Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» భావ నగర్

భావ నగర్ – గుజరాత్ యొక్క ప్రధాన వ్యాపార కేంద్రం

32

భావనగర్ గుజరాత్ లో ఒక ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రధానంగా కాటన్ ఉత్పత్తుల వ్యాపారం చేస్తుంది. ఈ నగరం ఎల్లపుడూ సముద్రపు వ్యాపారానికి, రత్నాలకు, సిల్వర్ ఆభరాణాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది.

చరిత్ర

భావ నగర్ ను 1723లో భావ సిన్హజి గోహిల్ కనుగొన్నారు. గోహిల్ వంశస్తులు మార్వార్ నుండి వచ్చి వడవా అనబడే గ్రామంలో స్థిర పడ్డారు. ఆ గ్రామాన్నే ఇపుడు భావనగర్ గా పిలుస్తున్నారు. భావ నగర్ పట్టణం ఒక కోటచే రక్షించ బడుతూ సుమారు రెండు శతాబ్దాలపాటు ఆఫ్రికా , మొజాంబిక్ , జాంజిబార్, సింగపూర్ , పర్షియన్ గల్ఫ్ వంటి ప్రదేశాలతో సంబంధం కలిగి వ్యాపారాలను చేసింది.

అనేక వ్యాపార సంబంధాల కారణంగా భావ సిన్హజి, భావ నగర్ ప్రదేశ్ ప్రాముఖ్యతను ఎంతో పెంచాడు. భావ సిన్హజి వలెనె, అతని వారసులు కూడా వ్యాపారాలను అధికం చేసి, భావ నగర్ అభివృద్ధికి తోడ్పడ్డారు. బ్రిటిష్ వారి పాలనలో అంటే 19 వ శతాబ్దంలో భావ నగర్ స్టేట్ రైల్వే ఏర్పడి ఇండియా లో మొదటి రైల్వే లైన్ కల రాష్ట్రం అయింది. ఆధునీకరణ కారణంగా కథియవార్ రాష్ట్రంలో భావనగర్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. భావ నగర్ మహారాజులు బ్రిటిష్ వారితో సన్నిహిత సంబంధాలు కలిగి వారిచే ఎన్నో బిరుదులు పొందారు.భావ నగర్ ను పాలించిన రాజ వంశం ఎంతో పేరు ప్రతిష్టలను పొందింది.

సాంస్కృతిక నగరం

భావ నగర్ విద్యా పరంగా, సాంస్కృతిక పరంగా అభివృద్ధి చెందటం చేత దీనిని గుజరాత్ యొక్క 'సంస్కారి కేంద్రం' అనేవారు. ప్రసిద్ధి కళాకారులు, రచయితలు , కవులు అంటే నరసింహ మెహతా, గంగా సతి, ఝావేర్ చాంద్ మేఘాని, కవి కాంట్, గోవర్ధన్ త్రిపాఠి వంటి వారు ఈ పట్టణ సాంస్కృతిక వారసత్వాన్ని అభివృద్ధి చేసారు.

భౌగోళికత

భావ నగర్ ఒక తీర ప్రదేశం. గుజరాత్ యొక్క దక్షిణ భాగం లోను ఖామ్భాట్ గల్ఫ్ కు పడమటి గాను కలదు.

వాతావరణం

ఇక్కడి వాతావరణం ఉష్ణమండల తీరు కలిగి, పొడిగా వుంటుంది. వేసవి వర్షా కాలాలు వేడి గాను వుంటాయి. వింటర్ లో మాత్రం టెంపరేచర్ తక్కువ స్థాయిలో వుంటుంది. సముద్రానికి సమీపం కనుక తేమ అధికంగా వుంటుంది.

