Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వెల్లూర్ » వాతావరణం

వెల్లూర్ వాతావరణం

ఉత్తమ కాలందీనిని దర్శించటానికి అక్టోబర్ నుండి మార్చ్ నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇది ఉష్ణమండల ప్రాంతం కాబట్టి, దీనిని వేసవి నెలలు, ఏప్రిల్ నుండి జూన్ వరకు దీనిని దర్శించటం అనుకూలంగా ఉండదు. శీతాకాలంలో చల్లగా ఉండి, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కావున శీతాకాలం మంచి సమయం.

వేసవి

వేసవికాలం వెల్లూర్ ఉష్ణోగ్రత చాలా పొడి వాతావరణంతో వేసవిలో అధికవేడిని కలిగి ఉంటుంది. వేసవి సమయంలో, అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ మరియు సగటు గరిష్ట ఉష్ణోగ్రత 38.5 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గాలిలో తేమ 40% నుండి 63% మధ్య రికార్డ్ అవుతుంది, అందువలన ఈ సమయంలో దీనిని సందర్శించటం మంచిది కాదు.

వర్షాకాలం

వానాకాలం ఇక్కడ తేలికపాటి నుండి మధ్యస్థ వర్షపాతం ఈ సమయంలో ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల మూలంగా 996,7 మిల్లీమీటర్ల సగటు వార్షిక వర్షపాతం నమోదు అవుతుంది. వెల్లూర్, అక్టోబర్ మరియు నవంబర్ నెలలలో ఈశాన్య ఋతుపవనాల మూలంగా వర్షాలు కురుస్తాయి. అయితే, ఈ ప్రాంతంలో నైరుతి రుతుపవనాల వలన కూడా వర్షాలు కురుస్తాయి.

చలికాలం

శీతాకాలం వెల్లూర్ లో శీతాకాలం చల్లగా ఉంటుంది. ఇక్కడి అత్యల్ప ఉష్ణోగ్రత 10 డిగ్రీ సెల్సియస్. ఈ సమయంలో గాలిలో తేమ 67% నుండి 86% ఉంటుంది. ఇక్కడ చలిగా ఉన్నప్పటికీ చాలామంది పర్యాటకులుగడిచిన వారసత్వం మరియు గొప్ప సంస్కృతి అనుభవించడానికి డిసెంబర్ మరియు జనవరి నెలల్లో లో వస్తారు.