ఉత్తమ సీజన్జునెబోటొ ను సందర్శించటానికి ఉత్తమ సమయం శీతాకాలం. కానీ వానలో తడిచి నానాలని అనుకొనే వారు వర్ష కాలంలో సందర్శించవచ్చు.
వేసవి కాలంజునెబోటొ లో వేసవిలో వేడి మధ్యస్తంగా ఉంటుంది. ఇక్కడ అత్యధికంగా నమోదుకాబడిన ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా ఉన్నది. ఇక్కడ వేసవి కాలం దీర్ఘకాలం లేకుండా కొన్ని నెలలు మాత్రమే ఉంటాయి. అప్పుడు కూడా ఉన్నివస్తువులను తీసుకువెళ్ళటం మంచిది.
వర్షాకాలంజునెబోటొ లో సంవత్సరంలో తొమ్మిది నెలలు వర్షాలు పడతాయి. ఇక్కడ వర్షాకాలం దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం నమోదు వర్షపాతం 200 సెం.మీ.వరకు ఉంటుంది . జూలై మరియు ఆగస్టు నెలల్లో భారీ వర్షం కురుస్తుంది.
శీతాకాలంజునెబోటొ లో శీతాకాలాలు చాలా చల్లగా ఉంటాయి. అప్పుడు ఉష్ణోగ్రత సెల్సియస్ 1 డిగ్రీ క్రిందికి పడిపోతుంది. శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఇక్కడ డిసెంబర్ మరియు జనవరి సమయంలో చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా శీతాకాలంలో జునెబోటొ మరియు దాని పరిసర ప్రాంతాలు సందర్శనార్ధం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఊలు బట్టలు తీసుకుని వెళ్ళటం మంచిది.