Ajay Mohan       Jan 20, 2023

విశాఖ తీర‌పు అందాల‌ను మాట‌ల్లో వ‌ర్ణించేందుకు అక్ష‌రాలు సైతం కొర‌వ‌డ‌తాయి అంటారు కొంద‌రు ర‌చ‌యిత‌లు. అది వాస్త‌వ‌మే క‌దూ!

ప్ర‌కృతి మ‌ల‌చిన దృశ్యానికి.. మాన‌వ నిర్మితాలు మెరుగులు దిద్దిన‌ట్లు  క‌నిపించే ఆర్‌కే బీచ్ సోయ‌గాలు చూసేందుకు రెండు క‌ళ్లూ స‌రిపోవు.

సాయంకాలానా.. సంధ్యా స‌మ‌యాన.. కుటుంబం స‌మేతంగా ప్ర‌శాంత‌త‌ను  మూట‌గ‌ట్టుకునేందుకు ఆర్‌కే బీచ్ కేరాఫ్ అడ్ర‌స్ అనే చెప్పాలి. మీరేమంటారు!

స‌ముద్ర గ‌ర్భంలో దాగిన అందాల‌ను.. అరుదైన జీవ‌రాసుల కేరింత‌ల‌ను నేరుగా వీక్షించేందుకు మ‌త్స్యద‌ర్శిని సాద‌ర ఆహ్వానం ప‌లుకుతోంది.

ఎగ‌సిప‌డే కెరటాకు ఎదురొడ్డి నిల‌బ‌డిన‌ట్లు పోటోల‌కు ఫోజులిచ్చేందుకు ఆర్‌కేబీచ్ తీరంలో చాలా ప్ర‌దేశాలు ఉన్నాయి.

ఇక్క‌డి ప్ర‌కృతి గీసిన తీర‌పు అందాల ముందు నొవెటెల్ కూడా చిన్న‌బోతోంది. కెర‌టాల‌ను ఆస్వాదిస్తూ.. మౌనంగా నిలిచిపోతోంది.

మంచుతెర‌ల‌ను చీల్చుకుంటూ వ‌చ్చే సూరీడు వెద‌జల్లే ఆ వ‌ర్ణాల‌ను చూసేందుకు రెండు క‌ళ్లూ స‌రిపోవు.

బ‌తుకుపోరులో మ‌త్స్యకారుల జీవ‌న చిత్రానికి నిలువెత్తు నిద‌ర్శనం..  ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో అలుపెరుగ‌ని సైనికుల విడిది కేంద్రం ఆర్‌కే  బీచ్‌.

అల్లంత దూర‌న తార‌స‌ప‌డే పెద్ద పెద్ద నౌక‌లూ.. ఓడ‌లూ.. సంద‌ర్శ‌కుల‌కు అద‌న‌పు ఆహ్లాదాన్ని అందిస్తాయి.