అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ సందర్శనం

Written by: Venkata Karunasri Nalluru
Updated: Monday, March 13, 2017, 16:32 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

అసఫ్ జహిల అధికార నివాస స్థలమైన చౌమహల్లా పాలస్ హైదరాబాద్ నిజాములకి చెందినది. పెర్షియన్ పదాలయిన చహార్ మరియు మహాలట్ నుండి చౌమోహోల్ల పాలస్ పేరు వచ్చింది. వీటి అర్ధం నాలుగు పాలస్ లు అని అర్ధం. షాహ అఫ్ ఇరాన్ పాలసు నిర్మించిన శైలిలోనే ఈ పాలస్ ని నిర్మించారు.

18 వ శతాబ్దంలో ఈ ప్యాలెస్ నిర్మాణం ప్రారంభం అయింది. ఈ పాలస్ నిర్మాణం పూర్తవడానికి పది సంవత్సరాలు పట్టింది. అందువల్ల, ఈ ప్యాలెస్ యొక్క నిర్మాణం మరియు ఆకృతి వివిధ రకాల శైలులతో భావితమయ్యాయి. పలు విధాల విదులకి ఈ పాలస్ ని ఉపయోగించేవారు. నిజాముల పట్టాభిషేక కార్యక్రమం, గవర్నర్ - జనరల్స్ ల ఆహ్వాన వేడుకలు వాటిలో కొన్ని.

నిజానికి, నిజాముల హయాంలో అన్ని విధాల ఉత్సవ వేడుకలని జరుపుకునేందుకు ఈ పాలస్ ని ఉపయోగించేవారు. ఇక్కడ రెండు రాజ దర్బారులు ఉన్నాయి. ఒకటి ఉత్తరపు రాజదర్బార్. రెండవది దక్షిణపు రాజ దర్బార్. ఈ రెండు దర్బారులు చుట్టూ అందమైన డిజైన్ ల గదులు ఉన్నాయి. వైభవము మరియు మనోహరము ఈ ప్యాలెస్ యొక్క విశిష్టత.

హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ సందర్శనం

PC: wikimedia.org

'చౌ' అంటే నాలుగు, 'మహాలట్' అంటే రాజభవనాలు అని అర్థం. అంటే నాలుగు రాజభవనాలను కలిగినది అని అర్థం. చౌమహల్ల ప్యాలెస్ ఇరాన్ లోని టెహ్రాన్ షా ప్యాలెస్ ను పోలివుంటుంది. హైదరాబాద్ నుండి ఇతర నగరాలకు విమాన మరియు రైలు, రోడ్డు ప్రయాణ సౌకర్యం వుంది.

హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ సందర్శనం

PC: wikimedia.org

సందర్శించటానికి ఉత్తమ సమయం

ప్యాలెస్ ను సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. శుక్రవారాలు మరియు జాతీయ సెలవు దినాలు పాలెస్ మూసివేస్తారు.

స్థలం గురించి మరింత సమాచారం

ఈ భవన నిర్మాణం 1857 మరియు 1869 మధ్య ఐదవ నిజాం పాలనలో ఆఫ్ జర్-ఉద్-దౌలా, అసఫ్ జవ్ వి కాలంలో పూర్తి చేశారు. ప్యాలెస్ నిజానికి ఉత్తరాన లాడ్ బజార్ నుండి దక్షిణాన అస్పన్ చౌక్ రోడ్ వరకు 45 ఎకరాలు విస్తరించి వున్నది.

హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ సందర్శనం

PC: wikimedia.org

ప్యాలెస్ రెండు ప్రాంగణాలు కలిగి ఉంటుంది. అవి వరుసగా ఉత్తర ప్రాంగణం, దక్షిణ ప్రాంగణం. దక్షిణ ప్రాంగణంలో అఫ్జల్ మహల్, తహ్నియత్ మహల్, మహతాబ్ మహల్ మరియు అఫ్తాబ్ మహల్ ఇవి నాలుగు రాజభవనాలు వున్నాయి.

అఫ్తాబ్ మహల్ మిగిలిన వాటి కంటే పెద్దదయిన రెండు అంతస్తుల నిర్మాణం.

ఉత్తర ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు, తూర్పు వైపు అనేక గదులు సుదీర్ఘ కారిడార్ కలిగిన పరిపాలనా విభాగం వున్నాయి. ఈ ప్రాంగణంలో అతిథులు మరియు ముఖ్యమైన వ్యక్తుల కోసం ఒక అందమైన ఫీచర్ షిషె అలట్ ఉంది. ప్యాలెస్ యొక్క ఆవరణంలో ఒక క్లాక్ టవర్, ఒక కౌన్సిల్ హాల్ వున్నాయి. రోషన్ బంగ్లాకు ఆరవ నిజాం తల్లి ఎవరు రోషన్ బేగం పేరు పెట్టారు.

హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ సందర్శనం

PC: wikimedia.org

ప్యాలెస్ నిర్మించినప్పుడు స్థాపించబడిన ఖివాత్ క్లాక్ యొక్క టిక్కింగ్ శబ్దం ఇప్పటికీ వినపడుతూనే వుంటుంది. దీనిని క్లాక్ టవర్ పైన చూడవచ్చును. ఈ ప్యాలెస్ లో 7000 మంది పరిచారకులు వుండేవారని చెబుతారు. ఇక్కడ అందమైన తోటలు వున్నాయి.

హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ సందర్శనం

PC: wikimedia.org

రాజభవనంలో ఆకుపచ్చని పచ్చిక యొక్క అందం అందర్నీ ఆకర్షిస్తుంది. ప్యాలెస్ లో కళాత్మకంగా చెక్కిన స్తంభాలు, ప్యాలెస్ ముందు భారీ నీటి ఫౌంటెన్ చూడటానికి చాలా అందంగా వుంటుంది. రాజభవనం గోడలు మరియు పైకప్పుపై మీద గాజుతో సున్నితమైన చెక్కబడిన చెక్కడాలు చాలా కళాత్మకంగా వుంటాయి.

భవనంలో వివిధ గ్యాలరీలు, బట్టలు, ఫర్నిచర్, కరెన్సీ నాణేలు వంటి ఆసక్తికరమైన ప్రదర్శనలు వుంటాయి.

ఒక విభాగంలో పునరుద్ధరించబడిన వివిధ రకాల ఖురాన్స్ ఉన్నాయి. అవి ఒకటి చేతితో వ్రాయబడిన వ్రాత ఖురాన్ మరియు మెటల్, బంగారు మరియు అనేక ఇతర లోహాలతో చెక్కబడిన సూక్ష్మ ఖురాన్స్ చూడవచ్చును. పాతకాలపు కార్ల ప్రదర్శన ఇక్కడ ప్రధాన ఆకర్షణ.

ప్యాలెస్ ఎంట్రీ రుసుములు మరియు టైమింగ్స్

ఎంట్రీ రేట్లు పెద్దలకు రూ. 80, 12 ఏళ్ల వయస్సు క్రింద పిల్లలకు రూ 20 మరియు విదేశీయులకు రూ. 200 గా ఉన్నాయి.

ప్యాలెస్ శనివారం నుండి గురువారం వరకు ఉదయం 10:00 గంటల నుండు సాయంత్రం 5:00 వరకు తెరిచి వుంటుంది.

English summary

The Magnificent Chowmahalla Palace In Hyderabad

Read on to know about the Chowmahalla Palace in hyderabad, which is worth a visit.
Please Wait while comments are loading...