కల్సుబాయ్ హరిశ్చంద్రగడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి సహ్యాద్రి కొండల నడుమ కలదు. ఇది అహ్మద్ నగర్ జిల్లాలో అకోలే తాలూకాలో కలదు. ఈ శాంక్చురీలో అనేక జంతువులు, మొక్కలు కలవు. పెద్ద చెట్లు, పొదలు వుంటాయి. చందవా, బెహెడా, ఆవలి, గుల్చావి, ఖార్వెల్, సిరాస్, ఆషింద్, పర్జంభువాల్, హిర్డా, మరియు లోఖండి చెట్లను చూడవచ్చు. జంతువులంటే ఇష్టపడేవారికి నక్కలు, హైనాలు, జింకలు, ఉడుతలు, ముంగీసలు, అడవి పిల్లులు, అనేక రకాల పక్షులు కూడా కనపడతాయి. కల్సుబాయి శిఖరం కూడా సమీపంలోనే ఉంటుంది. ఈ శిఖరం సుమారు 1650 మీటర్ల ఎత్తు కలది. పడమటి కనుమలలోని ఎత్తైన శిఖరాలలో ఇది ఒకటి.



Click it and Unblock the Notifications