బోర్డి - బీచ్ ప్రేమికుల పట్టణం

ముంబై నగరానికి ఉత్తరంగా, మహారాష్ట్రలోని ధానే జిల్లాలో చిన్న పట్టణమైన దహను కు 17 కి.మీ.ల దూరంలో బోర్డి బీచ్ కలదు. ఈ ప్రదేశాన్ని సముద్ర పక్క గ్రామం అని పిలుస్తారు. ఇక్కడి బీచ్ ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా ఉండి పర్యాటకులకు ఆహ్లాదాన్నిస్తుంది. ఈ బీచ్ లోగల ఇసుక స్వతహాగా నల్లటి రంగు కలిగి అంటుకునే స్వభావంతో ఉంటుంది.

బీచ్ లో వరుసగాకల సపోటా చెట్లు ఈ ప్రదేశానికి మరింత శోభ నిచ్చాయి. ఈ బీచ్ స్విమ్మింగ్ చేసేవారికి  ఎంతో సురక్షితమైంది. సముద్రంలోకి సుమారుగా ఒక కిలో మీటర్ దూరం వెళ్ళినప్పటికి నీటి మట్టం మీ నడుము పైవరకూ కూడా రాదు.

ముంబై నగరంనుండి బోర్డి 153 కి.మీ.లు మాత్రమే. ఈ పట్టణంకు సాధారణంగా ముంబై లేదా సమీప ప్రాంతాల ప్రజలు కూడా రారు. అధిక జన సమ్మర్దం లేదు కనుక పర్యాటకులకు ఈ గ్రామ అందాలు, ప్రశాంతత ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి.  వారు వారి ఇష్టం వచ్చిన రీతిలో సహజత్వాన్ని అన్వేషించుకోవచ్చు.  ఒక బీచ్ టవున్ గా బోర్డి పర్యాటకుడికి ఎన్నో సుందర దృశ్యాలను అందిస్తుంది. విశేషత కల ఈ వాతావరణంలో బోర్డి కోరిన వారికి చక్కటి సూర్యరశ్మి స్నానాలు, సపోటా తోటల విహారం లేదా మీ ప్రియుడు లేదా ప్రియురాలితో కలసి చేయదగిన విహారాలు మీకు అందిస్తుంది.  బోర్డిలో మీరు తప్పక చూడదగిన ప్రదేశాలు ఏవి? పైన వివరించిన రీతిలో బోర్డి ఒక చక్కటి విహార ప్రదేశం. సముద్రపు ఒడ్డున నడక లేదా గుర్రపు స్వారీ వంటివి చేయవచ్చు. ఈ ప్రదేశ అందాలను పరిరక్షించేందుకు మహా రాష్ట్ర అటవీ సంరక్షణ శాఖ నడుం కట్టడంతో ఈ బీచ్ ఏ రకమైన కాలుష్యం లేక పర్యాటకులకు, సందర్శకులకు చక్కటి అనుభూతులు కలిగిస్తోంది.

బోర్డి జొరాష్ట్రియన్లకు ప్రత్యేక మత కేంద్రంగా పవిత్రతను అందిస్తోంది. జొరాష్ట్రియన్లకుగల ఇక్కడి మక్కా గత శతాబ్దానికి పైగా వీరి పవిత్ర అగ్నిని ఆరకుండా వెలిగిస్తోంది. ఇక్కడ కల బోర్డి ప్రజలు అధిక భాగం పార్శీ జాతి వారు. వీరు అసలైన పార్శీ ఆహారాలు మరియు యాత్రికులకవసరమైన వసతి ఏర్పరుస్తారు.

ఇక్కడినుండి సుమారు 8 కి.మీ. ల దూరంలోగల బహరోట్ కొండలలోని బహరోట్ గుహలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కొండలు సుమారు 1500 అడుగుల ఎత్తు కలిగి పార్శీ తెగ వారికి ఎంతో పవిత్రమైనవిగా ఆరాధించబడతాయి. సమీపంలోని మల్లినాధ్ జైన్ తీర్ధ దేవాలయం జైన్ మతస్ధులు గౌరవించే మరో ప్రదేశం. ఈ ప్రదేశంలో రిషభ్ ప్రధాన దైవం. ఇది ప్రభాదేవి హిల్స్ లో కలదు.

కల్పతరు బొటానికల్ గార్డెన్ ఇక్కడకు 10 కి.మీ.ల దూరంలో అంబర్ గాంవ్ లో కలదు. సమీపంలోనే బృందావన్ స్టూడియోలు కలవు. ఈ ప్రదేశంలోనే మహాభారత మరియు రామాయణ వంటి టి.వి. సీరియల్స్ షూటింగ్ చేశారు. ఒకప్పుడు జైలుగా ఉపయోగించిన దహాను కోట నేడు భారతదేశ వారసత్వ సంస్కృతిని తెలియజేసే చారిత్రక చిహ్నంగా కనపడుతుంది.  వర్షాకాలం వెళ్ళిన తర్వాత చలికాలం వచ్చిందంటే చాలు ఈ ప్రదేశాలను దర్శించేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంత సందర్శన అనుకూలమే. 12 డిగ్రీల సెంటీగ్రేడ్ కనీస ఉష్ణోగ్రతలతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.  బోర్డి చేరాలంటే, విమాన, రైలు మరియు బస్ లలో చేరవచ్చు. సమీపంలోనే ముంబై నగర మెట్రో లభ్యంగా ఉంటుంది. విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం. రైలు మీద ఈ ప్రదేశానికి రావాలంటే, దహను రోడ్ స్టేషన్ సౌకర్యంగా ఉంటుంది. రోడ్డు ప్రయాణంలో రావాలనుకునేవారికి ముంబై సమీపం. ముంబై నుండి ప్రభుత్వ బస్ లు మరియు ప్రయివేట్ బస్ లు కూడా లభ్యంగా ఉంటాయి.  రవాణా పరంగా అన్ని విధాలుగా తేలికగా చేరగల ఈ బోర్డి బీచ్ టవున్ వారాంతపు సెలవులకు ఎంతో అనుకూలం. నగర ఒత్తిడి జీవితాలను ఎంతో ప్రశాంత పరచి మీకు విశ్రాంతినిస్తుంది. బీచ్ లో పడక లేదా సూర్య రశ్మి స్నానం, లేదా సహజ నడక లేదా బీచ్ లో ఈత కొట్టటం వంటి వాటితో ఆనందించవచ్చు. నీరెండ సూర్య రశ్మిలో బంగారు రంగులు బీచ్ అంతా పరచుకొని చూపు తిప్పుకోకుండా చేసే అందాలు కనపడతాయి.

Please Wait while comments are loading...