొదలగు ఇతర ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.వెల్లూరులోనే తప్పక చూడదగ్గ మరో ప్రదేశం శ్రీనారాయణీ పీఠం. వంద ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మలైకోడి ప్రాంతంలో ఈ పీఠం విలసిల్లుతోంది. ఇందులోనే లక్ష్మీదేవి స్వర్ణదేవాలయం ఉంది. శ్రీచక్రం ఆకారంలో ఉన్న ఈ గుడికి వెళ్లే దారిలో గోడలమీద భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ నుంచి తీసుకున్న సూక్తులు కనిపిస్తాయి. ఇవన్నీ చదువుకుంటూ వెళుతుంటే సర్వమత సారం ఒకటే అనిపించక మానదు.

Photo Courtesy: Dsudhakar555

జలదుర్గం:

జలదుర్గం:

ఎలగిరికి 71 కి.మీ. దూరంలో ఉంది వెల్లూరు. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన విజయనగర రాజులే ఇక్కడి కోటను నిర్మించారు. దీన్ని జలదుర్గం అనీ పిలుస్తారు. తరవాత ఈ ప్రాంతాన్ని ఆరవీడు వంశస్తులూ బీజాపూర్‌ సుల్తానులూ మరాఠాలు కూడా పరిపాలించారు. టిప్పుసుల్తాన్‌, శ్రీలంక చివరి చక్రవర్తి విక్రమ రాజసింహలను ఈ వెల్లూరు కోటలోనే బంధించారు. ఈ కోటలోనే జలకంఠేశ్వర ఆలయం ఉంది. ఈ దేవాలయంలో అడుగడుగునా ప్రాచీన శిల్పకళ ఉట్టిపడుతుంటుంది. చాలా సంవత్సరాలు దేవాలయాన్ని ఆయుధాగారంగా వాడినందువల్ల ఇక్కడ మూలవిరాట్టు లేదట. కొంతకాలం క్రితమే శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ప్రస్తుతం కోటలో ప్రభుత్వ మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. పురాతన వస్తువులూ అరుదైన చిత్రపటాలూ ప్రాచీన ఆయుధాలూ నాణేలూ ఇక్కడ భద్రపరిచారు.

PC: Soham Banerjee

సమ్మర్ ఫెస్టివల్ :

సమ్మర్ ఫెస్టివల్ :

తమిళనాడు గౌర్నమెంట్ ప్రతి సంవత్సరం మే మరియు జూన్ నెలల్లో ఇక్కడ సమ్మర్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల్లో ఫోక్ డ్యాన్స్ మరియు వివిధ రకాల సాంస్క్రుతిక కార్యక్రమాలు, వారి సంస్క్రుతి, సంప్రదాయలను చూడవచ్చు. ఉత్సవాల్లో భాగంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నిర్వహించే వాలీబాల్, కబ్బాడి, బోట్ రేస్ మరియు ఇతర క్రీడలను నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవాలి:

ఎలా చేరుకోవాలి:

విమాణం మార్గం: ఎలగిరికి బెంగళూరు ఎయిర్ పోర్ట్ (195కిమీ) మరియు చెన్నై ఎయిర్ పోర్ట్ (217కిమీ) విమానం మార్గం ఉంది. ఈ రెండు ఎయిర్ పోర్టులు డొమస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను నడుపుతాయి.

రైలు మార్గం: ఎలగిరికి అతి సమీపంలో జొలర్ పెట్టై జంక్షన్ ఉంది. ఇది ఎలగిరికి సుమారు 23కిలో మీటర్ల దూరంలో ఉంది. చెన్నై, బెంగళూరు మరియు కోయంబత్తూరు నుండి వచ్చే రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.

రోడ్డు మార్గం: ఎలగిరికి రెగ్యులర్ బస్సు సౌకర్యం ఉంది. పొన్నేరి నుండి రెగ్యులర్ బస్సులు తిరువొత్తూర్, బెంగళూరు, చెన్నై, క్రిష్ణగిరి, వనయంబాడి నుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

Photo Courtesy: Ashwin Kumar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X