భాగ్యనగరం చారిత్రక నిర్మాణాలకు నిలయం. అలనాటి రాచరికపు పాలనకు నిలువెత్తు సాక్ష్యం.
అలాంటి అద్భుత రాతి నిర్మాణపు సౌధమే గోల్కొండ కోట. ఆ కోటలో దాగిన నమ్మశక్యం కానీ ఓ 10 విశేషాలు మీకోసం...
అలనాటి నవాబుల పాలనకు నిలువెత్తు సాక్ష్యం ఈ గోల్కొండ కొట. భాగ్యనగరపు శివార్లలో ఉండి.. నేడు నగరంలో భాగమైపోయిన అద్భుత నిర్మాణమిది.
కాకతీయుల కాలంలో మట్టితో ఓ చిన్న నిర్మాణం చేశారు. ఇప్పుడు ఆ దేవతకే మనం తొలిబోనం సమర్పిస్తున్నాం. గొల్లకొండగా పిలిచే ఈ నిర్మాణం కాలక్రమంలో గోల్కొండగా మారింది.
Title 1
ఈ కోట అనేక ముస్లిం రాజులనుంచి 15వ శతాబ్దంలో కుతుబ్‌షాహీల ఆధీనంలోకి వెళ్లింది. అప్పుడే గోల్కొండ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
120 మీటర్ల ఎత్తులో నల్లరాతి కొండపై అద్భుతమైన.. శత్రుదుర్భేధ్యమైన కోటగా అవతరించింది ఈ గోల్కొండ.
గడచిన ఐదు వందల ఏళ్లలో ఎన్నో విపత్తులు.. మరెన్నో ఉపద్రవాలను తట్టుకుని నేటికీ ఠీవిగా నిలుబడింది ఈ చారిత్రక నిర్మాణం.
కోటలోకి శత్రువులు వస్తే.. పైన ఉన్నవారికి సమాచారం క్షణాల్లో చేరవేసేలా ధ్వనిశాస్త్రం ఆధారంగా ఓ అద్భుతమైన కట్టడం నిర్మించారు.
ఖిల్లా లోపల నాలుగు సింహ ద్వారాలు.. అనేక రాజమందిరాలు.. ఆలయాలు.. మసీదులను ఆప్యాయంగా పలకరిస్తాయి.
గోల్కొండ కోట నిర్మాణం ఓ అద్భుతం.. అలనాటి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, నిర్మాణ విలువలు చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే.
రామదాసును తానీషా ప్రభువు ఈ కోటలోని కారాగారంలో బంధించాడు.