ఔరంగాబాద్ - పునరుజ్జీవన చరిత్ర

మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పేరుపైగల ఈ పట్టణం మహారాష్ట్రలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఔరంగాబాద్ అంటే ‘సింహాసనం చే కట్టబడింది’ అని అర్ధం చెపుతారు. ఔరంగాబాద్ నగరం మహారాష్ట్రలో ఉత్తర భాగంలో ఉంది. భారదేశానికి పడమటి ప్రాంతంలో కలదు. ఖామ్ నది కల ఈ ప్రదేశం ఔరంగాబాద్ జిల్లా ప్రధాన కేంద్రంగా కూడా ఉంది. పర్యాటకులకు ఏ మాత్రం అసౌకర్యం లేకుండా అన్ని శాఖలూ సమర్ధవంతంగా వారికవసరమైన ఏర్పాట్లు నిర్వహిస్తాయి.

బీబీ కా మక్ బారా1681 సంవత్సరంలో ఔరంగజేబ్ ఔరంగా బాద్ పట్టణాన్ని తన ప్రచారాలకు ఉపయోగించేవాడు. ఈ ప్రాంతం మొఘల్ సామ్రాజ్య వ్యాప్తికి ఎంతో కృషి చేసింది. ఛత్రపతి శివాజీని యుద్ధంలో గెలిచేందుకు ఈ ప్రాంతాన్ని మొగలాయీలు వ్యూహాత్మకంగా వాడుకున్నారు. ఔరంగాబాద్ భారతదేశానికి మధ్య భాగంలో ఉంది. ఈ ప్రాంతం ఆఫ్ఘన్ మరియు సెంట్రల్ ఆసియా సైన్యాల దాడులనుండి క్షేమంగా రక్షించబడేదిలా వారు పరిగణించేవారు.

ఔరంగజేబ్ మరణానంతరం ఈ నగరం హైదరాబాద్ పాలకుడు నిజం పాలనకిందకు వచ్చింది. ఇండియన్ యూనియన్ లో జత చేయబడేంతవరకు నిజాం పాలన క్రిందే కలదు. 1960 లో ఔరంగాబాద్ మహారాష్ట్రలో కలిసిపోయింది. నేడు ఔరంగాబాద్ లో జనాభా ఒక మిలియన్ కంటే కూడా అధికం. మరాఠి, ఉర్దు భాషలు ప్రధానంగా వ్యవహరిస్తారు.  ఔరంగాబాద్ లో పర్యాటకులు ఏమి చూడవచ్చు?  

ఔరంగాబాద్ పట్టణం మహారాష్ట్ర పర్యటనకు అధికార రాజధానిగా చెప్పవచ్చు. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. గత చరిత్ర వైభవం ఈ ప్రాంతంలో అధికంగా కనపడుతుంది. మొగలాయీల పాలనకు ముందు ఔరంగాబాద్ చరిత్ర వాస్తవానికి బౌధ్ధ మతానికి చెందినది. అజంతా, ఎల్లోరా గుహలు ఆనాడు మన దేశం బౌధ్ధమత ప్రభావానికి ఎంత లోనయిందనే దానికి నిదర్శనంగా కనపడతాయి. చారిత్రక ప్రసిద్ధి కల ఈ రెండు చిహ్నాలు యునెస్కో సంస్ధచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడా ప్రకటించబడ్డాయి.

ఔరంగాబాద్ నగర సంస్కృతి హైదరాబాద్ నగర సంస్కృతిని పోలి ఉంటుంది. ఇక్కడి ప్రజల భాష, తినే ఆహారాలు వంటివి ఘనమైన మొగలాయీ శైలిలో ఉంటాయి. ఔరంగాబాద్ లో మొగలాయీల కట్టడాలు అధికం. ఔరంగజేబు సమాధి ఖుల్టా బాద్ లో ఉంది. ఇది ఔరంగాబాద్ లో ఒక చిన్న పట్టణం. నేటికి అది ఒక గొప్ప పర్యాటక స్ధలంగా ఉంటుంది. బీబి మక్ బారా అనేది ఔరంగజేబు భార్య సమాధి. ఇది చాలావరకు తాజ్ మహల్ ను పోలి ఉంటుంది.  

ఔరంగాబాద్ లో ఏమి చూడాలి? ఏమి చేయాలి?

ఔరంగాబాద్ లో హిమ్రూ ఫ్యాక్టరీ ప్రసిద్ధి చెందినది. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే వివిధ నాణ్యతలుకల అందమైన షాల్స్ పర్యాటకులను ఆకర్షిస్తాయి. సుమారు నాలుగు శతాబ్దాలనుండి ఔరంగాబాద్ సిల్కు వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడకు వచ్చే మహిళలు పైఠాని చీరల కొనుగోలు ఇష్టపడతారు. కొన్నాట్ ప్లేస్ లో విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బిద్రి కళా వస్తువులు కూడా ఇక్కడే తయారవుతాయి.  ఔరంగాబాద్ పట్టణం మధ్యయుగ మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది. బీబీకా మక్ బారా మాత్రమే కాక ఈ ప్రదేశంలో పంచక్కి అనే మరో పర్యాటక ఆకర్షణ కూడా ఉంది. ఇక్కడ బాబా షా ముజఫర్ అనే ఒక సూఫి సెయింట్ సమాధి కలదు. పుర్వార్ మ్యూజియం కూడా చూడదగినది. మూడు మ్యూజియంలు కలవు. అవి సున్ హేరి మహల్, యూనివర్శిటీ మ్యూజియం మరియు ఛత్రపతి శివాజి మ్యూజియంలు.  మరపురాని ఔరంగాబాద్ పట్టణం   ఔరంగాబాద్ పట్టణం వాతావరణం ప్రధానంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలం మరింత హాయిగా ఉంటుంది. వేసవి, చలికాలాలు ఒక మోస్తరుగా ఉంటాయి. అయితే, ఈ పట్టణ సందర్శనకు చలికాలం పూర్తిగా అనుకూలం.

ఔరంగాబాద్ ముంబై నగరానికి 334 కి.మీ. లు మాత్రమే. దేశంలోని అన్ని నగరాలకు విమానం, రైలు, రోడ్డు ద్వారా అనుసంధానించబడి ఉంది. అనేక బస్సులు, ప్రయివేటు వాహనాలు కూడా నడుస్తాయి. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పేరుపడింది.

Please Wait while comments are loading...