Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలంగుడి » వాతావరణం

అలంగుడి వాతావరణం

సరైన సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు అలంగుడిని సందర్శించడం ఉత్తమం. యాత్రీకులు ఇక్కడి పవిత్ర ఆలయాలను సందర్శించడానికి ఇదే ఉత్తమ సమయం. అలంగుడి చిన్న యాత్ర చేయాలనీ ఇష్టపడే వారు కూడా తేమగా, ఆనందకర వాతావరణం ఉండే జూన్ నుండి సెప్టెంబర్ సమయంలో ఈ స్థలాన్ని సందర్శించవచ్చు.  

వేసవి

వేసవి అలంగుడి లో వేసవి మార్చ్ నుండి మొదలై మే వరకు ఉంటుంది. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత 28 డిగ్రీల నుండి 44 డిగ్రీలతో సాధారణంగా వేడిగా ఉంటుంది. ఏప్రిల్, మే సమయంలో వాతావరణం వేడిగా ఉంటుంది కనుక పర్యాటకులు సాధారణంగా ఆ కాలంలో రారు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ లో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ తక్కువ వర్షపాతం ఉంటుంది. వర్షాకాలంలో అలంగుడి అద్భుతంగా ఉంటుంది, వానల రాకతో అలంగుడి ప్రజలు కఠినమైన వేడివాతావరణం నుండి తెరిపిపొందుతారు.

చలికాలం

శీతాకాలం అలంగుడి లో శీతాకాలం డిసెంబర్, ఫిబ్రవరి మధ్య ఉంటుంది. శీతాకాలంలో సాధారణంగా ఇక్కడి వాతావరణం 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.