Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వేలన్ కన్ని » వాతావరణం

వేలన్ కన్ని వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం వేలన్ కన్ని సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలం. అక్టోబర్ నుండి మార్చ్ వరకూ చర్చి లో అనేక వేడుకలు జరుగుతాయి. ఈ సమయంలో వాతావరణం కూడా బాగుంటుంది. కనుక సందర్శనకు ఈ సమయం అనుకూలమైనది.

వేసవి

వేసవి వేసవి లో ఈ ప్రాంత ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుండి 38 డిగ్రీల వరకూ మారుతూంటాయి. సముద్రం పై నుండి వచ్చే గాలులతో సాయంకాలాలు ఆహ్లాదంగానే వుంటుంది. అధిక ఉష్ణోగ్రతలు వుండే వేసవి లో అంటే ఏప్రిల్ మరియు మే నెలలలో సందర్శన తగదని టూరిస్టులకు చెప్పవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో ఒక మోస్తరు వర్షాలు పడతాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు గల వర్షాకాలంలో ఈ ప్రాంత అందాలు మరింత పెరుగుతాయి. బీచ్ కూడా అక్కడ అక్కడ జనాలు కలిగి వుంటుంది. అయితే, చర్చి కి మాత్రం యాత్రికులు వస్తూనే వుంటారు.

చలికాలం

శీతాకాలం శీతాకాలం లో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టం 21 డిగ్రీలు గరిష్టం 30 డిగ్రీలు గా మారుతూంటాయి. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ చలికాలం వుంటుంది. క్రిస్టమస్ సమయంలో వేలన్ కన్ని కి అధిక సంఖ్య లో భక్తులు వస్తారు. వేడుకలు ఘనంగా జరుగుతాయి.