Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» వారణాసి

వారణాసి - హిందూ మత నగరాల్లో పవిత్రమైనది!

60

వారణాసిని కాశీ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో అతి పురాతనమైన మరియు నిరంతరం నివసించే నగరాలలో ఒకటి. శివుడు సృష్టి మరియు విధ్వంసం చేసే హిందూ మతం దేవుని నగరం అని కూడా పిలుస్తారు. ఇది అన్ని హిందూ మత నగరాల్లో పవిత్రమైనది. ఇక్కడ మరణము సంభవించుట లేదా దహనం చేయుట వల్ల మోక్షం వస్తుందని భావిస్తారు. వ్యక్తి జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. అందువల్ల దీనిని ముక్తి స్థల (విముక్తి ప్లేస్) అని అంటారు.నిజానికి గంగా నదిలో స్నానము ఆచరిస్తే అన్ని పాపముల నుండి విముక్తి కలుగుతుందని చెబుతారు. అనేక మంది సందర్శకులు యాత్రికులు సూర్యోదయం సమయంలో ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. అంతే కాకుండా సూర్యాస్తమయం మంత్రముగ్దులను చేసే అనుభవానికి అందిస్తుంది. ప్రతి సాయంత్రం హారతి (ప్రార్థనలు) వారణాసి యొక్క ప్రధాన ఘాట్ లో నిర్వహిస్తారు.

ఈ మర్మమైన నగరం యొక్క అత్యంత ఆకర్షణీయ అంశంగా చనిపోయిన వారి శరీరాలు దహనం, స్నానం ,హారతి వరకు ప్రతిదానికీ (ప్రార్థనలు) ఉపయోగించటానికి అనేక ఘాట్స్ ఉన్నాయి. అక్కడ ధర్మాలు, ఆచారాలు మరియు మతపరమైన వేడుకలు జరుగుతాయి. అంతే కాకుండా నది ఒడ్డున యోగా, మసాజ్ మరియు క్రికెట్ ఆటలు వంటివి కనపడతాయి.

వారణాసి మరియు చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలువారణాసి మీకు దైవిక భావనను అందిస్తోంది. నగరం యొక్క అత్యంత ఆసక్తికరమైన అంశం అనేక ఘాట్స్ (గంగా నది యొక్క జలాల దారితీసే మెట్లపై) ఉండటమే. దశాశ్వమేధ ఘాట్,దర్భాంగా ఘాట్, హనుమాన్ ఘాట్ మరియు మన్ మందిర్ ఘాట్ లలో ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం హరతులను నిర్వహిస్తారు. ప్రపంచంలో బహుశా వారణాసి ని మాత్రమే 'డెత్ టూరిజం' అని పిలుస్తారు. గంగానదిలో ఉన్న మణికర్ణిక ఘాట్ లో ముందుగా మృతదేహాలను పూర్తి దృష్టిలో దహనం మరియు అస్థికలు నిమజ్జనం చేస్తారు. అస్సీ ఘాట్ లో హోటళ్ళు మరియు రెస్టారెంట్ లు అత్యధికంగా కలిగి ఉన్నాయి. తరువాత తుల్సి ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, శివాల ఘాట్ మరియు అత్యంత చాయాచిత్రాల కొరకు కేదర్ ఘాట్ సహా ఇతర ఘాట్స్ ఉన్నాయి.

వారణాసి కాశీ విశ్వనాధ్ ఆలయం, న్యూ విశ్వనాథ్ ఆలయంతో సహా శివునికి అంకితం చేసిన దేవాలయాలు పుష్కలంగా ఉండుట వలన శివుని నివాసంగా చెబుతారు. ఇతర దేవాలయాలు తుల్సి మానస్ ఆలయం మరియు దుర్గ ఆలయం ఉన్నాయి. జైనులు జైన దేవాలయం లో ఉపశమనం పొందుతారు. ముస్లింలు ఆలంగీర్ మసీదు లో ప్రాతినిధ్యం కనుగొంటారు.

మతపరమైన ప్రదేశాలు కాకుండా వారణాసిలో నది అవతలి వైపు రామ్ నగర్ ఫోర్ట్, జంతర్ మంతర్, ఒక ప్రయోగశాల ఉన్నాయి. నగరం కూడా ఒక శాంతియుత ప్రాంగణంలో విస్తరించివుంది. కాశీ లేదా వారణాసి హిందూ మత విశ్వవిద్యాలయం ఉంది. ఈ విశ్వవిద్యాలయంను ఒకప్పుడు ఈస్ట్ ఆక్స్ ఫర్డ్ అని పిలిచేవారు. నగరంలో సాంప్రదాయ నృత్యం, సంగీతం మరియు యోగా కోసం ఒక ప్రసిద్ధ కేంద్రంగా కూడా ఉన్నది.

వారణాసి ఎలా చేరాలి?

వారణాసి ని విమాన,రైలు,రోడ్డు మార్గాల ద్వారా చేరవచ్చు. సొంత అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది.

వారణాసి సందర్శించడానికి ఉత్తమ సమయం

వారణాసి సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ మరియు మార్చి మధ్య ఉంది.

 

 

వారణాసి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వారణాసి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వారణాసి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వారణాసి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం బస్సుల ద్వారా లక్నో (5hrs), కాన్పూర్ (5hrs) మరియు అలహాబాద్ (2hrs) వంటి నగరాలు నుండి వారణాసిని చేరుకోవచ్చు. బస్సులు సాధారణంగా నెమ్మదిగా మరియు అసౌకర్యంగా ఉండుట వలన మీరు రైలు లేదా విమాన మార్గాల ద్వారా వస్తే ప్రయాణం సులువుగా సాగుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం వారణాసి లో వారణాసి జంక్షన్ మరియు మొఘల్ సారాయ్ జంక్షన్ అనే రెండు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇవి నగరంనకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఢిల్లీ, ఆగ్రా, లక్నో, ముంబై మరియు కోలకతా వంటి నగరాలు నుండి వారణాసికి ప్రతి రోజు అనేక సర్వీసెస్ ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం వారణాసి కి సొంత అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అదే విధంగా ఢిల్లీ, లక్నో, ముంబై, ఖజురహో మరియు కోలకతా వంటి భారతీయ నగరాలతో ప్రత్యక్ష విమానాలు ద్వారా అనుసంధానించబడింది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun