Search
  • Follow NativePlanet
Share
» » ఇక్కడ రాత్రి సమయంలో అమ్మవారు క్షుద్రోపాసకులతో ఏమి చేస్తారో తెలుసా? శాస్త్రవేత్తలు కూడా

ఇక్కడ రాత్రి సమయంలో అమ్మవారు క్షుద్రోపాసకులతో ఏమి చేస్తారో తెలుసా? శాస్త్రవేత్తలు కూడా

బీహార్ లోని రాజ రాజేశ్వరీ బాల త్రిపుర సుందరి దేవాలయానికి సంబంధించిన కథనం.

మనదేశంలో లక్షలాది సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని సార్లు అటువంటి ప్రత్యేకతలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని ఆలయాల్లో ఉన్న అటు వంటి ప్రత్యేకతలు శతాబ్ధకాలంగా రహస్యంగానే ఉన్నాయి. శాస్త్ర సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన సమయంలో కూడా అటు వంటి రహస్యాలను ఛేదించలేకపోవడం మరితం విస్మయం కలిగిస్తుంది.

అటువంటి కోవకు చెందినదే బీహార్ లో ఉన్న బాల రాజ రాజేశ్వరీ దేవాలయం. ఆ ఆలయంలో రాత్రి పూట జరిగే తంతు భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ధార్మిక, ఆధ్యాత్మిక ప్రాంతంలోనూ జరగదని చెబుతారు. ఇంతకీ ఏమిటీ శతాబ్దాల రహస్యమన్న విషయం ఈ కథనంలో తెలుసుకొందాం.

బక్సర్ ప్రాంతంలో

బక్సర్ ప్రాంతంలో

P.C: You Tube

బీహార్ లోని బక్సర్ ప్రాంతంలో రాజా రాజేశ్వరి బాలా త్రిపుర సుందరి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది.

క్షుద్ర పూజలు

క్షుద్ర పూజలు

P.C: You Tube

ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ క్షుద్ర పూజలు జరుపుతారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణిమ తదితర రోజుల్లో ఆ పూజలు చాలా ఎక్కువగా జరుగుతాయని చెబతారు.

రాత్రి సమయంలోనే కాదు

రాత్రి సమయంలోనే కాదు

P.C: You Tube

అందువల్లే రాత్రి సమయంలోనే కాదు పగలు కూడా ఈ దేవాలయానికి వెళ్లడానికి చాలా మంది భయపడేవారు. అయితే పగలు మాత్రం ఇక్కడ పూజరాలు పూజలు నిర్వహిస్తారు.

రాతి శాసనాల్లో కూడా

రాతి శాసనాల్లో కూడా

P.C: You Tube

వారిలో కొంతమందికి ఇక్కడ ఆ విగ్రహం నుంచి రాత్రి పూట ఏవో మాటలు వినిపించేవి. ఈ విషయాన్ని వారు స్వయంగా వెళ్లడించారు. ఈ ఆలయంలో ఉన్న కొన్ని రాతి శాసనాల్లో కూడా ఈ విషయం ఉంది.

మాట్లాడుతారు

మాట్లాడుతారు

P.C: You Tube

దీనితో పాటు చాలా ఏళ్లుగా ఆ దేవతను ఆరాధిస్తున్న వారు చెప్పే వివరాల ప్రకారం క్షుద్ర పూజలు చేసేవారితో అమ్మవారు మాట్లాడుతారని చెబుతారు.

అర్థరాత్రి దాటిన తర్వాత

అర్థరాత్రి దాటిన తర్వాత

P.C: You Tube

అది కూడా అర్థ రాత్రి తర్వాత మాత్రమే ఈ సంభాషణ జరుగుతుందని వారు చెబుతారు. కేవలం పూజారులే కాకుండా కొంతమంది భక్తులకు కూడా ఆ మాటలు వినిపించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

అమావాస్య వంటి సందర్భాల్లో జన్మించిన వారు

అమావాస్య వంటి సందర్భాల్లో జన్మించిన వారు

P.C: You Tube

వీరిలో చాలా మంది అమావాస్య వంటి సందర్భాల్లో జన్మించిన వారేనని స్థానికులు చెబుతారు. ఇక ఈ విషయం తెలుసుకొన్న కొంతమంది స్వతహాగా ఆ మాటలను వినడానికి ప్రయత్నించారు కూడా.

 ప్రత్యేక అనుమతి

ప్రత్యేక అనుమతి

P.C: You Tube

ఇందు కోసం అక్కడ తరతరాలుగా అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నవారితోప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పై ఆ నోట ఈ నోట కొంతమంది హేతువాదులకు కూడా తెలిసింది.

విఫలమయ్యారు.

విఫలమయ్యారు.

P.C: You Tube

వీరు శాస్త్రవేత్తలతో కలిసి ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. శాస్త్రవేత్తలు కూడా ఆ విగ్రహం నుంచి మాటలు వినిపిస్తున్నట్లు చెబుతున్నారు.

 వివరించలేకపోయారు.

వివరించలేకపోయారు.

P.C: You Tube

అయితే కాని అవి ఎందుకు వస్తున్నాయన్న కారణాన్ని మాత్రం వివరించలేకపోతున్నారు. ఈ విషయం పై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు.

ఆ రోజుల్లో ఎక్కువ

ఆ రోజుల్లో ఎక్కువ

P.C: You Tube

దీంతో ఈ దేవాలయం లో ఉన్న అమ్మవారు రాత్రి పూట క్షుద్రోపాసకులతో సంభాషణ జరుపుతున్నారని అందరూ నమ్ముతున్నారు. అమావాస్య రోజుల్లో ఆ సంభాషణలు ఎక్కువగా ఉంటున్నాయి.

అనేక బౌద్ధ, జైన దేవాలయాలు

అనేక బౌద్ధ, జైన దేవాలయాలు

P.C: You Tube

రాజ రాజేశ్వరీ బాలా త్రిపుర సుందరి దేవాలయంతో పాటు ఇక్కడ చూడదగిన అనేక ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. అందులో బుద్ధగయ, నలంద, వైశాలి జైనదేవాలయాలు ముఖ్యమైనవి

 గయ

గయ

P.C: You Tube

గయ, బైద్యనాథ దేవాలయాలు కూడా ఇక్కడకు దగ్గరగానే ఉంటాయి. గయలో శ్రాద్ధ కర్మలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇందు కోసం వివిధ దేశాల నుంచి కూడా ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడకు వస్తూఉంటారు.

వీమాన మార్గాలు

వీమాన మార్గాలు

P.C: You Tube

బీహార్ లోని ఈ ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు శ్రీ బాలా త్రిపుర దేవాలయానికి చేరుకోవడానికి దగ్గరగా పాట్నా, గయ విమానాశ్రయాలు ఉన్నాయి.

 రైల్వే, రోడ్డు మార్గాలు

రైల్వే, రోడ్డు మార్గాలు

P.C: You Tube

ఇక్కడకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైల్వే సర్వీసులు బాగా ఉన్నాయి. అదే విధంగా రోడ్డు మార్గం ద్వారా కూడా సులభంగా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X