సిల్వస్సా-సమూహాల నుండి దూరాన !

సిల్వస్సా, దాద్రా మరియు నాగర్ హవేలి, ఇండియన్ యూనియన్ టెరిటరీ యొక్క రాజధాని నగరం. దీనిని పోర్చుగీసు పాలనలో విలా డి పాకో డి అర్కోస్ అని పిలిచేవారు. ఇది జనసందోహానికి దూరంగా ఉన్నా, సిల్వస్సా, ప్రకృతిని ప్రేమించే ఆరాధకులకు బహుళ ప్రాచుర్యం పొందిన ఒక పర్యాటక ప్రదేశం మరియు బలమైన పోర్చుగీసు మూలాల ఆధారంతో ఘనమైన సంస్కృతీ వారసత్వం కూడా అనుభవిస్తున్న వ్యక్తులకు ఇది ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉన్నది.

సిల్వస్సా,19 వ శతాబ్దం వరకు కేవలం ఒక నిద్రావస్థలో ఉన్న గ్రామం. 1885 సంవత్సరంలో పోర్చుగీసు పరిపాలనలో దరార నుండి ప్రధాన కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1885 లో సిల్వస్సాకు మార్చటానికి ఒక ఉత్తర్వు ఆమోదించబడింది-ఇది ఒక పట్టణంగా మార్చబడింది మరియు విలా డి పాకో డి అర్కోస్ అనే పేరు పెట్టారు. నేడు, సిల్వస్సా, దాద్రా మరియు నాగర్ హవేలి యొక్క ప్రాంతాన్ని అన్వేషించడానికి ఆధారంగా ఉన్నది. వన్యప్రాణి మరియు ప్రకృతి పర్యాటక ఆసక్తి పెరుగుతుండటం వలన ప్రకృతి ప్రియుల కోసం ఒక పర్యాటక ప్రాంతంగా సిల్వస్సా ఒక వేదికగా కొనసాగుతున్నది.

సిల్వస్సాలో మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

మీరు చూడటానికి మరియు చేయటానికి సిల్వస్సాలో చాలా ఉన్నది. ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ప్రత్యేకమైన పోర్చుగీస్ శైలిలో ఉన్న రోమన్ కాథలిక్ చర్చ్ ఉన్నది. దాద్రా మరియు నాగర్ హవేలి అనేక తెగలకు నిలయంగా ఉన్నది మరియు వారి సంస్కృతి, చరిత్ర మరియు సంప్రదాయాలు అర్థం చేసుకోవడానికి, మీరు గిరిజన సాంస్కృతిక మ్యూజియం సందర్శించవచ్చు. వన్యప్రాణి ప్రియులు, వసోన లయన్ సఫారీ చూడాలంటే సిల్వస్సా నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో చూడవొచ్చు.

సఫారీ పార్క్ లో గిర్ అభయారణ్యం నుండి రవాణా చేయబడ్డ సింహాలను చూడవొచ్చు. మధుబన్ ఆనకట్ట దామినీ గంగానది దిగువన సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది వాటర్ స్పోర్ట్స్ యొక్క ప్రేమికులకు ఒక స్వర్గంగా చెప్పవచ్చు. దాద్రా పార్క్, సిల్వస్సా నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మరియు ఇక్కడ ఒక సుందరమైన సరస్సు ఉన్నది మరియు అనేక బాలీవుడ్ పాటలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. సమీపంలోని వంగంగ లేక్ కూడా చిత్ర నిర్మాతలకు మరియు పర్యాటకులకు అభిమానం అని చెప్పవచ్చు.

మీరు దుధ్ని, దమనగంగా నది నుండి ఏర్పడిన ఒక విస్తారమైన నీటి ఫ్రంట్ ను కూడా సందర్శించవచ్చు. ఈ అద్భుతమైన వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను , పశ్చిమ కనుమల అందమైన ఫూట్హిల్స్ చుట్టుముట్టి ఉన్నాయి. లుహారి, అద్భుతమైన అందాన్ని కలిగి ఉన్న స్థలం, రాజధాని నగరం సిల్వస్సా నుండి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మరియు, ప్రకృతి ప్రశాంతతలో మునిగిన ఒక గొప్ప స్థానాన్ని పొందిఉన్నది. సిల్వస్సాకు దక్షిణాన 20 కిలోమీటర్ల దూరంలో ఖన్వేల్ ఉన్నది. ఈ ప్రదేశం వర్డంట్ పర్వతాలతో కూడిన ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో,చుట్టి ఉన్న ఆకుపచ్చ పచ్చికభూములు, పై కప్పుపై ఉన్న తోటలు, మతసంబంధ కుటీరాలతో నిండి ఉన్నది మరియు సకర్తోడ్ నది దట్టమైన అడవులలో ప్రవహిస్తున్నది.

సత్మాలియా డీర్ పార్క్, పేరుకు తగినట్లుగా, అనేక జింక జాతులు మరియు ఇతర జంతువులు కూడా ఉన్నాయి. సిల్వస్సాకు దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో ఒక సాధారణ గిరిజన గ్రామం,కున్చా ను కూడా సందర్శించావొచ్చు మరియు శివుడు గౌరవార్ధం నిర్మించిన బింద్రబిన్ ఆలయాన్ని కూడా దర్శించవొచ్చు.

సిల్వస్సా ఎలా చేరుకోవాలి?

సిల్వస్సా ను రైలు, రోడ్డు మరియు విమాన మార్గం ద్వారా సులభంగా చేరుకోవొచ్చు.

సిల్వస్సాను సందర్శించటానికి ఉత్తమ కాలం

సిల్వస్సాను సందర్శించటానికి నవంబర్ నుండి జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది.

Please Wait while comments are loading...