Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» విజయవాడ

విజయవాడ - ల్యాండ్ అఫ్ మెంగోస్ అండ్ స్వీట్స్

35

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రములోని కృష్ణ జిల్లాలో విజయవాడ ఉన్నది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మూడవ నగరం. విజయవాడ నగరం ఒక అత్యద్భుతమైన అందాన్ని ఇస్తుంది, మరియు దానికి మూడు వైపులా నీటి వనరులు మరియు నాలుగో వైపు ఒక పర్వతం ఉన్నాయి. నగరంకు ఉత్తరాన బుడమేరు నది, దక్షిణ వైపు కృష్ణా నది, తూర్పు వైపున బంగాళాఖాతం, పడమర వైపున ఇంద్రకీలాద్రి పర్వతం ఉంది. నగరం పడమర వైపు పొలిమేరలలో పచ్చని తాజాదనం తో కూడిన కొండపల్లి రిజర్వు అడవులు ఉన్నాయి. విజయవాడ అంటే 'విజయ భూమి' అని అర్దము. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. విజయవాడ నగరం దేశం లో ప్రధాన పర్యాటక కేంద్రాలలో ఒకటి. రుచికరమైన వివిధ రకాల  మామిడి పండ్లు, తియ్యని మిఠాయిలు మరియు అనేక అందమైన పర్యాటక ప్రదేశాలకు  ప్రసిద్ధి చెందింది. నేడు విజయవాడ దేశంలోనే ఒక ముఖ్య వ్యాపార కేంద్రం మరియు   రాష్ట్ర ప్రముఖ  వాణిజ్య ప్రదేశంగా ఉంది. ఇక్కడ ఉన్న అనేక కార్పొరేటు విద్యాసంస్థల వలన దీనికి విద్యలవాడ అనే పేరు కూడా వచ్చింది. ప్రపంచంలో నే విజయవాడ నగరం వేగవంతంగా అభివృద్ధి చెందినది అని మెకిన్సీ క్వాటర్లీ చే భవిష్యత్ 'గ్లోబల్ సిటీ'  అని గుర్తింపును పొందింది.

విజయవాడ నగరం అభివృద్ధి మరియు పతనం అనేక రాజవంశాలు ఒరిస్సా గజపతుల  నుండి 19 వ శతాబ్దం లో తూర్పు చాళుక్యులు మరియు విజయనగర సామ్రాజ్య రాజు కృష్ణ దేవరాయ వరకు కనిపించింది. విజయవాడ యొక్క పేరు అనేక పురాణములలో వివరించబడింది. ఇంద్రకీలాద్రి పర్వతమున మహాభారతంలో గొప్ప యోధుడు అయిన అర్జునుడుకి శివుని యొక్క ఆశీస్సులు అందాయని ఒక కధనము. మరొక కధ ప్రకారం మహిషి అనే రాక్షిసి ని చంపాక దుర్గాదేవి ఈ ప్రాంతం లో విశ్రాంతి తీసుకోవటం వల్ల నగరానికి ఆ పేరు వచ్చింది. విజయవాడను పూర్వము బెజవాడ అని పెలిచేవారు. దానికి ఒక కధ ఉన్నది. బంగాళాఖాతంలో విలీనం తర్వాత , కృష్ణానది దేవత అభ్యర్థన మేరకు అర్జున్ పర్వతాలు గుండా రంధ్రం లేదా బెజ్జం నిర్మించారు. అందువల్ల నగరంనకు బెజ్జం వాడ అని పేరు వచ్చింది. కాలానుగునంగా అది బెజావాడ గా మారింది. బ్రిటిష్ వారు కూడా వేడి వాతావరణం కారణంగా, నగరంను బ్లేజ్ వాడ అని పిలిచేవారు.

విజయవాడలో ముఖ్య ప్రదేశాలు

విజయవాడ నగరంలో పర్యాటకులు సందర్శించటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ కనక దుర్గ గుడి ప్రసిద్ది చెందినది. మంగళగిరి దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన వైష్ణవ ఆలయాలలో ఒకటి. అమరావతిలో అమరేశ్వరాలయం ఉన్నది. గుణదల మాతా పుణ్యక్షేత్రం లేదా సెయింట్ మేరీస్ చర్చి, మొగలరాజపురం గుహలు, ఉండవల్లి గుహలు, మహాత్మా గాంధీ హిల్, కొండపల్లి కోట, భవానీ ద్వీపం మరియు రాజీవ్ మహాత్మా గాంధీ పార్క్ లో ఉన్న మహాత్మా గాంధీ స్థూపం సందర్శించిన ప్రదేశాలు. కృష్ణ నది పై నున్న ప్రకాశం బారేజ్ సందర్శించడానికి చాలా బాగుంటుంది. నగరాన్ని సందర్శించటం ఒక మధురానుభూతి.

విజయవాడ వద్ద విమానాశ్రయం గన్నవరం వద్ద, నగరం నుండి సుమారు 20 కి.మీ.ల  దూరంలో ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం లకు క్రమం తప్పకుండ విమాన రాకపోకలు ఉంటాయి. యాత్రికులకు కనెక్ట్ విమానాలు హైదరాబాద్ నుండి దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల అనుసంధానం ఉంది. విజయవాడ రైల్వే భారతదేశం యొక్క ప్రధాన నగరాలలో అనేక రైల్వే స్టేషన్లకు అనుసంధానించబడింది. విజయవాడ కూడా దక్షిణ మరియు మధ్య భారతదేశంలో అనేక నగరాలకు చక్కని  రోడ్డు రవాణా సదుపాయాలూ కలిగి  ఉంది. విజయవాడ సందర్శించడానికి సంవత్సరంలో ఉత్తమ సమయం మార్చి నుంచి అక్టోబర్ సమయం. ఇక్కడ ఉష్ణోగ్రతలు వర్షాకాలం తర్వాత లేదా శీతాకాలంలో  ఆహ్లాదకరంగా ఉంటాయి. డెక్కన్ పండుగ, లుంబిని పండుగ, దసరా మరియు దీపావళి వంటి పలు ముఖ్యమైన పండుగలు కూడా ఈ నెలల్లో వైభవముగా జరుపుకుంటారు. ప్రత్యేకించి దసరా పండుగ ఉత్సవాలు ఇక్కడి కనకదుర్గ దేవాలయం లో అతి వైభవంగా జరుగుతాయి.

విజయవాడ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

విజయవాడ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం విజయవాడ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? విజయవాడ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రాష్ట్ర ఇతర నగరాలకు విజయవాడ నుంచి బస్సులు ఉంటాయి.అనేక ప్రైవేటు బస్సు సేవలు కూడా నగరాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, బెంగుళూర్ మరియు ముంబై ప్రతిరోజూ బస్సులు పనిచేస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం విజయవాడ ఒక ప్రధాన రైల్వే స్టేషన్.ఈ స్టేషన్ ఢిల్లీ, ముంబై, కోలకతా, చెన్నై మరియు బెంగుళూర్ సహా రైలు భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాలకు కలపబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం విజయవాడ వద్ద విమానాశ్రయం గన్నవరం వద్ద, నగరం నుండి సుమారు 20 km దూరంలో ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం లకు క్రమం తప్పకుండ విమాన రాకపోకలు ఉంటాయి.యాత్రికులకు కనెక్ట్ విమానాలు హైదరాబాద్ నుండి దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల అనుసంధానం ఉంది.గన్నవరం విమానాశ్రయం నుండి సులభంగా విజయవాడ చేరుకోవటానికి టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed