Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలో అరుదైన శివలింగం ... మీరే చూడండి !

ప్రపంచంలో అరుదైన శివలింగం ... మీరే చూడండి !

ప్రపంచంలో ఎక్కడా లేని, వినని అరుదైన శివలింగం ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామం ఉన్నది. ఇక్కడ శాతవాహనులు హయాంలో నిర్మించినట్లు చెప్పబడుతున్న శివాలయం ఉన్నది.

By Super Admin

ప్రపంచంలో ఎక్కడా లేని, వినని అరుదైన శివలింగం ఒకటి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామం ఉన్నది. ఇక్కడ ఆంధ్ర శాతవాహనులు హయాంలో నిర్మించినట్లు చెప్పబడుతున్న ఒక పురాతన శివాలయం ఉన్నది. దీనిని క్రీ.పూ. 1 -3 వ శతాబ్ధంలో కట్టించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చంద్రగిరి మ్యూజియం వెళ్ళి తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి తిరుపతి కి రోడ్ ట్రిప్ జర్ని !

ఆలయాన్ని ఎప్పుడు కట్టారో అక్కడి శాశనాల ద్వారా తెలిసిపోతుంది కానీ ఆలయంలోని లింగాన్ని ఎవరు ప్రతిష్టించారో .. ఎప్పుడు ప్రతిష్టించారో తెలీదు. అయితే గుడికి సంభంధించిన ఆనవాళ్ళు ఎక్కడో ఉత్తరప్రదేశ్ లోని మథుర మ్యూజియంలో, ఉజ్జయినీ రాజ్య కాలంలో వాడిన నాణాల మీద కనిపించాయి.

గుడిమల్లం శివలింగం విశిష్టత

గుడిమల్లం శివలింగం విశిష్టత

గుడిమల్లం శివాలయంలో శివుడు పరశురామేశ్వరునిగా పూజలందుకొంటున్నాడు. ఆలయంలో గర్భాలయం ముఖమండపం కన్నా కాస్త లోతుగా ఉంటుంది. గర్భాలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా మానవుని రూపంలో వేటగాని వలె దర్శనమిస్తాడు. ఈ లింగం ముదురు కాఫీవర్ణం లో ఉండి 5 అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంటుంది.

చిత్ర కృప : Desugari

శివలింగం గురించి వర్ణన

శివలింగం గురించి వర్ణన

ప్రపంచంలో ఎక్కడా వినని, చూడని పురుష అంగాన్ని పోలి ఉండే సుమారు 5 -7 అడుగుల ఎత్తున్న ఈ శివలింగం పై కుడిచేతితో ఒక గొర్రెపోతును, ఎడమచేతిలో చిన్నగిన్నె పట్టుకొని, ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ... యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతి రూపాన్ని చెక్కారు.

చిత్ర కృప : wicommons

శివలింగం గురించి వర్ణన

శివలింగం గురించి వర్ణన

స్వామి జటాభార తలకట్టుతో, చెవులకు అనేక రింగులు వివిధ ఆభరణాలు, నడుము నుండి మోకాళ్ళ వరకూ వస్త్రము ధరించి ఉంటాడు. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. రుద్రుని వస్త్ర ధారణ ఋగ్వేద కాలం నాటిదని పురావస్తు శాస్తవేత్తల అంచనా. ఇప్పటికీ ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించిన సమాచారం లభించటం లేదు.

చిత్ర కృప : Desugari

పురావస్తు ఆధీనంలో ..!

పురావస్తు ఆధీనంలో ..!

గుడిమల్లం ఏడేళ్ల కిందటి వరకు వురావస్థు శాఖ వారి ఆధీనంలో ఉండటంతో ఎటువంటి పూజాపునస్కారాలు జరగలేదు. ఇక్కడ ఒక పురావస్తు ఉద్యోగి గైడ్ గా ఉండి, అరుదుగా వచ్చిపోయే సందర్శకులకు ఆలయం పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తుంటాడు.

చిత్ర కృప : Desugari

చంద్రగిరి కోట

చంద్రగిరి కోట

అంతదూరం వెళ్ళి ఈ ఆలయాన్ని చూడలేనివారు, ఆలయంలోని మూలవిరాట్టును అన్ని విధాల పోలిన ప్రతిరూపాన్ని చంద్రగిరి కోటలోని మ్యూజియంలో చూడవచ్చు.

చిత్ర కృప : Priyan Nithya

గుడిమల్లం ఎలా వెళ్ళాలి ?

గుడిమల్లం ఎలా వెళ్ళాలి ?

గుడిమల్లం చేరుకోవటానికి రోడ్డు మార్గం సులభంగా ఉంటుంది. అయినా కూడా సమీపంలో విమాన మరియు రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

గుడిమల్లం సమీపాన రేణిగుంట దేశీయ విమానాశ్రయం 11 కి.మీ. దూరంలో ఉంటుంది. ప్రభుత్వ బస్సుల్లో లేదా ప్రవేట్ వాహనాలు ఎక్కి గుడిమల్లం చేరుకోవచ్చు.

రైలు మార్గం

గుడిమల్లం సమీపాన రేణిగుంట (11 కి.మీ) మరియు తిరుపతి(22 కి.మీ) రైల్వే స్టేషన్ లు కలవు. ఈ ఊర్ల నుండి గుడిమల్లం గ్రామానికి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాలు వెళుతుంటాయి.

రోడ్డు/ బస్సు మార్గం

రేణిగుంట (11 కి.మీ), తిరుపతి(22 కి.మీ), చిత్తూర్ (85 కి.మీ), చంద్రగిరి (38 కి.మీ) ల నుండి గుడిమల్లం గ్రామానికి బస్సు సౌకర్యం తో పాటుగా జీపు, షేర్ ఆటో ల సౌకర్యం ఉన్నది.

చిత్ర కృప : Vamshi Krishna

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+