అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ధనుష్కోడికి ట్రావెల్ గైడ్ మరియు నిర్మలమైన బీచ్

Published: Wednesday, February 15, 2017, 16:32 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ధనుష్కోడి - ధనుష్కోడిని ఘోస్ట్ సిటీ అంటారు. బెంగళూరు నుండి సుమారు సుమారు 620 కి.మీ. దూరం ఉంది. తమిళనాడులోని రామేశ్వరం యొక్క దక్షిణ కొనలో ఉంది. ఇది భారతదేశ తీరాన గల శ్రీలంకకు అతి దగ్గరిగా ఉంది. ఇది 1964 లో వచ్చిన ఒక విధ్వంస తుఫాను వల్ల గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొంది. అదేమిటంటే ప్రధాన భూభాగానికి, రైలు వంతెనకు గల కనెక్షన్ తెగిపోయింది.

రామేశ్వరంలో గల ప్రసిద్ధ దేవాలయాలు:

ధనుష్కోడికి ట్రావెల్ గైడ్ మరియు  నిర్మలమైన బీచ్

PC: wikimedia.org

ప్రజలు అందమైన బీచ్ లో ఆనందించడానికి మరియు శిధిలాలు చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తారు. మీరు ఎప్పుడూ కోరుకునే అత్యంత అందమైన అనుభవాలలో ఇది ఒకటి. ఈ స్థలం ఒక ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ ప్లేస్ కాకుండా, పౌరాణిక ప్రదేశంగా కూడా అభివృద్ధి చెందింది.

పురాణం ఏమి చెబుతుందంటే:
శ్రీరాముడు తన మర్కటాలగుంపుతో మరియు సోదరుడు లక్ష్మణుడు, హనుమాన్, రావణుడి సోదరుడు విభీషణుడితో పాటు నీటిలో తేలియాడేటట్లుగా రాళ్లను సముద్రం పొడవునా అమర్చి ఒక వంతెనను నిర్మించి రావణుని చెర నుండి సీతను కాపాడే ప్రయత్నంలో లంకను చేరుకోవడానికి అనువుగా నిర్మించారు.

రామేశ్వరంలో గల పంబన్ బ్రిడ్జి:

ధనుష్కోడికి ట్రావెల్ గైడ్ మరియు  నిర్మలమైన బీచ్

PC: wikimedia.org

విజయంతో లంక నుండి తిరిగి వచ్చిన తర్వాత విభీషణుడు, వంతెన నాశనం చేయమని రాముని కోరారు. ఎటువంటి ఆలోచనలు లేకుండా రాముడు తన విల్లును ఉపయోగించి వంతెనను విచ్ఛిన్నం చేశారు అని ఇక్కడి నమ్మకం. "ధనుష్" అంటే "విల్లు" అనీ, "కోడి" అంటే "ముగింపు" అని అర్థం.

వాస్తవాలు: భూగోళశాస్త్రవేత్తల నిదర్శనాల ఆధారంగా పంబన్ ద్వీపం కొన శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ కు 28 కిలోమీటర్ల వంతెన అనుసంధానిస్తూ పోతుంది. ఈ బ్రిడ్జ్ ను "శ్రీరామ సేతు లేదా ఆడమ్ యొక్క బ్రిడ్జ్" అంటారు.

ధనుష్కోడికి ట్రావెల్ గైడ్ మరియు  నిర్మలమైన బీచ్

PC: wikimedia.org

15 వ శతాబ్దంలో వచ్చిన పెద్ద తుఫాన్ వల్ల వంతెన నాశనం అయినట్లు ధనుష్కోడి ద్వారా తెలుస్తుంది. ఇది తర్వాత మరో తుఫాను వల్ల మరింత నాశనం అయ్యింది. అందువల్ల దీనిని "ఘోస్ట్ టౌన్" అని పిలుస్తారు. ఇప్పుడు మనం చూసే ఈ శిథిలాలు 1964 సం. లో వచ్చిన తుఫాను వల్ల ఏర్పడిన భీభత్సం అని తెలుస్తుంది.

ధనుష్కోడి: ఒకే ఒక్క వెహికల్ మాత్రమే ధనుష్కోడికి మిమ్మల్ని చేర్చగలుగుతుంది అదేమిటంటే ఇసుకలో కూడా ఈజీగా ప్రయాణించగలిగేట్టు తయారుచేయబడిన జీప్. రామేశ్వరం నుంచి ధనుష్కోడికి గల 12కి.మీ. ప్రయాణం దేనిద్వారానైనా చేయవచ్చు. తర్వాత గల 2గం. ప్రయాణం ప్రత్యేకమైన వాహనాలలో చేయవలసి వస్తుంది.

ధనుష్కోడికి ట్రావెల్ గైడ్ మరియు  నిర్మలమైన బీచ్

PC: wikimedia.org

చెక్ పోస్ట్ నుండి గోస్ట్ టౌన్ అంతటా డ్రైవింగ్ మిమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. అది బీచ్ అంతటా ఒక రోలర్ కోస్టెర్ రైడ్ లాగా ఉంటుంది. వాహనం ఎలాంటి స్థలాలోనైనా సులభంగా వెళ్తుంది. మీ పైన నీలి ఆకాశం, మీ పాదాల క్రింద ఇసుక, మీ ముందు విశాలమైన బంగాళాఖాతం కన్పిస్తుంది.

ధనుష్కోడి నుండి శ్రీలంక వరకు వెళ్ళే ఫిషింగ్ బోట్లు ద్వారా ప్రయాణించే యాక్సెస్ పర్యాటకులకు లేదు. ఈ బోట్లు స్మగ్లింగ్ కి ఉపయోగిస్తారు. కొన్ని మందుల అక్రమ రవాణా దీని ద్వారా చేస్తారు.

ధనుష్కోడికి ట్రావెల్ గైడ్ మరియు  నిర్మలమైన బీచ్

PC: wikimedia.org

ధనుష్కోటి ఎండ్ పాయింట్ కు చేరినట్లయితే, మీ ఎడమచేతి వైపు బంగాళాఖాతం, కుడిచేతి వైపు హిందూ మహాసముద్రం చూడవచ్చు. ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడాను గమనించవచ్చు. ఒక వైపు సముద్రం నీలం రంగులోను, మరొక వైపు పచ్చరంగులోను అస్థిరమైన తరంగాలతో కూడి ఉంటుంది.

ధనుష్కోడికి ట్రావెల్ గైడ్ మరియు  నిర్మలమైన బీచ్

PC: wikimedia.org

ధనుష్కోటి నుండి తిరుగు ప్రయాణంలో, అక్కడ గల నిర్మాణాలు అనేక ఇతర శిథిలాలు, అవశేషాలు చూడవచ్చును.

సందర్శించటానికి ఉత్తమ సమయం:

ధనుష్కోడిని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇది శీతాకాలంలో ఉంటుంది.

English summary

Travel Guide To Dhanushkodi – The Untarnished Beach

Dhanushkodi is one of the mysterious places in Tamil Nadu that you should visit. Here is an entire guide to Dhanushkodi, the ghost city of India.
Please Wait while comments are loading...