Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఔరంగాబాద్ » వాతావరణం

ఔరంగాబాద్ వాతావరణం

ఔరంగాబాద్ పట్టణం వాతావరణం ప్రధానంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలం మరింత హాయిగా ఉంటుంది. వేసవి, చలికాలాలు ఒక మోస్తరుగా ఉంటాయి. అయితే, ఈ పట్టణ సందర్శనకు చలికాలం పూర్తిగా అనుకూలం.

వేసవి

ఔరంగాబాద్ వాతావరణం ఔరంగాబాద్ వాతావరణం సంవత్సరం పొడవునా తక్కువ తేమతో ఆహ్లాదంగానే ఉంటుంది. వేసవి వేసవి మార్చి నుండి మే వరకు ఉంటుంది. ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రతలు 37 నుండి 21 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెంటీగ్రేడ్ గా కూడా నమోదవుతుంది. ఈ  సమయంలో పర్యాటకులు ప్రాంతాన్ని దర్శించరు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు షుమారు నాలుగు నెలలుగా ఉంటుంది. అప్పటివరకు గల వేసవి ఉష్ణోగ్రతలను తగ్గించి ఆనందపరుస్తుంది. వర్షాలు పడిన వెంటనే ఈ ప్రదేశం ఎంతో అందంగా తయారవుతుంది. కొద్దిపాటి జల్లులతో సైట్ సీయింగ్ అనుకూలమవుతుంది.  

చలికాలం

చలికాలం ఔరంగాబాద్ లేదా చుట్టుపట్ల ప్రదేశాల పర్యటనకు చలికాలం అనుకూలం. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు కనీస ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలుగా ఉంటూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.