Search
  • Follow NativePlanet
Share
» »ఒత్తిడి తగ్గించే వండర్ - వండర్ లా !

ఒత్తిడి తగ్గించే వండర్ - వండర్ లా !

ఆధునిక జీవనంలో ప్రతి వారూ నిత్యం ఎంతో కొంత ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి రోజూ ఉదయమే నిద్రలేవటం, ఆఫీస్ కి లేట్ అవుతోంది అంటూ రెడీ అవటం, ట్రాఫిక్ జామ్ లను ఎదుర్కొనటం, బస్సు లో సీట్ దొరకక పోవటం, చివరకు ఎంతో కష్టపడి ఆఫీస్ కి చేరటం, సీట్ లో కూర్చునే సరికి ఉన్న శక్తి అంతా ఆవిరి అయిపోయు, నీరసం రావటం! ఈ రకమైన ఒత్తిడి, నీరసపు, స్థితి నుండి బయట పడటం ఎలా ? ఈ రకమైన సమస్యలు చాలా వరకు రోజులో మన శక్తిని కోల్పోయేలా చేస్తాయి. మరి సమస్య కు పరిష్కారంగా ఏమి చేయాలి ?

పరిష్కారం ఖచ్చితంగా వుంది. దీనికి చికిత్స అంటే, మనలోని మానసిక సంతోషం, జీవన ఉత్సాహం, సహనం వంటివి అలవరచుకోవాలి. అయితే, వీటిని ఎలా పొందాలి అనే ప్రశ్న రావటం సహజం. కొంతమంది ప్రాణాయామ, ధ్యాన, యోగ మొదలగునవి ఆచరించి వీటిని పొందుతారు. మరికొందరు ప్రశాంత వాతావరణంలో లేదా ఏదైనా సాహస క్రీడలు చేయటం వలన, ఉత్సాహం పొందుతారు.

వీటిలో రెండవదైన సాహస క్రీడలు మిమ్మల్ని ఆనందంగా వుంచటం, మనస్సును ఉల్లాసం చేసి ఒత్తిడి తగ్గించటం చేస్తాయి. ఈ రకమైన మానసిక ఉల్లాసం, ప్లస్ విశ్రాంతి ఇచ్చే ప్రదేశాలు మీకు పార్క్ లు. మరి అటువంటి పార్క్ కు వెళ్లి, మన మనసును ఉల్లాసంగా ఉంచుకోవటానికి గాను ఈ వ్యాసం మూలంగా మీకు బెంగుళూరు సమీపంలో కల వండర్ లా పార్క్ పరిచయం చేస్తున్నాం. చదివి, వీక్ ఎండ్ విహారంగా ఆనందించండి.

వండర్ఫుల్ వండర్ లా

వండర్ఫుల్ వండర్ లా

వండర్ లా ఒక అమ్యూజ్ మెంట్ పార్క్. ఇది బెంగుళూరు నగరానికి 28 కి. మీ. ల దూరంలో కల బిడది పట్టణం లో కలదు. ఈ వండర్ లా పార్క్ ను విశాలమైన 82 ఎకరాల ప్రదేశంలో నిర్మించారు. ఈ థీం పార్క్ ను కొచ్చి పట్టణంలో కల వి-గార్డ్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది. మొత్తంగా 105 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడిన ఈ పార్క్ ను 2005 నుండి నిర్వహిస్తున్నారు.

ఫోటో సౌజన్యం : Saad Faruque

వండర్ఫుల్ వండర్ లా

వండర్ఫుల్ వండర్ లా

నీటిలో, లేదా భూమి పై విహరించేందుకు ఇక్కడ అనేక రకాల సవారీలు కలవు. ఇక్కడ ఒక మ్యూజికల్ ఫౌంటెన్, లేసర్ షో, డాన్స్ ఫ్లోర్, వర్చ్యువల్ రియాలిటీ షో వంటి మనస్సును ఆనంద పరిచే ప్రోగ్రాం లు కలవు.

ఫోటో సౌజన్యం : Natesh Ramasamy

వండర్ఫుల్ వండర్ లా

వండర్ఫుల్ వండర్ లా

ఇక్కడ మీకు చక్కటి వసతి, ఆతిధ్యం దొరుకుతుంది. వండర్ లా లో సోలార్ పానెల్ సహాయంతో సౌరశక్తి పొందుతారు. చలికాలంలో సౌర శక్తి సహాయంతో నీటిని వేడి చేస్తారు. పర్యావరణ స్నేహపూరితంగా సుమారు రెండు వేలకు పైగా చెట్లను ఇక్కడ పెంచుతున్నారు.

వండర్ఫుల్ వండర్ లా

వండర్ఫుల్ వండర్ లా

వచ్చిన వారి తిండి ఏర్పాట్లకు గాను ఇక్కడ అయిదు రెస్టారెంట్ లు, లాకర్ రూములు, వేయి మందికి పైగా వసతినిచ్చే ఒక హాలు కలవు. కనుక వివిధ రకాల ప్రోగ్రాం లు ఇక్కడ నిర్వహించుకోనవచ్చు.

వండర్ ఫుల్ వండర్ లా

వండర్ ఫుల్ వండర్ లా

ఈ వండర్ లా పార్క్ భారత దేశంలో చట్ట బద్ధ గుర్తింపు అయిన OHSAS 18001:2007 పొందిన రెండు పార్క్ లలో ఒకటి. అన్ని రకాల నిబంధలను అమలు చేసే ఈ వండర్ లా పార్క్ లో అయిదు నీటి శుద్ధీకరణ ప్లాంట్ లు మరియు వర్షపు నీటి నిలువ వంటి సౌకర్యాలు కూడా కలవు.

ఇన్ని సౌకర్యాలు కల ఈ పార్క్ ను బెంగుళూరు నుండి ప్రయాణించి ఒక్క రోజులో సందర్శించి, ఆనందించి సాయంత్రానికి మనోల్లాసంతో ఇల్లు చేరుకొనవచ్చు. మరి దీనిని మీ ఈ వీక్ ఎండ్ విశ్రాంతిలో చేర్చేయ్యండి.

ఫోటో సౌజన్యం : Avoided blue

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X