ఔరంగాబాద్ కు 20 కిలోమీటర్ల ఆగ్నేయంగా ఉన్న దేవ్ ప్రసిద్ద సూర్యదేవాలయానికి నివాసం. 15 వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన ఆలయాన్ని ఉమ్గా చంద్రవంశానికి చెందిన రాజు కట్టాడని అంటారు. ఈ ఆలయానికి గొడుగు వంటి పై కప్పు తో కూడిన 100 అడుగుల ఎత్తులో ఉన్న అద్భుతమైన నిర్మాణం ఉంది.
సూర్యదేవుని పూజించడం అనే అతి ముఖ్య సంప్రదాయంలో అయెల్ రాజు కాలానికి చెందిన బ్రహ్మ కుండంలో పవిత్ర స్నానమాచరించడం కూడా ఇమిడి ఉంది. చాట్ పండుగ సమయంలో, ఇతర నెలలలో కూడా ఈ ఆలయానికి అనేకమంది భక్తులు వస్తారు.



Click it and Unblock the Notifications