Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఔరంగాబాద్ బీహార్

ఔరంగాబాద్ -  ప్రజాకర్షక బీహార్ నగరం!  

బీహార్ లోని అత్యంత మనోహరమైన నగరం ఔరంగాబాద్. ఔరంగాబాద్ నగరం విస్తృతమైన చారిత్రక సంఘటనల వారసత్వానికి కేంద్రబిందువైంది. దాని శక్తివంతమైన గతం నుండి ఈ నగరం పర్యాటకుని మనసు పై ముద్ర వేసే సౌరభం, ఆకర్షణను పొందింది.

12

భారత స్వాతంత్ర పోరాటంలో దాని సహకారానికి ఈ నగరం ఎంతగానో కొనియాడబడుతుంది. డా. రాజేంద్రప్రసాద్ ఇక్కడ ఎన్నో ఏళ్ళు గడిపాడు. స్వాతంత్ర ఉద్యమాలలో గొప్ప పాత్రను పోషించిన మాజీ బీహార్ ముఖ్యమంత్రి శ్రీ సత్యేంద్ర నారాయణ సింగ్ స్వగ్రామం కూడా ఔరంగాబాదే.

ఔరంగాబాద్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటకరంగం

ఔరంగాబాద్ పర్యాటక రంగం పున్ పున్ అనే నది ప్రవహిస్తున్నందున అందమైన సహజ దృశ్యాలతో ఆశీర్వదించబడింది. దీనికి రెండువైపులా చల్హో, ద్వారపాల్ కొండలు ఉన్నాయి. ఈ సహజ భూభాగాలలో స్పటికాలు, గొం, గోమేధికం వంటి విలువైన అనేక రాళ్ళ ఉన్నాయి.

ఔరంగాబాద్ పర్యాటక రంగం కట్టడాలు, ఆలయాలు, మసీదులతో కూడిన అనేక ప్రాంతాలను అందిస్తుంది. సమర్థవంతమైన తరహాలో ఉన్న రవాణా సౌకర్యాలు చక్కటి ప్రయాణాన్ని పర్యాటకులకు అందించి నగరంలో పర్యాటక పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు తోడ్పడ్డాయి.

భారతదేశపు గత చరిత్రలోని నాల్గింట మూడో వంతైన మగధ చుట్టూ ఔరంగాబాద్ సాంస్కృతిక చరిత్ర తిరుగుతుంది. ఈ ప్రాంతాన్ని అశోక చక్రవర్తి, చంద్రగుప్త మౌర్య వంటి గొప్ప గొప్ప రాజులూ పాలించారు. ఇక్కడ మగధి, హిందీ భాషలను ఎంతో ఎక్కువగా వాడతారు.

గయ నుండి విడిపోయిన తర్వాత 1972 లో ఔరంగాబాద్ ఒక స్వతంత్ర జిల్లా అయింది. ఈ ప్రాంత౦ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడి నేల వరి, గోధుమ, చెరకు పండించేందుకు ఎంతో అనువైనది. నీటిపారుదల ప్రణాళిక ఈ ప్రాంతంలోని నేలను ఎంతో సారవంతం చేసి వ్యవసాయానికి అనువుగా మార్చింది.

ఇక్కడి సహజ సౌందర్యం ఎల్లప్పుడూ ధ్యానానికి, మంత్రాలను పటించడానికి సమగ్రంగా ఉన్నందున చ్యవన, భ్రుగు వంటి సన్యాసులు ఇక్కడే తమ సమయాన్ని గడిపారు. ప్రత్యేకమైన ముస్లిం సన్యాసుల సమితిలో తమ భోధనలతో ఈ ప్రాంతాన్ని దీవించిన షా సద్రుద్దీన్ సూఫీ, సయ్యద్ మొహమ్మద్ అల్ఖాదరి బాగ్దాది, షా జలాలుద్దీన్ కబీర్ పానిపటి, మొహమ్మద్ సయీద్ సియాల్కోటి వంటి వారు కూడా ఉన్నారు.

ఔరంగాబాద్ పర్యాటక రంగ౦ కిరీటంలో, దాని నగర జీవితంలో మరొక ఆభరణం దుముహని సంత. ఓబ్ర వద్ద నిర్వహించే ఈ సంతలో పశువుల వాణిజ్య కార్యకలాపాలు ఉంటాయి. తివాచీల అల్లకం పరిశ్రమ కూడా ఓబ్ర లో అభివృద్ధి చెందుతుంది. పున్ పున్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతాన్ని హిందువుల పవిత్ర ప్రాంతంగా కూడా పరిగణిస్తారు.

ఔరంగాబాద్ చేరడం ఎలా:

ఇక్కడకు వచ్చే పర్యాటకుడు ఏ విధమైన ప్రధాన అనుసంధాన మార్గాలనైన ఎంచుకోవచ్చు. ఔరంగాబాద్ కు అన్ని రకాల చక్కటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చక్కటి రోడ్డు మార్గం ఉంది. ఔరంగబాద్ పర్యాటక రంగాన్ని మెరుగు పరచడానికి చాల సమర్ధవంతమైన రవాణా సౌకర్యాలు ప్రధానంగా తోడ్పడ్డాయి.

ఔరంగాబాద్ బీహార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఔరంగాబాద్ బీహార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఔరంగాబాద్ బీహార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఔరంగాబాద్ బీహార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు జాతీయ రహదారుల పుణ్యమా అని ఔరంగాబాదు చక్కటి రవాణా సౌకర్యాలను కల్గి ఉంది. బస్సులు, రిక్షాలు నగరంలో బాగా తిరుగుతాయి. గయా, భోజపూర్, పాట్నా నుండి ఇక్కడకు సులువుగా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ససారాం, ఔరంగాబాద్ కు అతి దగ్గరి రైలు స్టేషన్. ఇది 46 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ఔరంగాబాద్ లో విమానాశ్రయం లేదు. ఔరంగబాద్ కు అతి దగ్గరగా ఉన్న గయా విమానాశ్రయం నుండి భారతదేశంలోని ప్రతి నగరానికి విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి ఔరంగాబాద్ కు ప్రైవేట్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat