Search
  • Follow NativePlanet
Share
» »ముత్తతి - కావేరి నదీతీర అందాలు !

ముత్తతి - కావేరి నదీతీర అందాలు !

By Mohammad

ముత్తతి కర్ణాటక రాష్ట్రంలోని మాంద్య జిల్లాలో ఉన్నది. బెంగళూరు నుండి ఇక్కడికి చేరుకోవటం చాలా సులభం. కేవలం గంటన్నర లోపే ప్రయాణం ఉంటుంది. బెంగళూరు నుండి ఉదయాన్నే వెళ్లి రాత్రికల్లా తిరిగివచ్చే పర్యాటక స్థలం ముత్తతి. నగరానికి దగ్గర గా ఉండటంతో పర్యాటకులు సైట్ సీయింగ్ కై తరచూ వస్తుంటారు.

ఇతిహాసాల ప్రకారం చూసినట్లయితే, ముత్తతి ప్రదేశం రామాయణం తో ముడిపడి ఉంటుంది. ఈ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం ప్రసిద్ధి. దీనినే హనుమంతరాయ దేవాలయం అని పిలుస్తారు. ఈ గ్రామం గుండా కావేరి నది ప్రవహిస్తుంది. చుట్టూ కొండలు, దట్టమైన అడవులు, ప్రకృతి దృశాలు ఈ ప్రదేశాన్ని మరింత అందంగా కనపడేటట్లు చేస్తున్నాయి.

ఆంజనేయ స్వామి దేవాలయం

ఆంజనేయ స్వామి దేవాలయం

చిత్ర కృప : mrsherlock007

ఆంజనేయ స్వామి దేవాలయం

కావేరి నది ఒడ్డున గల ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ముత్తతి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా దర్శించాలి. ఈ దేవాలయంలో హనుమంతుడు ప్రధాన దైవం. సీతాదేవి తన వేలి ఉంగరాన్ని ఈ ప్రదేశంలో పోగుట్టుకుందని, అప్పుడు రాముని బంటు హనుమాన్ నదిలో మునిగి ఆ ప్రదేశం మంతా అన్వేషించి ఉంగరాన్ని బయటకు తీసాడని కధనం.

చుంచి జలపాతాలు

చుంచి జలపాతాలు అర్కావతి నది నుండి ఏర్పడుతాయి. తరువాత జలపాతహలు కావేరి నది ప్రవాహంలో కలుస్తాయి. దట్టమైన అడవి గుండా, పచ్చదనం మధ్యలో నడిచి వెళితే జలపాతాలను చేరుకోవచ్చు. ప్రకృతి ఒడిలో తనివితీరా పరవశించి పోవాలనుకొనేవారికి ఈ ప్రదేశం చక్కటి ఉదాహరణ. వర్షాకాలంలో జలపాతం నిండుగా కనిపిస్తుంది.

జలపాత దృశ్యాలు

జలపాత దృశ్యాలు

చిత్ర కృప : native planet

కావేరి వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

కావేరి వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ ఎన్నో రకాల మొక్కలకు మరియు జంతుజాలాలకు ఆవాసంగా ఉన్నది. వన్య జంతువుల మీద ఆసక్తి ఉన్న వారు ఏనుగు, చిరుత, జింకలు, దుప్పి వంటి ఎనో జంతువులను చూడవచ్చు. పక్షుల మీద ఆసక్తి ఉన్నవారు బుల్ బుల్ , పిగ్మి వుడ్ పెక్కర్, సర్ కీర్ కక్కూ వంటి అరుదైన పక్షులతో పాటు తాబేళ్లు, మొసళ్ళు, పాములు మొదలైనవి కూడా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ లో చూడవచ్చు.

కావేరి వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

కావేరి వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

చిత్ర కృప : Rohit C

తెప్ప ప్రయాణాలు

కొద్ది పాటి సాహస క్రీడలు చేయాలనుకొనేవారికి ఇక్కడి పడవలు ఆనందాన్ని ఇస్తాయి. గిన్నె ఆకారంలో ఉండే ఈ పడవలను వెదురు, రెల్లు గడ్డి ని ఉపయోగించి తుది మెరుగులు దిద్దుతారు. పూర్వం వీటిని రవాణా సాధనాలుగా ఉపయోగించేవారు కానీ నేడు వినోద సాధనాలుగా పర్యాటకులు ఉపయోగిస్తున్నారు.

తెప్ప ప్రయాణాలు

తెప్ప ప్రయాణాలు

చిత్ర కృప : LavanKumar R

ట్రెక్కింగ్

ముత్తతి లోని దట్టమైన అడవుల గుండా ట్రెక్కింగ్ చేయాలంటే అక్కడి అటవీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే మీ తో పాటు ఒక గైడ్ ను వెంటబెట్టుకొని అడవిలోకి తీసుకెళ్లటం ఉత్తమం. సముద్రమట్టానికి 1125 మీటర్ల ఎత్తులో ఉండే సోలిగెరె హిల్ ను పర్వతారోహకులు అధిరోహించవచ్చు.

కావేరి నది ప్రవాహం

కావేరి నది ప్రవాహం

చిత్ర కృప : Abhijeet Dutta

ముత్తతి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

ముత్తతి కి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 114 కి. మీ ల దూరంలో కలదు. దేశంలోని అన్ని నగరాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి . క్యాబ్ లేదా టాక్సీ సహాయంతో ముత్తతి చేరుకోవచ్చు.

రైలు మార్గం

బెంగళూరు రైల్వే స్టేషన్ ముత్తతి సమీపాన ఉన్నది. ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా, కొచ్చి తదితర నగరాల నుండి ఈ రైల్వే స్టేషన్ కలపబడి ఉన్నది. స్టేషన్ బయట క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని ముత్తతి వెళ్ళవచ్చు.

ముత్తతి చేరుకోండి ఇలా !

ముత్తతి చేరుకోండి ఇలా !

చిత్ర కృప : native planet

బస్సు మార్గం

బెంగళూరు నుండి ముత్తతి కి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాలు లభిస్తాయి. బెంగళూరు నివాసితులు తరచూ ఈ ప్రదేశాన్ని సందర్శించి అక్కడి మనోహర దృశ్యాలను ఆనందిస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X