వేణూర్ వాతావరణంవేణూర్ గ్రామ సందర్శనకు శీతాకాలం అనువైన సమయం. వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
వేసవి (మార్చి నుండి మే) - వేణూర్ లో వేసవి అధిక వేడి, తేమ అధికం. అసౌకర్యం. ఈ సీజన్ లో 75 శాతం తేమ ఉంటుంది. ఉష్ణోగ్రత గరిష్టం 38 డిగ్రీలు కనిష్టం 34 డిగ్రీలు ఉంటుంది. పర్యటనకు అనుకూలం కాదు.
వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - వేణూర్ లో నైరుతి రుతుపవనాల కారణంగా అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పటికి అధిక వర్షాల కారణంగా బయటి కార్యకలాపాలు అసౌకర్యంగా ఉంటాయి.
శీతాకాలం (డిసెంబర్ నుండి జనవరి) - ఈ కాలంలో వేణూర్ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుండి 32 డిగ్రీల వరకు ఉంటాయి. శీతాకాలంలో కూడా కొద్దిపాటి జల్లులు పడతాయి. మరింత ఆహ్లాదంగా ఉంటుంది.