Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యావత్మల్ » వాతావరణం

యావత్మల్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయంవర్షపాతం తక్కువ కావడంతో యావత్మల్ సాధారణంగా ఏడాది పొడవునా వేడి, పొడి పరిస్థితులలో వుంటుంది. వర్షాకాలం తర్వాత అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా వుండే శీతాకాలం యావత్మల్ సందర్శనకు అనువైన సమయం.

వేసవి

వేసవియావత్మల్ లో వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి. మార్చ్ నించి మే వరకు వుండే ఈ కాలంలో సాధారణంగా ప్రయాణాలు, స్థల సందర్శనలు చేయకపోవడం మంచిది. ఈ సమయంలో ఇక్కడ 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ కాలంలో వేడిగాలులు కూడా ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలంయావత్మల్ లో వర్షాకాలం పరిమిత వర్షపాతంతోనే వుంటుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు వుండే వర్షాకాలంలో, ముఖ్యంగా జులైలో అత్యధిక వర్షపాతం నమోదౌతుంది. మీరు వర్షాన్ని ఇష్టపడేవారైతే, ఈ కాలంలో యావత్మల్ సందర్శన ఆనందం కలిగిస్తుంది.

చలికాలం

శీతాకాలండిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా వుండే శీతాకాలంలో యావత్మల్ లో ఉష్ణోగ్రత చల్లటి 5 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుంది. పగళ్ళు చల్లగా 25 డిగ్రీల ప్రాంతంలో వుండే ఉష్ణోగ్రతలతో, రాత్రులు మరింత చల్లగా మారిపోతాయి. శీతకాలానికి అనువైన దుస్తులు తెచ్చుకోవడం తప్పనిసరి.