Search
  • Follow NativePlanet
Share

వడోదర - రాచరికపు ప్రదేశం

48

విశ్వామిత్ర నది ఒడ్డున ఉన్న వడోదర లేదా బరోడా, ఒకప్పుడు గైక్వాడ్ రాష్ట్ర రాజధాని నగరం. విశ్వామిత్ర నది పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు వేల సంవత్సరాల నాటి పురావస్తు అవశేషాల ప్రకారం, అకోలా చెట్లు తోపు సమీపంలో ఇపుడు ఆకోట గా పిలవబడుతున్న అంకోట్టక అనే ఆవాసం ఉండేది. ఇక్కడికి తూర్పు దిశగా ఒక కిలోమీటరు దూరంలో వద్ లేదా రాగి చెట్ల దట్టమైన అడవి వద్ద వదపద్రక అనే మరో స్థావరం ఏర్పడింది. వదపద్రక స్థానంలోనే , నేటి వడోదర వచ్చింది. వడోదర పదం 'వటోదర్' నుండి వచ్చింది. ఈ సంస్కృత పదానికి 'మర్రి చెట్టు కడుపు' అని అర్థం. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో, ఈ పేరు బరోడా గా మారి, ఈ మధ్య తిరిగి అసలు పేరు పెట్టేవరకు అలానే పిలవబడింది.

చరిత్ర

నగర సరిహద్దులు ఒకప్పుడు నాలుగు ప్రవేశద్వారాల ద్వారా గుర్తించబడేవి. ఈ ద్వారాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. 10 వ శతాబ్దంలో వడోదర చాళుక్య రాజవంశం పరిపాలనలోనూ, తర్వాత, వరుసగా సోలంకీలు, వాఘేలాలు మరియు ఢిల్లీ, గుజరాత్ సుల్తానుల పాలనలోనూ ఉంది. మరాఠా సేనాని పిలాజీ గైక్వాడ్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, వడోదర చరిత్ర ఆధునిక యుగం ప్రారంభించాడు. అతనికి ముందు బాబి నవాబులు కూడా వడోదర యొక్క అభివృద్ధికి తోడ్పడ్డారు. అమలు కాబడిన సమయానికి చాలా ప్రగతిశీలమైనవిగా చెప్పుకోదగ్గ సామాజిక ఆర్థిక సంస్కరణలకు మరెన్నో ముఖ్యమైన పరిణామాలకి కారణమైన మహారాజా శాయాజిరావ్ III పాలన, వడోదరా యొక్క స్వర్ణ యుగంగా భావించబడుతుంది. సంస్కృతికి అతను అందించిన అపూర్వమైన ప్రాపకం వల్లే వడోదర నగరం “సంస్కారి నగరి” లేదా “సంస్కృతి నగరం” గా పిలువబడుతుంది.

సంస్కృతి

గుజరాత్ మొత్తంలోకి వడోదర గార్బా వేడుకలకి చాలా ప్రసిద్ధి చెందింది. నవరాత్రి లేదా గార్బా, పాటలు, నృత్యాలు, దీపాలతో స్థానిక గార్బా మైదానాలలో గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ సమయంలో రాసా మరియు గార్బా నృత్యాలు తరచు అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతాయి. దీపావళి, ఉత్తరాయణ, హోలీ, ఈద్, గుడి పాడ్వా మరియు వినాయక చవితి పండుగలు వడోదర లో గొప్ప ఉత్తేజంతో జరుపుకునే కొన్ని పండగలు.

'సంస్కారి నగరి' అనే తన పేరుకి తగ్గట్టు వడోదరలో, సంస్కృతి, పరిఢవిల్లుతుంది. వడోదర సంగ్రహాలయం మరియు మహారాజా ఫతే సింగ్ సంగ్రహాలయం వద్ద ఉన్న విస్తారమైన సేకరణ, పాత కీర్తి మందిర్, మహారాజా షియాజి విశ్వవిద్యాలయం మరియు చిత్ర ప్రదర్శనశాల లోని నంద్ లాల్ బోస్ భగవద్గీత కుడ్యచిత్రాలు, గైక్వాడ్ల ప్రాపకం వలన అభివృద్ధి చెందిన ఇక్కడి సంపన్న సంస్కృతి యొక్క ఉదాహరణలుగా నిలిచి ఉన్నాయి.

భౌగోళిక అంశాలు

విశ్వామిత్ర నది ఒడ్డున ఉన్న వడోదర నగరం గుజరాత్ రాష్ట్ర కేంద్ర భాగంలో ఉంది. వేసవిలో సాధారణంగా నది ఎండిపోయి, కేవలం చిన్న నీటి కాలువ మాత్రమే మిగులుతుంది. నగరం మహి & నర్మదా నదుల మధ్య మైదానాలలో ఉంది. భూకంపాల బారినపడే అవకాశం ఎక్కువ ఉన్న కారణంగా, భారతీయ ప్రమాణాల శాఖ, ఈ పట్టణాన్ని 1 నుండి V కొలమానం మీద భూకంప క్షేత్రం-III గా వర్గీకరించింది.

విశ్వామిత్ర నది వడోదరను భౌగోళికంగా రెండు భాగాలగా విభజిస్తుంది. తూర్పు ప్రాంతం. పశ్చిమ ప్రాంతం. నది తూర్పు ఒడ్డున వడోదర పాత నగరం ఉంది. విశ్వామిత్ర నది పశ్చిమ భాగాన, వడోదర కొత్త నగరం ఉంది. ఈ ప్రాంతం ఆధునిక సదుపాయాలతో ప్రణాళికాబద్ధమైనదిగా ఉంటుంది.

వదోదర ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వదోదర వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వదోదర

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వదోదర

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం లో వదోదర ఢిల్లీ, గాంధీనగర్ మరియు ముంబై లకు జాతీయ రహదారి 8 ద్వారా కలుపబడి వుంది. ప్రభుత్వ బస్సు లు ప్రైవేటు బస్సు లు వివిధ ప్రదేశాలకు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    వడదొర ప్రధాన రైలు స్టేషన్ ఇక్కడనుండి న్యూ ఢిల్లీ, ముంబై, మధుర, కోట, వంటి ప్రదేశాలకు ఎక్స్ ప్రెస్ రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వదోదర ఎయిర్ పోర్ట్ హార్ని గ్రామ సమీపంలో వుంటుంది. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్, ఇండిగో సర్వీస్ లు దేశం లోని ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed