సపుతర - గాల్వనిక్ విస్టాస్

సపుతర ప్రదేశం గుజరాత్ లోని నీటివనరులు ప్రకృతి మధ్య ఒక స్పష్టమైన తేడాను కలిగి ఉన్నప్రదేశం. ఇది గుజరాత్ ఈశాన్య సరిహద్దు మరియు పశ్చిమ కనుమల సహ్యాద్రి విస్తరణలో రెండో అత్యధిక ఎత్తుకల పీఠభూమిపై ఉంది. సహ్యాద్రి శ్రేణుల డాంగ్ అటవీ ప్రాంతంలో వెచ్చగా ఉండే,సపుతర విస్తారిత పచ్చిక బయళ్లు పెరిగిన పచ్చదనంతో పర్యాటకులకు స్వాగతం, వైవిధ్యం తీసుకురావడానికి చేసిన ఒక సుందరమైన హిల్ స్టేషన్.

పురాణాలతో ప్రత్యేకంగా సంబంధం

పురాణాల ప్రకారం రాముడు తన ప్రవాస సమయంలో దీర్ఘకాలం పాటు ఇక్కడ ఉన్నారని ప్రతీతి. సపుతర అంటే 'సర్పాల నివాసం' అని అర్థం. సపుతర లో డాంగ్ అడవుల్లో ఉన్న జనాభా లో 90% ఆదివాసులు ఉంటారు. మరియు ఈ గిరిజనులు నాగపంచమి లేదా హోలీ వంటి పండగల సమయంలో సర్పగంగ నది ఒడ్డున ఒక పాము ప్రతిబింబమును ఆరాధిస్తారు.

వాతావరణం

సపుతరలో సంవత్సరం అంతా ఒకే వాతావరణం కలిగి ఉంటుంది. ఇక్కడ చల్లని వాతావరణం మరియు సూర్యుని-వేడి కల మైదానాలు తో ఒక ఆదర్శవంతమైన వాతావరణ ప్రదేశం కలిగి వుంటుంది. సముద్ర మట్టానికి 873 మీటర్ల ఎత్తులో ఉన్నా కూడా వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత 28 ° C.మించి ఉండదు.రుతుపవనాల సమయంలో అడవిలో వర్షం పుష్కలంగా ఉంటుంది ,మరియు అడవి మరింత ఎక్కువ ఆకుపచ్చగా అవుతుంది.నవంబర్ నుండి మార్చి వరకు సపుతర సందర్శించడానికి అనువైన సమయం.

అనుసంధానం

సూరత్ కు 162 కి.మీ.ల దూరంలో సపుతర ఉన్నది. మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దు నుండి సపుతర 4కి.మీ.ల దూరంలో మాత్రమే ఉంది. బిలిమోరా అత్యంత అనుకూలమైన రైల్వే అనుసందానము. సమీప విమానాశ్రయం సూరత్ గా ఉంది.

పర్యాటక ఆకర్షణలు

సపుతర ప్రాంతంలో వాగులు ప్రవాహాలు మరియు సరస్సులు వంటి పలు నీటి వనరులు ఉన్నాయి. సపుతరలో హోటళ్లు, ఉద్యానవనాలు, ఈత కొలనులు, బోట్ క్లబ్, థియేటర్లు, తాడు మార్గాలు మరియు ఒక మ్యూజియం వంటి అనేక అవసరమైన సౌకర్యాలతో ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ సపుతర సరస్సు, సన్ సెట్ పాయింట్, సన్రైజ్ పాయింట్, ఎకో పాయింట్, టౌన్ వ్యూ పాయింట్, మరియు మహాత్మా గాంధీ శిఖర్ వంటి పలు ప్రాంతాలు చూడముచ్చటగా ఉంటాయి. గంధర్వాపూర్ ఆర్టిస్ట్ విలేజ్, వంస్డ నేషనల్ పార్క్, పూర్ణ అభయారణ్యం, తోట, రోప్వే, రోజ్ గార్డెన్లు సపుతరలో ఉన్న కొన్ని ఇతర పర్యాటక ఆకర్షణలు. అంతే కాకుండా ఇక్కడ 60కి.మీ.ల దూరంలో గిరా జలపాతాలు ,52 కి.మీ.ల దూరంలో ఉన్న మహల్ బర్దిపర అడవిలో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ని సందర్శించండి. మహల్ బర్దిపూర, పర్యాటకులకు వాకింగ్ మరియు ట్రెక్కింగ్ లను అద్భుతంగా అందిస్తూ,అనేక నదులు మరియు వెదురు ట్రాక్స్ ను కలిగి ఉంటుంది.

సపుతర యొక్క అటవీ పచ్చదనం చూడటం వలన కలిగే ఆనందకరమైన ఆశ్చర్యంను మిస్ కావద్దు. మీరు మీ పర్యటనలో తప్పనిసరిగా గుజరాత్ ను సందర్శించండి.

Please Wait while comments are loading...