Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్ – భక్తి, పుణ్య క్షేత్రాల జన్మస్థలం!

అంతులేని పర్యాటక అభిరుచుల భూమి ఉత్తర ప్రదేశ్, పర్యాటకరంగం దాని అద్భుతాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. తాజ్ ఉన్న భూమి, కథక్ జన్మస్థానం, వారణాసి ఉన్న పవిత్ర హిందూ భూమి, కృష్ణుని జన్మస్థానం, బుద్ధుడు తన మొదటి ప్రవచనం పలికిన భూమి, వీటన్నిటి నివాసం ఉత్తరప్రదేశ్. ఉత్తర ప్రదేశ్ కు ఉత్తరాన ఉత్తరాఖండ్, హిమాచల్ తో బాటుగా నేపాల్, దక్షిణాన మధ్యప్రదేశ్, తూర్పున బీహార్, పశ్చిమాన హర్యానా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లో ప్రాధాన్యత ఉన్న తీర్థయాత్రా కేంద్రాలు ఉత్తరప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రధాన ధార్మిక పర్యాటక కేంద్రం.చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్ర ప్రాంతాలలో కొన్నింటిని కల్గి ఉన్నందున తీర్థయాత్రికులకు ఉత్తరప్రదేశ్ ఎంతో మనోహరమైన పర్యాటక ప్రాంతమైంది. ఒక ముక్తి స్థల౦ లేదా మోక్షం పొందే ప్రదేశాలలో ఒకటి వారణాశి, హిందువులలో ఒక ప్రాధాన్యత పొందిన ప్రాంతం. ప్రముఖ పర్యాటక స్థానంగా ప్రపంచవ్యాప్త ఆకర్షణను పొందింది. ఉత్తరప్రదేశ్ ఒక పవిత్ర భూమే కాక వైష్ణవులకు ఒక ముఖ్య ప్రాంతం. కృష్ణుని, రాముని జన్మస్థానాలు మథుర, అయోధ్య ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి.

కృష్ణునికి సంబంధించిన ఇతర ప్రదేశాలు బృందావనం, గోవర్ధన ఏడాది పొడవునా తీర్థయాత్రికుల పర్యటనకు, పండగ ఆనందాలకు సంభావత ప్రదేశాలుగా ఉన్నాయి. రాముని కుమారులు లవ, కుశులు జన్మించిన భూమి బితూర్. అదృష్టాలు పొదిగిన సాహిత్యంతో వారి భక్తిని చాటిన గొప్ప సన్యాసులు కబీర్, తులసీదాస్, సూరదాస్ ఉన్న సహజమైన ప్రదేశం ఇది అనటానికి ఎటువంటి సందేహం లేదు.అలహాబాద్ అతి పురాతనమైన నగరాలలో ఒకటి. మూడు ప్రధాన నదులు గంగ, యమున, సరస్వతి సంగమించిన ప్రదేశం.

కుంభమేళా జరిగే ప్రసిద్ధ ప్రాంతంగా ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక, ధార్మిక పర్యాటకులు, ఫోటో ప్రియులను ఆకర్షిస్తుంది.బౌద్ధులకు ఇది ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రదేశం ఎందుకంటే బుద్ధుడు తన మొదటి ప్రవచనాలు పలికింది సారనాథ్ లోనే. అశోకుని స్థూపం ఉండటమే కాక ఎన్నో ప్రవచనాలు బోధించిన ప్రదేశం కౌశంబి, కొంత చక్కటి సమయం గడిపిన ప్రదేశం శ్రవస్తి, అతని భౌతిక దేహాన్ని పరిత్యజించిన కుషినగరం ఇక్కడ ఉన్నాయి.ప్రభాస్ గిరి హిందువులకు, జైనులకు ఇద్దరికీ కూడా సమానంగా ముఖ్యమైంది.

పురాణాలలో ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతాల ప్రస్తావన పుష్కలంగా ఉండటమే కాక భారతదేశంలోని రెండు గొప్ప ఇతిహాసాలు రామాయణ, మహాభారతాలు చిగురించిన ప్రదేశాలుగా బాధ్యత వహించాయి. చారిత్రిక చిత్రణ మనోహరమైన చారిత్రిక కట్టడాల వైభవంతో ఉత్తరప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆకర్షణీయమైన ప్రపంచ అద్భుతం తాజ్ ఉన్న ప్రాంతం ఆగ్రా, ఝాన్సీ, లక్నో, మీరట్, అక్బర్ నిర్మించిన ఫతేపూర్ సిక్రీ, ప్రతాప్ గడ్, బారాబంకి, జౌన్ పూర్, మహోబా, ఒక చిన్న వ్యావసాయిక గ్రామం కూడా అయిన దియోగడ్ మొదలైనవి చరిత్ర, సంస్కృతుల కథలను తెలిపే ఉత్తర ప్రదేశ్ లోని ప్రాంతాలు.

ఉత్తర ప్రదేశ్ లోని అలీగడ్ విశ్వవిద్యాలయం ఉన్న అలీగడ్ అభ్యసనకు ఒక ముఖ్య ప్రాంతం, వారణాసి, లక్నో, మీరట్, ఝాన్సీ, ఘజియాబాద్, కాన్పూర్, గోరఖ్ పూర్, నోయిడా మొదలైనవి ఉత్తర ప్రదేశ్ లో పర్యాటక పరంగా కొన్ని ముఖ్య ప్రాంతాలు.ఉత్తర ప్రదేశ్ లో వన్యప్రాణులు, అరణ్యాలు రాయ్ బరేలిలోని సమస్ పూర్ పక్షి సంరక్షణ కేంద్రం, చంబల్ వన్యప్రాణి అభయారణ్యం, దుధ్వ జాతీయ పార్కు వంటివి వన్యప్రాణి ఔత్సాహికుల కోసం కొన్ని ప్రాంతాలు, ఉత్తర ప్రదేశ్ పర్యాటక రంగంలో అంతర్భాగమయ్యాయి.

ఉత్తర ప్రదేశ్ లోని సంస్కృతి, వంటకాలు, ఆచారాలు భారతదేశంలోని ప్రసిద్ధ నృత్య రూపాలలో ఒకటి కథక్ ఉత్తర ప్రదేశ్ లోనే పుట్టింది. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలాగే ఉత్తర ప్రదేశ్ స్వంత సంస్కృతులు, స్థానిక సంస్కృతుల గురించి పాటలు, నృత్యాల రూప౦లో గ్రామాలలో వ్యక్తీకరణ జరుగుతుంది.చేతి ముద్రణ, కార్పెట్ తయారీ, లోహపు పూత, బంగారు జలతారు పని, ఇత్తడి, నల్లచేవమాను పని తదితర ఎన్నో రకాలైన, పేరొందిన చేతి వృత్తులకు కూడా ఉత్తర ప్రదేశ్ ప్రసిద్ధి చెందింది.ఒక ప్రత్యేక తరహా ఎంబ్రాయిడరి లక్నొవీ చికన్ ప్రపంచవ్యాప్త ప్రశంసలు చూరగొంది.

రాష్ట్రంలోని అనేక కట్టడాలలోనే కాక వంటకాలలో కూడా ఉత్తర ప్రదేశ్ సంస్కృతిలో హిందూ, మొఘలు సంస్కృతుల మేళవింపు ప్రతిబింబిస్తుంది. అవధి వంటకాలు, కబాబులు, దమ్ బిర్యాని, ఇతర మాంసాహార వంటలు వంటి కొన్ని వంటకాలు పర్యాటకుని జీహ్వకు విందును కల్గిస్తాయి.నోరూరించే అల్పాహారాలైన చాట్ లు, సమోసాలు, పకోడాలు వంటి దేశవ్యాప్తంగా విస్తృత౦గా అభిమానులను సాధించిన వంటకాలు ఉత్తర ప్రదేశ్ లో పుట్టినవే.ఉత్తర ప్రదేశ్ ను అన్వేషించేందుకు ఆసక్తి ఉన్న పర్యాటకుడిని ఆపేందుకు ఏమి లేదు. ఇది ఎంతో అందిస్తుంది, ఎంతో ప్రతిబింబిస్తుంది.

ఉత్తర ప్రదేశ్ ప్రదేశములు

  • కాన్పూర్ 31
  • హస్తినాపూర్ 21
  • చంబల్ అభయారణ్యం !! 14
  • రాయ్ బరేలి 12
  • పిలిభిత్ 34
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat