సందర్శించడానికి సరైన సమయంవార్ధా నగరం సంవత్సరంలో ఎక్కువ భాగం వేసవిలో అధిక ఉష్ణోగ్రత, శీతాకాలంలో తక్కువ చలిని కలిగిఉంటుంది, ఐతే ప్రధానంగా ఏడాది లో ఎక్కువ భాగం పొడిగా వుంటుంది. పొడిగా వుండే శీతాకాలం వార్ధా నగర సందర్శనకు అనువుగా ఉంటుంది. ఇక్కడి పరిసరాలు చల్లగా ఉండి, పదిరెట్లు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
వేసవిమార్చ్ నుండి మే నెల వరకు వుండే వేసవిలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఈ కాలంలో పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు ఉంటు౦ది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, 28 డిగ్రీల కనిష్ట స్థాయికి చేరుతుంది. సంవత్సరంలో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రత ఉండటంవల్ల, ఈ సమయంలో ప్రయాణాలు చేయరు.
వర్షాకాలంవార్ధాలో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలో నైరుతీ ఋతుపవనాల వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు ఎండాకాలపు వేడి నుండి విశ్రాంతిని కలిగిస్తాయి. వర్షాకాలం తరువాత అక్టోబర్ నుండి నవంబర్ నెల వార్ధ నగర సందర్శనకు అనువైనది.
శీతాకాలండిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే చలికాలం బాగా ఆలస్యంగా ప్రవేశిస్తుంది, ఐతే వస్తూ చాలా మార్పు తెస్తుంది. సంవత్సరంలోని అతి చల్లని మాస౦ డిసెంబర్ లో ఉష్ణోగ్రత కనిష్ట౦గా 15 డిగ్రీ లు, గరిష్ట౦గా 28 డిగ్రీలుగా నమోదౌతుంది.