Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వేదంతంగల్ » వాతావరణం

వేదంతంగల్ వాతావరణం

అనుకూలమైన కాలంఈ ప్రాంతాన్ని దర్శించటానికి వానాకాలం తరువాత (నవంబర్) మరియు వేసవికి ముందు (మార్చ్) అనుకూలంగా ఉంటాయి. వలస పక్షులు అనేకం శీతాకాలంలో ఎక్కువగా కనపడతాయి, అందువలన శీతాకాలం సరిఅయిన సమయం. పక్షులను సంవత్సరంలో ఎప్పుడయినా చూడవొచ్చు, భారి వానలు, ఎక్కువ వేడి సమయాలు తప్ప మిగిలిన సమయాలలో పక్షులు ఇక్కడ కనపడుతూనే వుంటాయి.

వేసవి

వేసవికాలం: తమిళనాడు మిగతా ప్రాంతాలలాగానే వేదంతంగల్ కూడా వేడి వాతావరణంతో ఉంటుంది. ఈ సమయంలో చాలా తీవ్రమైన వేడి మరియు హ్యుమిడిటి ఉంటుంది. మే నెల ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, అలానే ఎండాకాలపు వేడి జూన్ మరియు జూలై నెలలలో కూడా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెల్సియస్ ఉండటం వలన ఆకాశంలో పక్షులు కూడా కనిపించవు.

వర్షాకాలం

వానాకాలం: వేదంతంగల్ ఆగష్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలలోగణనీయమైన వర్షపాతం నమోదు అవుతుంది. ఇక్కడ వర్షపు జల్లులు సాధారణంగా అధికంగా ఉంటాయి, అందువలన ఈ సమయంలో దీనిని సందర్శించటానికి వాతావరణం అనుకూలంగా ఉండదు. ఈ కాలంలో దీనిని దర్శించాలి అనుకునేవారు తప్పనిసరిగా గొడుగులు మరియు రైన్ కోట్లు తీసుకెళ్ళాలి.

చలికాలం

శీతాకాలం: ఇక్కడ శీతాకాలం నవంబర్ నెలలో మొదలై, ఫిబ్రవరి నెల చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉండి, పక్షులను వీక్షించటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 16 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది మరియు ప్రయాణికులు తేలికపాటి ఉన్ని దుస్తులను తీసుకెళ్లటం మంచిది.