Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యుస్మార్గ్ » వాతావరణం

యుస్మార్గ్ వాతావరణం

యుస్మార్గ్ సందర్శించటానికి అనువైన కాలం యుస్మార్గ్ అందాలని వీక్షించటానికి సౌకర్యవంతంగా ఉండే వేసవి అనుకూలమైందే అయినా డిశంబరు, జనవరి లో కురిసే మంచు యాత్రికులని విశేషంగా ఆకర్షిస్తుంది. వేసవిలో వాతావరణం ఆహ్లాదంగా ఉన్నా శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది.

వేసవి

వేసవి--ఇక్కడ మే నుండి ఆగస్టు వరకూ వేసవి కాలం. ఇక్కడ వేసవి లో వాతావరణం మరీ వేడిగా కాకుండా వెచ్చగా ఉండి సౌకర్యవంతంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీ ల సెల్సియస్ కి అటూ ఇటూగా ఉండి రాత్రి ఉష్ణొగ్రత 15-18 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉంటుంది. ఈ ఆహ్లాదకర వాతావరణం వల్లనే యాత్రికులు యుస్మార్గ్ ని ఈ కాలంలో సందర్శించడానికి ఇష్టపడతారు.

వర్షాకాలం

యుస్మార్గ్ లో వేసవి, శీతాకాలాలతో మాత్రమే కూడిన శీతోష్ణ వాతావరణం ఉంటుంది. వేసవి ఆహ్లాదకరం గా ఉంటుంది. శీతాకాలంలో మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతంలో శీతాకాలంలో మంచు కురవటం వల్ల అవపాతం ఉంటుంది.  

చలికాలం

శీతా కాలం--ఇక్కడ అక్టోబర్ నుండీ మార్చ్ వరకూ శీతాకాలం. శీతాకాలం యుస్మార్గ్ లో చాలా చల్లగా ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణొగ్రత మైనస్ 2 డిగ్రీ సెల్సియస్ వరకూ పడిపోతుంది. గరిష్ట ఉష్ణొగ్రత 8-15 డిగ్రీ ల మధ్యలో ఉంటుంది. డిశంబర్,జనవరి నెలలో ఇక్కడ మంచు కురిసి అనేక మంది యాత్రికులని ఆకర్షిస్తూ ఉంటుంది.