Search
  • Follow NativePlanet
Share
» »ఈ దేవాలయంలో ప్రసాదంగా ఏమిస్తారో తెలుసా

ఈ దేవాలయంలో ప్రసాదంగా ఏమిస్తారో తెలుసా

చెన్నైలోని దుర్గా దేవాలయంలో బర్గర్, బ్రౌనీలను ప్రసాదంగా అందజేస్తారు. ఇందుకు సంబంధించిన కథనం.

By Kishore

భారత దేశంలోని హిందూ ఆచార, వ్యవహారాల్లో దేవాలయ దర్శనం కూడా ఒకటి. దేవాలయాలకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పదార్థాన్ని ప్రసాదంగా అందజేస్తారు. కొన్ని దేవాలయాల్లో విచిత్రంగా విస్కీ, బ్రాంది వంటి మద్యాన్ని ప్రసాదంగా అందజేస్తే, మరికొన్ని చోట్ల చాకొలేట్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతారు. ఇంకొన్ని చొట్ల గంజాయి, మరికొన్ని చెట్ల బహిష్టు వస్త్రం కూడా ప్రసాదం పంపకంలో భాగంగా ప్రజలకు అందజేస్తారు. చెన్నైలో ఉన్న జయదుర్గా దేవాలయం కూడా ఇదే కోవకు చెందుతుంది. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా బర్గర్, బ్రౌనీని ఇస్తారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో మీ కోసం...

దురదృష్టం పోగొట్టి అదృష్టం కలుగజేసే ఏకైక నవ బ్రహ్మ ఆలయందురదృష్టం పోగొట్టి అదృష్టం కలుగజేసే ఏకైక నవ బ్రహ్మ ఆలయం

1. నైవేద్యమే ప్రసాదంగా...

1. నైవేద్యమే ప్రసాదంగా...

Image Source:

హిందూ ధర్మంలో దేవుళ్లకు నైవేద్యం పెట్టడం వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. ఈ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదం రూపంలో పంచిపెడుతారు. ముఖ్యంగా లడ్డు, పాయసం, హల్వా, పులిహోర, పెరుగన్నం తదితరాలను అందజేస్తారు.

2. కొన్ని దేవాలయాల్లో...

2. కొన్ని దేవాలయాల్లో...

Image Source:

అయితే భారత దేశంలోని కొన్ని దేవాలయాల్లో మత్రం ఇటీవల భారత దేశ ప్రజల ఆహార వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నూడుల్స్ వంటివి కూడా భక్తులకు ఆహారంగా అందజేస్తున్నారు. ఇందుకు కలకత్తాలోని చైనీస్ టౌన్ ప్రాంతంలో ఉన్న కళీమాత దేవాలయం ఉదాహరణ. ఇదే కోవకు తమిళనాడు రాజధాని చెన్నైలోని దుర్గామాత దేవాలయం కూడా చేరుతుంది. ఇక్కడ భక్తులకు బర్గర్, బ్రౌని, స్యాండ్ విచ్ ను ప్రసాదంగా అందజేస్తారు.

3. దూర ప్రాంతాల నుంచి కూడా...

3. దూర ప్రాంతాల నుంచి కూడా...

Image Source:

భక్తులకు ఇక్కడ ఇచ్చే ప్రసాదం గురించి విని దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు ఎంతో మంది వస్తున్నారని స్థానికులు చెబుతారు. ఈ దేవాలయం నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన స్థానిక డాక్టర్ అయిన శ్రీధర్ మాట్లాడుతూ ‘దేవుడికి నైవేద్యంగా అందజేసిన ఏ పదార్థానైనా భక్తులకు ప్రసాదంగా అందజేయవచ్చు. అయితే ఆ నైవేద్యం ఎంత భక్తి, శ్రద్ధలతో తయారు చేశామన్నదే ముఖ్యం.'అని వివరించారు.

4. చాలా జాగ్రత్తలు

4. చాలా జాగ్రత్తలు

Image Source:

సాధారణంగా బర్గర్, పిజ్జా, బ్రౌనీ, సాండ్ విచ్, కేక్ లు తయారు చేసిన తర్వాత 24 గంటల లోపు తినాలి. లేదంటే అవి చెడిపోతాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రసాదంగా అందజేసే పిజ్జా, బ్రౌనీల పాకెట్ల పై వాటి తయారీ తేదిని తప్పక ముద్రిస్తారు. ఇక ఈ బర్గర్, బ్రౌనీలను వెండింగ్ మిషన్ లో ఉంచుతారు. మనకు ఒక కాయిన్ ఇస్తారు. దానిని ఆ వెండింగ్ విషన్ లో వేయడం వల్ల కావాల్సిన ప్రసాదం మనకు అందుతుంది. శుచిగా, శుబ్రంగా ప్రసాదాన్ని పంపిణీ చేయడం కోసమే ఈ జాగ్రత్తలు తీసుకొన్నామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

5. ఎక్కడ ఉంది.

5. ఎక్కడ ఉంది.

Image Source:

చెన్నై విమానాశ్రయానికి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో పడప్పయ్ ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఈ దేవాలయానికి 44 కిలోమీటర్ల దూరంలో ఈ బర్గర్ దేవాలయం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X