ఆకర్షణీయ ప్రదేశాలు

ఈ ప్రదేశంలో బ్రహ్మ కుండ్ వంటి చారిత్రక స్థలాలు కలవు. బ్రహ్మకుండ్ అనేది ఒక బావి. సిద్ధరాజ్ జై సిన్హజి కాలంలో ఎంతో అందంగా ఈ బావి వుండేది. దీని నిర్మాణం లో ఎన్నో దేవతల విగ్రహాలు మరియు ఇతర కళాకృతులు చెక్కారు. ఇక్కడ మరో అద్భుత నిర్మాణం నీలం బాగ్ పాలస్. ఇది మహారాజుల ప్రస్తుత విడిది. తక్త సిన్హా జి పేరు పై కల తఖ్తెస్వర్ టెంపుల్ , పాలిటానా జైన్ టెంపుల్స్, గోపీనాథ్ మహాదేవ టెంపుల్, ఖోదియార్ టెంపుల్ మరియు గంగా దేవి మందిర్ వంటివి నగరంలో చూడదగిన మత పర ప్రదేశాలు.

వారసత్వ ప్రదేశాలు

వేలావదార్ బ్లాకు బాక్ నేషనల్ పార్క్ ఇండియాలో ప్రసిద్ధి చెందిన గ్రాస్ ల్యాండ్ పార్క్. అరుదైన జంతువులు బ్లాక్ బక్, యాన్తిలోప్ , హఎనా, నక్క, తోడేలు, బ్లూ బుల్, జంగల్ కాట్, జకల్, వైల్డ్ బొర్ వంటి జంతువులను ఇక్కడ చూడవచ్చు. కనుమరుగవుతున్న పక్షులు వైట్ పెలికన్, మార్ష్ హౌబరా బస్టర్డ్, పల్లిడ్ హర్రిఎర్స్, సారస్ వైట్ స్తోర్క్స్, మొన్తాగు, లెస్సెర్ ఫ్లోరికన్ మరియు ఇతర పక్షలు అయిన స్నేక్ ఎగిల్ , బోనేలి గడ్డ, పెద్ద మచ్చల గడ్డ, పొడవు కాళ్ళ బజార్డ్ మరియు జువెనైల్ ఇంపీరియల్ ఈగిల్ వంటివి కూడా చూడవచ్చు.

పిరంబెత అనేది ఒక ద్వీపం గోఘా సమీపంలో కలదు. ఈ ద్వీపంలో శిధిలమైన కోట ఒకటి కలదు. ఇక్కడ కూడా అనేక కనుమరుగవుతున్న జంతువులు చూడవచ్చు. ప్రకృతి లోని జీవ వైవిధ్యం కనుగొనేందుకు ఇది ఒక మంచి ప్రదేశం.

భావ నగర్ ను గోహిల్వాద్ అని కూడా అంటారు. ఇక్కడ కల గోహిల్ జాతీయులు తమ ప్రదేశం పట్ల ఎంతో గర్వం భావిస్తారు. ఇటువంటి ప్రదేశ సందర్సన తప్పక విలువైనదే.

భావ నగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భావ నగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భావ నగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భావ నగర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం భావ నగర్ నుండి అహ్మదాబాద్, వదోదర, సూరత్ ల లోని వివిధ ప్రదేశాలకు బస్సు లు కలవు. చార్జీలు అధికమైనప్పటికీ బస్సు లు ఎయిర్ కండిషన్ కావున సౌకర్య వంతంగా వుంటుంది. రాజ్ కోట్ , జామ్ నగర్ ల నుండి రెగ్యులర్ బస్సు లు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం భావనగర్ రైలు స్టేషన్ కు గుజరాత్, అహ్మదాబాద్, వదోదర వంటి ప్రధాన నగరాల నుండి రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం భావ నగర్ లోని స్థానిక విమానాశ్రయం నుండి విమానాలు ముంబై వంటి ప్రధాన నగరాలకు కలవు. ప్రధాన విమాన సర్వీస్ లు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మరియు జెట్ ఎయిర్ వేస్ ఈ ఎయిర్ పోర్ట్ నుండి సేవలు అందిస్తారు. భావ నగర్ చేరాలంటే, ఇది సౌకర్య వంతమైన ప్రయాణం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Jun,Mon
Check Out
02 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Jun,Mon
Return On
02 Jun,Tue