Search
  • Follow NativePlanet
Share
» »జులక్ పర్యాటకం ఎంతో ఆనందదాయకం?

జులక్ పర్యాటకం ఎంతో ఆనందదాయకం?

జులక్‌ను చేరుకోవడానికి అనువైన సమయం, మార్గం తదితర వివరాలు.

భారత దేశంలో పర్యాటక ప్రాధాన్యత కలిగిన రాష్ట్రాల్లో సిక్కిం కూడా ఒకటి. ముఖ్యంగా ప్రకతితో మమేకం కావాలనుకొనేవారికి, పర్వతాల సౌదర్యాన్ని ఇష్టపడేవారికి ఈ రాష్ట్రం స్వర్గంతో సమానం. గ్యాంగ్ట్‌టక్, గురుడోంగ్మార్, తదితర ప్రాంతాలు ప్రకతి సౌదర్యానికి నిదర్శనాలు. ఇటువంటి కోసకు చెందినదే జులుక్. ఈ ప్రాంతానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

జులక్, సిక్కిం

జులక్, సిక్కిం

P.C: You Tube

తూర్పు హిమాలయాల పర్వతశ్రేణిలో భాగమైన జులక్ చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. దీంతో ఇక్కడికి వెళ్లడానికి ప్రత్యేక అనుమతిని గ్యాంగ్‌టక్ లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మీ ఫొటో ఐడీ కార్డును అదజేయాల్సి ఉంటుంది.

జులక్, సిక్కిం

జులక్, సిక్కిం

P.C: You Tube

ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీలు చాలా ఉంటాయి. వారి ద్వారా సులభంగా ఈ ప్రత్యేక అనుమతి లభిస్తుంది. మనం సొంతంగా ప్రయత్నించడం కొంచెం కష్టంతో కూడుకొన్నాది. వారు అనుమతి ఇప్పించడమే కాకుండా అవసరమైన చోటుకు తీసుకొని వెలుతారు.

జులక్, సిక్కిం

జులక్, సిక్కిం

P.C: You Tube

సిల్క్ రూట్, కాంచన్‌జంగా అందాలను మీరు వీక్షించాలంటే జులక్ అత్యుత్తమ స్థలం. ఇది ఒక చిన్న గుట్ట పై ఉంటుంది. ఈ గుట్ట అంచు నుంచి చూస్తే మీకు అంతే కానబడని ఒక మార్గం మీకు సాక్షాత్కారమవుతుంది.

జులక్, సిక్కిం

జులక్, సిక్కిం

P.C: You Tube

గతంలో జులక్ టిబెట్, భారతదేశం మధ్య వ్యాపార కేంద్రబిందువు. సరుకు రవాణా కోసం ఈ మార్గాన్నే ఎక్కువగా వినియోగించేవారు. అందువల్ల అప్పట్లో ఈ మార్గం ఎక్కువ వాణిజ్య ప్రాధాన్యతను సంతరించుకొంది.

జులక్, సిక్కిం

జులక్, సిక్కిం

P.C: You Tube

ఈ ప్రాంతం చైనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పర్యటించడానికి ముందస్తు అనుమతి అవసరం అవుతుంది. మరికొన్ని ప్రాంతాలకు అసలు ప్రవేశం మాత్రం ఉండదు.

జులక్, సిక్కిం

జులక్, సిక్కిం

P.C: You Tube

సముద్రమట్టానికి దాదాపు 10,100 అడుగుల ఎత్తులో ఈ జులక్ ఉంటుంది. పర్యాటకంగా ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత సంతరించుకొంటోంది. ఇక్కడి నుంచి నాథులా పాస్, ట్సోమాగో సరోవరం తదితర ప్రాంతాలెన్నింటినో చూడొచ్చు.

జులక్, సిక్కిం

జులక్, సిక్కిం

P.C: You Tube

జులక్ గ్యాంగ్‌టక్ నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్యాంగ్‌టక్ నుంచి ఇక్కడి వెళ్లాలంటే కొంత కఠినమైన మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే మార్గమధ్యలోని జలపాతాలను చూస్తూ మీరు ప్రయాణ బడలికను మరిచిపోతారు.

జులక్, సిక్కిం

జులక్, సిక్కిం

P.C: You Tube

సాధారణంగా ఈ జులక్ ను చూడటానికి నవంబర్ నుంచి జనవరి మధ్యలో వెళ్లవచ్చు. అప్పుడు ఇక్కడ ప్రక`తి రమణీయత చాలా బాగుంటుంది. అందుకే భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు ఈ సమయంలో వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X